Posts

Showing posts from August, 2012

Life

Image
Family is just like a pair of tracks with Joy and Gloom running in parallel all through our journey, Emotions are like fish plates that keep balance of the Joy and Gloom so that they cannot mess up. Even if one of the tracks is missing, the Train called Life gets de-railed. Relationships are the track pins that hold the Emotions and Joy and Gloom together. Gravel shows the relationship between siblings, they should always be harsh to others criticizing them but should support the whole Family. Parents are supporting Electric Tractions, who direct us towards our destination by their power of will.

తపన

రోజు అలానే తెల్లవారుతూ ఉంది అలానే చీకటి పడుతూ ఉంది ... ఈ రేయి చీకటికి ఆ పగటి వెలుగుకి ఎంతో  వ్యత్యాసా ఉంది కాని ఆ వెలుగు కి ఈ చీకటికి మధ్యన ఏదో చెయ్యాలని తపన హాయికలిగితే నవ్వగలిగే మనస్తత్వం ఉంది బాధగా ఉన్నపుడు ఎవరికైనా చెప్పి సాంత్వన పొందే అవకాశం ఉంది .. ఈ ఇరు భావాల మధ్య సగటుగా ఉత్సాహంగా ఉండాలని ఏదో తపన ఈ జీవితం మనల్ని వెతుక్కుంటూ రాదు మనకి దేవుడు ప్రసాదించే ఊ అవకాశం ఓ వరం నిరుత్సాహానికి ఉత్సాహానికి మధ్య  ఏమైనా ఉన్న మన మనసులో మెదిలే భావాల కలయికే సుమీ నిట్టూర్పులు ఉన్న ఆహ్లాదంగా ఉండాలన్న భావనే మనిషిని మనిషిగా గుర్తిమ్పునిస్తుంది అల ఉప్పెన లో ఉన్న తపన కొద్ది ఒడ్డుకి వస్తు ఉంటుంది మన మనసుకూడా అపుడప్పుడు తడబాట్లను తట్టుకో గాలిగే ఓ ఆశల కడలి లా పెను సంద్రం ల మారాలి అలా మారితేనే జీవికి జీవించాలనే తపన యద నుండి పొంగుకు వస్తుంది  మన చుట్టూ ఉన్న ఈ లోకం మన మీద నిందలు వేసిన వాటిని భరించే శక్తి ఆ దేవుడు మనందరికీ ఇస్తాడు ... సరైన సమయం లో అది వాడుకుంటే ఈ లోకాన్ని జయించినంత సంతోషం మనకు కలుగుతుంది అదే జీవిగా ఓ మనిషిగా మనం అందవేసే ఓ చిరు స్వప్నం. ఆ చిరుస్వప్నాన్ని అందుకోవాలని జనాల మనసులో ఎప్

నిరీక్షణ

రెప్పపాటు కాలం చాలు మంచిని చెడు అనుకోవడానికి క్షణికావేశం చాలు నిలువెత్తు మనిషిని జీవం లేని బొమ్మల మార్చడానికి  కల్మషాలు నిట్టూర్పులే మనిషిని బెదర గోడుతున్నై .. అదే రెప్పపాటు కాలం లో మంచని మంచి అని గుర్తించే వారే అరుదుగా లభిస్తున్నారు ఈ కాలం లో ఆప్యాయతలు కనుమరుగై కోపాలు గొడవల ధాటి కి ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న బొమ్మరిల్లు నేడు పునాదులు కూడా కదిలిపోయి శితిలవస్థ లో ఉన్న కుటుంబాలు నేటి కాలం లో ఎన్నో ఎన్నెన్నో .. మనషుల మధ్య సానిహిత్యం భావాల మధ్య సారుప్యత ఈ కాలం లో ఎడారి లో ఎండా మావులే వెండి వెన్నెల ని ఆస్వాదించే కాలం ఎప్పుడో కాలగర్భం లో కలిసి పోయింది ... మనశులమైతే ఉన్నాం కాని మనలోని మానవత్వం ఎప్పుడో కాని బయట పడదు ... ! మనషుల మధ్య ఆదరణ పోయి ఘర్షణల అఘాధం ఉంది .. సుమాల వాడు లో నేడు కుసుమాలకి బదులు మురికి నీరు ప్రవహిస్తున్నట్టుగా గబ్బుగా తయారయ్యింది నేటి సమాజం. ఇవన్ని మారిపోయి మనషుల మధ్య సంధి కుదిరి అందరిలో మమేకమై ఆనందాలు పంచుకునే రోజు కూడా వస్తుంది ... అది ఏంటో దూరం లో లేదు... ఇక నిరిక్షనే చెయ్యాలి మనం.  Disclaimer: This poem does not pin point any person or anyone in general and sh