Posts

Showing posts from March, 2011

వెంకటేశ్వర సుప్రభాతం With Meaning

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్‌ 1 తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2 తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము. మాతః సమస్త జగతాం మధుకైటభారే: వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ 3 తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక. తవ సుప్రభాత మరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే వృషశైలనాథయితే దయానిధే. 4 తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖము...