అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి

అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి
పదాల కూర్పులో నా ఎదుట కవితయ్యి నిలిచినాయి
 బాధగా వుంటే పదాలే తారు మారయ్యి  నవ్వు తెప్పించాయి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి
కవితలో ప్రతి పదం మేమే అంటూ భావమై నిలిచాయి
కొన్ని అచ్చులు కొన్ని హల్లులు కలగలిపి చిందాడాయి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి
పలకలేని భాషను సైతం వాటిలో దాగి వున్నాయి
పలకరిస్తే కవితల మాలలో నిగుదితమై పులకించాయి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి
అ ఆ లు నాతొ ఆటలాడుకున్నాయి 

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

జీవిత యుద్ధం