Posts

Showing posts from March, 2012

సహనం

విరిసే పువ్వు వీచే గాలికి పరవశించి పోతుంది వెలిగే దివ్వె జ్యోతిని ప్రజ్వలింప చేస్తుంది నడిచే దారి కాన రాక ఎటో పయనిస్తున్న బాటసారికి ఓ వెలుగు తన గమ్యం వైపుకు మళ్ళిస్తుంది ఆకాశం ఎత్తుగా ఉన్న అందులోని నక్షత్రాలు ఎలా మనవైపు వెలుగును పంచుతుందో అలాగే మనం కూడా ఎదిగిన కొద్ది మనల్ని ఇంట స్థాయికి తెచ్చిన మన తల్లిదండ్రులకు  ఎప్పటికి ఒదిగి ఉండాలి ఈ వెన్నెల వెలుగులు ఈ తిమిర సమీరాలు రేపటి ఉదయం వరకే .. ఆ ఉదయం కొత్త శక్తిని బలోపేతం చేస్తూ కష్టాల కడలిని దాటించి వేస్తుంది అదిగో మనం అనుకున్న దివి అలలమాటున దాగి ఉంది వెతికి అక్కడికి చేరుకుంటే ఆ గుప్త నిధి మన మేధో శక్తీ మనల్ని ఎంతో ఎతుకు చేరవేస్తుంది మన గమ్యం ఎంతో దూరం లేదు రండి లేచి అటు వైపుగా అడుగులు వేద్దాం ... ఓ మహోన్నతమైన ఆంధ్రావని ని కళల భారతావనిని రుపుదిద్దుకుందాం

Aatmeeyata

తళ్ళుక్కు మనే తారలు పొదిగిన ఆకాశం చూడాలంటే నీలాల నింగి కి రంగులు అద్దాలి వేవేల తీరాల దూరం వెళ్ళాలన్న నిలకడగా సాగిపోవాలి వేణు గానం వినాలన్న మురళిలో గాలి ఊపిరి భావం తో ఎగసి పడాలి ఈ కవిత్వం నిండు భావం తెలియలన్న భావుకతతో మనసు లీనమై రాగ ద్వేషాలకు తావివ్వకుండా కలిసిమెలిసి పోవాలి అదే ఆత్నీయత భావం అదే అన్నిటికన్నా మనషులకు తెలిసిన కనక సోపానం రెక్కలు లేని మనిషికి ఆశయాలున్డాలి పైకేదగాలనే తపన ధ్యాస ఉండాలి మాటలు నేర్చిన మనిషికి మనసును అర్ధం చేసుకునే భాష రావాలి