Monday 24 October 2011

నీ జ్ఞాపకాలలో ఎప్పటికి

అలనాటి ఆ చిన్ని పెదవుల పై విరబూసిన ఆ చిరునవ్వులు ఇంకా నా మదిలో అలానే ఉన్నాయి
నిన్ను కలసిన నాడు కలిగిన ఆనందం పన్నెండేల్లైన ఇంకా నా మనసు ఆ ఘడియ ని మరిచిపోనే లేదు
నీకోసం నేను రాసిన మొదటి కవిత అలానే కాల గర్భం లో కలిసిపోయిన నా జ్ఞాపకాల దొంతెరలో ఇంకా ఇమిడే ఉంది
నువ్వు కోప్పడిన ఆ క్షణాలు, ఉవ్వెత్తున ఎగసే ఉప్పెన లాంటి నీ స్వభావం నన్నెంతగానో బాధించాయి
ఇన్నేళ్ళ మన పరిచయం లో నవ్వుల కన్నా నితుర్పుల సెగలే నా భావాత్మక సరళి ని మార్చి వేసాయి

నెల పరిచయం కోసం ఆరు నెలలు ద్వేషం లో మునిగి తేలే ప్రపంచం లో అత్యధికంగా పంనేడు సంవత్సరాలు నీ జ్ఞాపకాలతోనే ఇమిడిపోయాయి

నీకు చెప్పాలనిపించే భావమైన బాధైన కవితల రూపం లో అలల మాదిరిగా ప్రవహిస్తూనే ఉన్నాయి. నా తోలివలపువి నువ్వే నా తోలిరిపువి నువ్వే నా కవితల సమాహారం లో దాగి ఉన్న శక్తివి నీవే సుమ.
ఏళ్ళు దాటిపోవచ్చు కాని నా ఈ జ్ఞాపకం లాంటి కల , కల లాంటి నిజం నిజం లాంటి అబద్దం అబద్దం లాంటి ఆశ ఎప్పటికి నిన్ను నీ చిలిపి తనాన్ని , నీ జ్ఞాపకాలని ఎప్పటికి మరిచిపోను ౨౧౪౧౩౧