Posts

Showing posts from June, 2013

ప్రకృతి సోయగాలు

Image
Image Courtesy: Patrice Sery (Picasa)  Image Courtesy: Kelly De Lay (Picasa) పూల పరిమళాలు తన వెంట తెచ్చే ఆమనిని ఆస్వాదించాలంటే ఉన్న సమయం చాల తక్కువ చిటపట చినుకుల అందేలా రవళి తో తన్మయత్వం తెచ్చే వర్ష కాలానికి వ్యవధి తక్కువ లేలేత కుసుమాలు వన్నెల రామ చిలకలు చిన్నారి చిందులు చూడాలంటే మక్కువ ఎడారి లో వర్షం పడితే వింత. భావం అర్దమయ్యేది మేధాకైతే స్పందన హృదయం లో తెలుస్తుంది హృదయానికి తెలిసిన వెంటనే ఏ సంబంధం లేని కన్నులనుండి దారాలు గా కన్నీరు రాలుతుంది మనసుని ఆహ్లాదపరిచే ఆమని కి నిడివి తక్కువ ఐన చూసే కన్నులకు పండుగ అవుతుంది రెక్కల సీత కోక చిలుక తన వెంట ఆకాశం లో రంగుల్ని పోగేసి చీర చుట్టుకున్నట్టు వెన్నెల అందాలు కంటికే కలత తెచ్చి పెట్టె చీకటికే పరిమితమై సొంతమైనట్టు గాలికి తనతో పాటు రెక్కలు తొడిగి కొత్త ప్రదేశాలకు వెళ్లినట్టు మనసు మమత ఆప్యాయత రంగరించి రంగుల హరివిల్లు ఆకాశ వీధిలో ప్రకాశిస్తుంది వెండి వెన్నెల మాటున నిండు జాబిలీ మబ్బులతో దాగుడు మూతలు ఆడుతుంది వేల చుక్కల సాక్షిగా తన కఠోర స్వభావం విడిచిపెట్టి  తిమిరం ఉషోదయం  అవుతుంది  

కవితంటే :

సుందర సుమనోహర సునిశిత భావాలంకృత పదబంధం అది ఎలా ఉన్న దానిలోని అంతరాత్మ మన అంతరాలను చెరిపి వేసే ఓ అక్షర వాహిని మదిలోని భావాలను కట్టడి చేసి ఓ దారిలో పెట్టె ఆనకట్ట భావాలను ఏర్చి కూర్చి సమతుల్యత కలిగించే అక్షర నిధి మదిలోని ఆలోచనలన్నీ కలగలిపి మాటల్లో చెప్పలేని దాన్ని పలకరించే పెన్నిధి ఎన్ని జనమలైన తరిగిపోని ఎంత లోతుగా ఉన్న మదిలో తేలే కమ్మని మృదు తరంగిణి మనిషి మస్తిష్కం నుండి వెలువడే భావ తరంగ ధ్వని మూగాగానైన తన భాషను ఇతరులతో పలికించే స్వరాల హరివిల్లు అన్ని కాలాలకు వసివాడని ఓ కమ్మని అనుభూతి అన్ని కాలాల్లో ఒకేలా ఉండే ఓ అపురూప భావాల ఝరి ఎంతటి బాధనైన తనలో ఇనుమదిమ్పచెసె ఓ రాగాలాపన భావాల మంజరి ఎలాంటి భావాన్నైనా అలవోకగా పలకించే అలివేణి ఆణిముత్యం 

ముసుగు

కన్నులు మూసి మనసు ద్వారం తెరిచి లోపల  తొంగి చూసా కన్నులు చూసింది చూసినట్టే ఉన్న ఆ కొలను లో బాదతాప్త అశ్రువులు పొంగి పొర్లుతున్నాయి ఏవో ఆలోచనలు ముసిరి గొంతుచించుకుని అరచిన వినపడలేదు ఆ ఆలోచనల మాటున ఏదో ఆవరించినట్లు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో బయటకు లబ్ డబ్ మంటూ  లయబద్దంగా వినిపించే హృదయ స్పందన లోలోపల మాత్రం లయ తప్పింది ఏదో తెలియని వెలితి ప్రస్ఫూటముగా కానవస్తుంది. కోయిల కూస్తూ ఉన్న స్పందన కరువయ్యింది వసంత మాసం ప్రకృతి ఐతే తెచ్చింది కాని మనసుకి మాత్రం గ్రీష్మ ఋతువే అన్నట్టు విలవిల్లాడుతుంది ఆ తాపం మాటున ఏదో తెలియని గాయం రేగుతున్నట్టు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో ఏదో దక్కి దక్కకుండా చిక్కి చిక్కకుండా వెక్కిరించి వెళ్లినట్టు మనసు వెక్కి వెక్కి ఏడుస్తుంది నాకు అది తెలుస్తూనే ఉంది ఆ తాపం ఆ విరహం ఆ తడి కన్నుల ఆరాటం లోలోపల మోమాటం వెన్నెల వేడిమి లో ఎండా చలి కాస్తున్నట్టు ఏవో తారుమారు ఆలోచనలతో మనసు మనసులో లేదు ఆ వైపరీత్యాల మాటున ఏదో వ్యాకులత దాగి ఉన్నట్టు ఉంది మనసంతా కాకవికలమౌతు ఉంది ముసుగు లో 

క'వనం'

  అలా ఒక సారి నేను ఈ వనములో అడుగుపెట్టా  నా భావాలను తన వేరులుగా మలిచి నిటారుగా  ఎదిగి ఒదిగిన కవి'తరువుల్ని' చూసి తన్మయత్వం తో మురిసిపోయా    నా భావాలు ఇందులో అలరారుతూ అలుపెరుగక ఊయలూగుతూ  ఆ కమ్మని నీడలో సేదతీరుతు  పలకరిస్తున్న మీ అందరికి  ఆరేళ్ళుగా మీ ఆదరాభిమానాలు చొరగొంటున్న ఈ కావ్యలఝారి ని  ఆశిర్వదిస్తునందుకు పేరు పేరున అందరికి నమః సుమాంజలి 

యశోద-కృష్ణ

మిక్కిలి కోపము అటు పిమ్మట శాంతం ఇలా నవరసంబుల సమ్మేళిత పీతవసన ప్రియ బాంధవుడు గోపికల నాయన మనోహరుండు శ్రీ కృష్ణ పరమాత్మగున్ ఇచ్చిన మాటను చేసిన బాసను మరువకన్ వెలసి వచ్చినాడు  నాడు వసుదేవుని తో కాళింది కడలిలో మమేమకమై తన రాక తో బృందావనం వేల రెట్లు ప్రజ్వలోజ్వాల కాంతులీనుతూ మురిసెన్ లొకాలొకముల్ కాంతిని విరజిమ్ముతూ నాయనానందకరమగున్ ఆ బాలున్ని కాన వచ్చెన్ గొల్లభామల్ ఇదేట్లున్నను వెన్నలు చిలికి వన్నెల రాగం లో పిల్లనగ్రోవి తో రాగాలాపన చెయ్యుచుండేన్ పుట్టింది దేవకీ మాత ఎచటో పెరిగింది యశోదమ్మ  చెంత అలరారే శిఖిపించము వెన్నలు చిలికిన కొంటె పనేమీ చేసినను ముద్దు మురిపెం తో మన్ననలు పొందేన్ యశస్సులు కూడగాట్టేన్ చూడరే అది ఏమి చిత్ర విచిత్రమో గాని కాళింది ఒడ్డున బృందావని లో గోపిక మనః చోరుడు అనంత లోకాల పాలిటి సుఖఃదుఖః సమానశీలుడు మన ఎదుటే తిరిగిన ఆ గోపిలోలుడు గోపబాలుడు గోవిందుడు 

వేచి ఉన్న

నా ఎదుటే ఇన్నాళ్ళు ఉన్నావు మరి నన్నెందుకు  విడిచి  వెళ్ళాలని అనిపించింది? నిన్నాపే  ధైర్యం నాలోలేకన లేక నీ కోసం నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాననా ? ఎడారిలో మంచు బిందువులు సేకరించాలని చూసా నేను కాని ఇసుక రేణువు మధ్యలో ఇరుక్కుపోయా నీ కోసం జాబిలి చల్లదనాన్ని వెంట పెట్టుకొస్తే వెంటనే సూర్య రశ్మికి వేడెక్కి నా ఎదనే కాల్చి వేసాయి నీ మౌనన్ని అర్ధం చేసుకున్న నీ ఆరాటం ఏమిటో కనుగొన్న కాని మనసు మాట ఎన్నటికి వినలేక పోయా అందేల సవ్వడిని ఆస్వాదించ నీ రాక ని గమనించి ఓ వాసంతమ మరలి రా నా వాకిట్లోకి నవ్వులనే పుష్పాలతో అలంకరించి గుండెల కొలను నుండి నీకోసం వేచి ఉన్న చూడు నిండు జాబిల్లి వెలుగుల కోసం కలువ భామ వేచి చూస్తున్నట్టు  

ఆ ప్రాణం నువ్వే

నిన్ను వర్ణించాలని ఎంతో తపన పడ్డాను నిన్నెంతగా ఆరాదిస్తున్ననో నీకు తెలపాలనుకున్నాను నిన్ను నా మదిలో ఎప్పటిలాగే నిలుపుకున్నాను భావాల కెరటం ఈదాలని తాపత్రయపడ్డాను తీరా ఇప్పుడు వర్ణి ద్దామంటే భావాల సుడి లో నా అక్షరాలన్నీ చిక్కుకుని అందని తీరాలకు ఎగిరిపోయి రెండే రెండు అక్షరాలూ ఇలా మిగిలాయి నా ఊహల్లో నిన్ను తలుచుకుని రాసుకున్న ఈ కవిత్వాన్ని చూసి మది పులకించిపోయింది కాని భావం లేని నా కవిత కి ప్రాణం ఒక్కటే తక్కువయ్యింది ఎందుకంటే ఆ ప్రాణం నువ్వే కాబట్టి 

నీవైపే

అల్లంత దూరం లో వేచి చూస్తున్న నన్ను ఏదో రాగం ఇలా కమ్మేసింది కారుమబ్బులు వచ్చి సూర్యున్ని కమ్ముతున్నట్టు వడి వడిగా అడుగులేస్తూ వెళ్తున్న నాకు ఏదో తరాస పడట్టు నీవైపే లాగుతుంది ఎక్కడినుండి వస్తుందో తెలియదు కాని ఈ వసంత మాసం నన్ను తనలో లీనం చేసుకుని పరవసిస్తున్నట్టు రెపరెపలాడుతూ ఎగురుతున్న గాలిపటమై నీ చెంతకు రానా ఓ చెలి నా లోని భావాలు కూడగాలిపి నీకోసమని ఓ సుమధుర కావ్యాలంకరణ చెయ్యన ఓ చెలి నిండు హృదయం లో నిగుడితమై ఉన్న నా ప్రేమను నేనెట్ల నీతో చెప్పేది అందుకని నీకోసమని నిన్ను ఇందులో పోల్చుకుంటూ రాసుకున్న కావ్యం ఇది 

ఏమని చెప్పాలి

వేకువే ఎరుగని చీకటితో ఏమని చెప్పగలం : నీ ఎదుటే వేలుగుందంటే అది చూడలేదు నడకే తెలియని పసి మనసుని ఏమని చెప్పగలం: నీ ఎదుటే నడుస్తున్న అది నడవలేదు మంచి తెలియని వారికి ఏమని చెప్పగలం: నీ ఎదుటే మంచి చేసిన నమ్మేటట్టు లేడు మనసుకి తెలిసిన కల కళ్ళలో కనురెప్పల మాటున మొదలవుతుంది: అది నాలోని ఆలోచనల సరళి అంటే నమ్మేవాళ్ళు చాల అరుదు , నా లోని ఇన్ని భావాలు ఇంకి పోకుండా ఇలా పైకి తెలుతున్నయంటే నాకే తెలియని ఇన్ని ఆలోచనల నడుమ నేనిన్నినాళ్ళు నాకే తెలియని ఓ ప్రపంచం లో గోముగా నిద్రించి ఉన్నానా అని అనిపిస్తుంది 

వనజ వనమాలి

మంచుకొండలపై  అలరారుతున్న  మంచు బిందువుల సాక్షిగా  ఎడారి లో కనులవిందు చేసే మరుద్యానం సాక్షిగా  మబ్బుల హృదయం కరిగి  రాలే ముత్యపు  చినుకుల  సాక్షిగా వెండి  జాబిలీ లో ఇమిడిన ధవల కాంతుల సాక్షిగా  మనిషిలో నిగుడమైన  నవరసాల సాక్షిగా  జలపాతం లో దాగి ఉన్న హోరు సాక్షిగా  ప్రకృతి  పూదోట కు వనజ వనమాలిని అలుపె ఎరగక పయనిస్తున్న బాటసారిని భావాల అలలను తాకి ఉవ్వెత్తున ఎగసే కడలి కెరటాన్ని 

Definition of Life

Life: A Bundle of Happiness Life: A Bundle of Hopes Life: A Bundle of Sweet Memories Life: A Bundle of Serene Thoughts

ఆశల కిరణం

Image
ఇమేజ్ కర్టసీ: అల్లన్ కబ్రెర (పికాస) Image Courtesy: Allan Cabrera (Picasa)   ఎప్పుడైతే నీ మనసు కాకవికాలం అవుతుందో ఎప్పుడైతే మోడువారిన చెట్టులా నీలోని దాగి ఉన్న మెరుపు నిర్వీర్యం అవ్వుతుందో ఎప్పుడైతే నిన్ను అన్ని వైపులా నిరాశ నిశ్ప్రుహలు కబలించి వేస్తాయో ఎప్పుడైతే నీ కంటికి చీకటి తప్ప వేరేది ఏది కనబడలేదో ఎప్పుడైతే నిన్ను నువ్వే అర్ధం చేసుకోలేదో అప్పుడు మేఘం కమ్మిన ఆ చిరు చీకటిని చీల్చుకుంటూ నీ దరికి ఓ ఆశల కిరణం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎప్పుడైతే నీకు నీపైనే నమ్మకం పోతుందో ఎప్పుడైతే నీ స్వరం నీకే వినపడదో ఎప్పుడైతే నిండు కుండలాంటి నీ గుండెలో ప్రేమ తడి ఆవిరైపోతుందో ఎప్పుడైతే నీ గుండె చప్పుళ్ళ అలికిడి నిన్ను తరుముకోస్తుందో ఎప్పుడైతే నిన్ను నువ్వు అర్ధం చేసుకోలేదో అప్పుడు మేఘం కమ్మిన ఆ చిరు చీకటిని చీల్చుకుంటూ నీ దరికి ఓ ఆశల కిరణం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది  

నిఖార్సైన ప్రేమ

Image
ఇమేజ్ కర్టసీ : అమన్ అనురాజ్ (పికాస) నిఖార్సైన నిజమైన ప్రేమ కు నిర్వచనం ఏది? అది స్వచ్చమైన అమ్మ ప్రేమ లో విరబూస్తుంది వెన్నెల వెలుగులు జిలుగులై మెరుస్తూ ఉన్న చంటి పాప కన్నుల్లో ప్రతిబింబిస్తుంది కనుల కొలను లో జ్ఞాపకాల దొంతెరాల మాటున కలల పొదకు పారే తీపి జ్ఞాపకం చిటపట చినుకుల్లో తడిసిన పుడమి తల్లి మమతల పోట్టిలలో పెరిగే మొక్కకు ఉపిరులన్దించె ఓ వరం పుడమి తల్లి కడుపును చీల్చుకు పుట్టే ప్రతి మొక్కలో తన అపారమైన శక్తి దాగి ఉంది ప్రతి సంద్రపు అలల మాటు రేగే ఓ ఉద్విఘ్న భరితమైన మంత్రం ఈ ప్రేమంటే  

Wings of Thoughts

Image
Image Courtesy: Alex Koloskov (Picasa) If thoughts get wings, they fly out of the brains and make creativity get a long life If thoughts get wings, they make every impossible things possible If thoughts get wings, they penetrate you from all directions and give a halo of virtue Preserve your thoughts they are very much valuable and reach out for skies as a bird and fly to your destination easily without any hurdles or breaks or Brakes.

కవితల తోరణం కవితలతో రణం

నేను నవ్వినపుడు నా నవ్వును నీతోనే పంచుకున్నాను నాకు బాధకలిగిన క్షణం నీ ఒడిలోనే బాధను తెలుపుకున్నాను నీతో నా ప్రతి సంతోషం పంచుకుని ఆనందించాను నా ప్రతి భావాన్ని నువ్వు అర్ధం చేసుకుని అంతే ఓర్పుతో నా భావాల్ని నీవిగా నీలోనే దాచుకున్నావ్ నా ప్రతి అడుగులో అడుగులేస్తూ వస్తున్నా నిన్ను ఈ ఆరేళ్ళుగా అక్కున చేర్చుకున్నాను అందుకే నా భావలన్నిటిని ఎంతో పతిలంగా దాచుకున్న నువ్వంటే నాకెంతో ప్రీతి వెన్నెల వానలు చిలికిన జాబిలీ తరిగి పోదు అలానే నా ఈ భావాలోచన ఎన్నటికి కరిగిపోదు నా భావాలను అక్షరాల రూపం ఇచ్చి ఉంచుతున్న నీకు ఆ అక్షరాల పూలనే ఓ మాల లా పేర్చి అభివాదం చేస్తున్న నాలోని ఈ భావావేశాన్ని తట్టుకునే స్తోమత నీలోనే నిగుడి ఉందని తెలిసి పులకించిపొయాను అందుకే నిన్ను నేను ఎన్నటికి మరిచిపోను, నా ఆలోచనకి సారుప్యత ఇచ్చిన కావ్యమాలిక నా "కావ్యాంజలి" అంతర్జాల దైనందిని కి నేను ఎప్పటికి నా నవరసాలు చిలికిన పంచభక్ష్య పరమాన్నం లాటి కవితల తో అభిషేకం చేస్తూనే ఉంటా నోట్: నా బ్లాగ్ ని మానవీయ కోణం లో ఆవిష్కరిస్తూ రాసిన కావ్యం ఇది 

అలకనంద

Image
Image Courtesy: Jason Jakober, Picasa నీ మనసు ఘన మంచు దిమ్మనుండి పారే సెలయేరు అవ్వడానికి ఐదేళ్ళు పట్టింది నీ ప్రేమ ప్రవాహం లో ఇద్దరం మునకలేసి పదేళ్ళు దాటింది నీ మనసు లో నాపై నిష్కల్మషమైన ప్రేమ దాగుంది అని తెలియడానికి ఇంకో ఐదేళ్ళు పట్టింది ఈ పదేళ్ళలో మన మధ్య చిగురించిన ప్రేమపు ఏటి పాయ మండుటెండను తట్టుకోలేక ఆవిరి గా మారింది ఈ రెండేళ్లుగా ఆ మబ్బుల్లో దాగున్న ఆవిరి చినుకు రూపం దాల్చి నన్ను చేరాలని ఆశ తో ఎదురు చూసా పన్నెండేళ్ళ మన ప్రేమ లో నవ్వులు, కేరింతలు, ఆశలు, అడియాసలు, ఏడ్పులు తిట్లు అన్ని సమపాళ్ళలో ఉన్న మనం నడిచిన దారిలో గులాబి రేకులు, సంద్రం కెరటాలు, నవ్వుల సుమ మాలికలు అన్ని ఉన్నాయి వాటినే మన ఈ పన్నెండేళ్ళ ప్రేమకు అంకితమిస్తూ ఎప్పటికి నిన్ను తలుచుకుంటూ ఇలా కవితలు పేర్చాను నీ తీరానికి నువ్వు బలవంతాన చేరుకున్నావు నన్ను మాత్రం ఇక్కడ ఒంటరిగానే వదిలేసావ్ ఐన ఇన్నాళ్ళ మన ప్రేమ ను గౌరవిస్తు నీ నిర్ణయాన్ని కాదనలేదు, ప్రేమను చంపుకోవడానికి నేనేమి పిరికి వాడిని కాదు నిన్ను మరిచిపోతానేమో కాని నా ప్రేమను ఇలా వల్లెవేస్తూ ఉంటాను నీ ప్రేమపు మాధుర్యం లో స్నేహానికి విలువ ఇచ్చి ప్రేమకు

ఉంది

చినుకులు పడుతూ ఉంటె మనసార తడవాలనుంది చిగురాకులు గాలికి తొణికిసలాడుతుంటే వాటిల గాలి ఊయల ఊగాలనుంది కడలి ఒడ్డున ఇసుక తెన్నేలతో ఓ గూడు కట్టలనుంది సంద్రం లో ఎగిసే అలలా ఆకాశాన్ని ముద్దాడాలనుంది ఆకాశం లో స్వేచ్చగా ఎగిరే గాలిపటం అవ్వలనుంది ఎ హద్దులు లేని ప్రపంచం లోకి దూసుకేల్లలనుంది నిండు గోదారిలా ఉరకలు వెయ్యలనుంది నిండు మనసుతో ఆర్ద్రత కలిగిన కళ్ళలో కన్నీరు అవ్వలనుంది చిట్టి పాపల బోసి నవ్వుల్లో ఎప్పటికి నిలవాలనుంది ఆ జలపాతం లా కట్టలు తెంచుకు పారాలనుంది ఆ అగ్ని అంత స్వచ్చంగా మేలిమి బంగారు వర్ణం ల మేరవాలనుంది పారే సెలయేటి రాగం లో గొంతు కలపాలనుంది అడ్డు అదుపులేని గాలిలా గిరికీలు కొట్టలనుంది నీలాల నింగి అంచులు తాకి మబ్బులపై విహరించాలనుంది చిన్నారి పాప ను తాకే తోలి తొలకరి జల్లు కావాలనుంది కన్నులు మిరుమిట్లు గొలిపే హరివిల్లు కావాలనుంది కన్నులలో పుట్టి పెరిగి కలతను తరిమేసే చిరు స్వప్నమై మెదలాలనుంది పుడమి తల్లి ఋణం తీర్చుకోవాలనుంది  

మైమరపు

ఊహలకే అందని ఓ మెరుపు ఇలా నా దరికి చేరుకుంటే సన్నగా వీస్తున్న గాలి నా మదినిలా మీటుతూ ఉంటె వెన్నెల కాంతుల్లో మనసు లీనమై ఎటో పయనిస్తూ ఉంటె కార్చిచ్చు కూడా నిప్పుల కుంపటి వదిలి పొగగా మారి ఆ మబ్బుల్లో కలిసిపొద ? ఎప్పుడు లేని ఏదో కమ్మని స్వరమొకటి నన్ను మైమరిపిస్తుంది తన వెంటే రమ్మని నన్ను ఉసిగొలుపుతు ఉంది వాన వెంట ఉరుములు మెరుపులు వచ్చినట్టు ఆకలి తో పాటు దప్పిక నీరసం కలసి దాడి చేస్తున్నట్టు ఏమో ఆ రాగం ఎక్కడిదో నన్ను ఓ కొత్త లోకానికి పరిచయం చేసింది తననలా చూస్తూ ఉండిపోవాలని పిస్తుంది తనతో ఎక్కడికైనా వెళ్ళిపోవాలని పిస్తూ ఉంది నా ఊసుల్ని పోగేసి ఈ ఊహల్లో తేలించి ఆ రాగం ఇప్పుడీ కవిత రూపం లో దాగి ఉంది ఏమి తెలియని నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం వస్తుంది  

కంటి వెలుగు

Image
కంటి వెలుగు: అప్పుడే అలికినట్లు ధగధగలాడుతుంది ఆ అరుగు. అక్కడికి  ఓ కొస దూరం లో నింగి వైపు ఆశగా చూస్తున్న చిన్ని ఒక్కసారిగా ఏదో చూసినట్టుగా కేకలు వేసుకుంటూ ఇంటి దారి పట్టింది . తానూ పుట్టినప్పటినుండి చూడలేదు వడగళ్ళ వానను--అది సంగతి. గత రెండు మూడేళ్ళుగా ఆ ఊరిలో వలసలు ఎక్కువయ్యాయి వర్షాలు పడక బీటలు వారిన భూమిని దున్నలేక వలస పోయారు చాల మంది, ఈ ఏడాదే ఎందుకో వరుణుడికి జాలి వేసినట్టు కుంభ వృష్టి కురిపించాడు ఇప్పటికి ఇది నాల్గావ సారి.  ఈ సారి వడగళ్ళతో కూడా పలకరించాడు. రేపో మాపో ఊరి నుండి చుట్టాలు వస్తున్నారని తెలిసి ఆనందపడాలో భంగాపడాలో అర్ధం కానట్టు ముఖం పెట్టారు బసవయ్య వెంకటి దంపతులు:  ఓ పట్టాన ఆనందం కలిగినా దిగాలుగా ఉన్నారు బహుశ చిన్నిని వాళ్లతో పాటుగా పంపెయలన్న సంగతి వాళ్ళ మనసుని తోలుస్తుందో ఏమో. ఏటి గట్టు పాయలమీద ఆడుకునే వయసు చిన్నిది ఇప్పుడిప్పుడే తనవాళ్ళని మురిపెంగా పిలుస్తోంది అలాంటి తనను వేరే ఊరికి పంపించాలా వద్దా అని సతమతం అవుతున్నారు ఇరువురు. రాఘవయ్య గారిది చలమయ్యావాగు బసవయ్య గారిది మరుధూరిపూడి , అతను బసవయ్య కు స్వయానా పెద్దన్న అవుతాడు, వాళ్ళకి ఆ ఊరిలో ఓ మేడ ఉంది కాని అందు

ఇందులో మనం ఎంత

చల్లని చంద్రుడు అని మనం అంటున్నాం కాని ఆ చంద్రునికే తెలుసు తానూ ఏంటో ఆ ప్రజ్వలించే సూర్యుని కిరణాలను తట్టుకుని వేడెక్కి చల్లబడి కాంతులీనుతుంది సంద్రం లో నీరు ఎప్పుడు  ఒకే లా ఉన్నపటికీ ఆ చంద్రుని గురుత్వాకర్షణ కి లోబడి అలల తరంగాలు సృష్టిస్తుంది తనలోనే దాగి ఉన్న "బొగ్గు పులుసు " ను మాత్రం సహిస్తూ మనల్ని సేద తీరుస్తుంది ఊహలు ఆలోచనలు భావాలు భావోద్వేగాలు కోపాలు తాపాలు ప్రేమలు ద్వేషాలు అని మనం అంటున్నాం ప్రాణం ఎక్కడ ఉందొ కూడా తెలిదు మనకి , మొత్తం వెతికితే దొరికేది రుధీరమె కాని అదంతా మన ఆలోచన శైలి లో నిగుడి ఉంది , ఏది నిజమో ఏది అబద్దమొ తెలుసుకుంటూ ఉంటాం రెప్పలు మూసినా తెరిచినా ఏదో నవలోకం లో ఉన్నట్టు అనిపిస్తే అదే  కల అని అంటున్నాం , మన కాళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటె నిజం అనుకుంటాం ఏదేమైనా ఈ ప్రపంచమే ఓ వింత .. ఇందులో మనం ఎంత 

సాగర ఘోషా

నీలాల ఆకాశం వైపు ఎగిరి తాకాలని ఆరాట పడే కెరటాల్ని దాటుకుంటూ అలా సంద్రం వైపు నడుచుకుంటూ వెళ్తు ఉన్నా  వెనువెంటనే అంత ఎత్తుకు ఎగిరి ఆకాశాన్ని తాకాలనే తపన ఆ అలల మాటున కనిపిస్తూ ఉంది అందనిది అని తెలిసిన అందుకోవాలనే తపన ఎంతో గొప్పది, ఎందుకంటే మన కంటికి ఆ కెరటాల సడి కనిపిస్తుంది ఆ కెరటాల ఆవిరి మనల్ని తాకుతూ ఉంటుంది త్వరితగతిన సూర్యుడిని కమ్మేశాయి కారు మొబ్బులు . వాటిని కార్ మొబ్బులు ఎందుకంటారో తెలిదు కాని నిజంగా కార్ కి అలవాటు పడిన వాళ్ళు ఆ మబ్బులు చూసి కార్ ఎక్కి కూర్చున్నారు .. అప్పటిదాకా అంది అందకుండా ఎత్తు పల్లాలు ఎగుడు దిగుడు గా ఉన్న ఆ సంద్రపు ఒడ్డు ఒక్కసారిగా చల్లగాలి తో ఎవరో కుమ్మరించినట్టుగా చల్లగా మారిపొయి  అక్కడే చూస్తున్న నన్ను అలుముకుంది ఆ సంద్రపు నీటి కణాలు ఒక్కొకటిగా ఆవిరైపోతు మబ్బులుగా మారి చల్లారి వర్షం అయ్యి నన్ను హాయి గా పలకరించాయి సంద్రపు ఒడ్డున ఇసుక రేణువులు ఆ గాలికి ఎగిరి గిరకలు కొడుతూ ఉంటె ఇప్పటిదాకా లేని ఏదో ఉత్సాహం జోష్ నాలో పుంజుకుంది .. ఆ రేణువుల్ని ఎతుకు పోతూ ఉంటె దాని తో పాటు గా గాలిపటమై విహరించాలని కోరిక కలిగింది ఆ ఒడ్డున చేపలు పట్టి ఇప్పుడే వచ్చిన మత్స

తాడు తెగిన గాలిపటం

భావోద్వేగాల జ్వాలలు ఉద్విగ్నభరితంగ అనాలోచితంగ రేగాయి రెక్కలు తొడిగి ఊహాలోకం లో విహరిస్తున్న నాకు చల్లని గాలి తరాస పడింది కమ్మని ప్రకృతి అందాలు కమనీయంగా నన్ను ఒలలాడించాయి రెప్పల మాటున చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి తెర అంటూ ఏమి లేకుండానే ఓ చలచిత్రం ప్రసారంయ్యింది అందులో మనసు నిమగ్నమై మునకలేసి తేలుతూ ఉన్న తరుణాన ఒక్క ఉదుటున మెలకువ వచ్చింది .. కమ్మని ఆ కల ఎటో గాలి బుడగల తాడు తెగిన గాలిపటం లా అనంతాలకు ఎగిరి పోయింది 

ಕನ್ನಯಿ ಚೇನಿ ಜಕೋ...

ಕಾಲೇ ತಾನಿ ಮಾರ್ ವಾಟೆ ನ ಸಾಮ್ಳನಜು ರೀ ಕೋನಿ ಪಣನ್ ಆಜ್ ಕಸನಿಕೊ ಹನು ಲಾಗ್ರೋಚ ಕನ್ನಯಿ ಪೇನ ಹನು ವೋ ಕೋನಿ ಕನ್ನಯಿ ಚೇನಿ ಜಕೋ ಕಾಲ್ ಪರಮ್ ಮನ ಎಕ್ಲೆನ್ ರಕಾಡ್ ದೆನ್ ಊ ದಗರ್ಗಿ ಅತ್ರ ದಾಡ್ ಮಾರ ಲಾರ ರ ಜಕೋ ಕಾಯೀನ್ ಕಿದೋ ಕೋ ಪಣನ್ ಮ ತಾರಜ್ ಲಾರ್ ರುಂಚು ಕೆನ್ ಕೇವಾಳ್ ಆಜ್ ಕಾಸನ್ ಕೋ ಮಾತಿ ರೀಸಾನ್ ಕನ್ನಯಿ ಚೇನಿ ಜಕೋ ಕಾಲ್ ಪರಮ್ ಮನ ಎಕ್ಲೆನ್ ರಕಾಡ್ ದೆನ್ ಊ ದಗರ್ಗಿ ಊ ಹಾಂಸತೋ ಮನ ಕತ್ರಾಯಿಕೋ ಹುಂಸ್ಯಾರಿ ಆವ ಊ ವಾತೆ ಕರತೋ ನೂಜ್ ಸಾಮಲ್ತೋ ಓರಿ ಆಂಕಿ ಮಾಲ್ದಿರ್ ಆನ್ಕಿರ್ ಶ್ರೀಕ್ ಕನ್ನಯಿ ಚೇನಿ ಜಕೋ ಕಾಲ್ ಪರಮ್ ಮನ ಎಕ್ಲೆನ್ ರಕಾಡ್ ದೆನ್ ಊ ದಗರ್ಗಿ ಆಜ್ ತು ಫರಾನ್ ವಾಟೆ ಕಿಡಿ ಜೆತಾನಿ ಮನ ರೆಗೋ ಕೋನಿ ಅಬ್ಬೆತಿ ಕನ್ನಯಿ ಹನು ಕರೆಸ್ಮತ್ ಕಾಸನ್ ಕೆಚಿ ಮನ ಯಾನ್ ಲಾಗೆಂತಿ ಕನ್ನಯಿ ಚೇನಿ ಜಕೋ ಕಾಲ್ ಪರಮ್ ಮನ ಎಕ್ಲೆನ್ ರಕಾಡ್ ದೆನ್ ಊ ದಗರ್ಗಿ ವರಾ ಹಾಟೋ  ದಿಗ್ರ್ಯಾ ತಾರ್ ವಾಸು ಮ ನೂಜ್ ದೇಕ್ರೋಚು ಮಾರ್ ಸಾರು ಏಕ ವಣಾ ಹನು ದಿಗ್ರ್ಯಾ ಅಟಾರೋಚ ಗ ತೋನ ಕನ್ನಯಿ ಅಬ್ಬೇತಿ ಕತ್ತಿ ಜೋಮತ್ ಮಾರ್ ಲಾಡೆರ್ ತು ಹಾಟೋ ವರಾ 

आहट

जाने क्यों आज मुझे ऐसा लग रहा है जैसे कभी पहले हुआ हो अनजाने ही मेरा दिल तडप रहा है। आहट में  तुम हो आहट में मुझे छोड दिया ओ सनम।

ఆలోచనల సరళి

 ఏమైందో ఏమో ఎన్నడు లేనంతగా నేడు మనసు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నదో ఏమిటో అనంతమైన భావాల నడుమ నా మనసు గిరికీలు కొడుతున్నద లేక శూన్యాన్ని నేను నా భావాలలో మిళితం చేస్తున్ననా ? ఏమైతే నేఁ ఏదో తెలియని రాగం నేడు నా మనసు వీణ ని సున్నితంగా మీటింది ... మరి ఆ రాగాలాపన చేసేది ఎవరో ఎందులకో కాలమే సమాధానం చెప్పాలి వినూత్న భావాల నడుమ  సతమతమౌతున్న నాకు ఈ కొత్త చెలిమి వేవేల ఆశలు తెచ్చిపెట్టిన ఆ స్నేహం నుండి నేనేమీ ఆశించను ఎందుకంటే లోకం లో అన్ని మనవే అనుకుంటే అవేవి మనకు ఎప్పటికి దక్కవు .. మనకోసం ఏది రాసి పెట్టి ఉంటె అవే మన చెంతకు చేరుతాయి రాగ భావ ద్వేషాలు కల్మషాలు నిట్టూర్పులు ఇప్పటి దాక నన్ను కాకవికలం చేసాయి. నిన్నల్లో తేలియాడే నాకు వెన్నెల లో ని మల్లియల పరిమళం ఏదో తన వైపుకు రమ్మని సైగ చేస్తున్నట్టు ఏదేదో నా మది లో గిలిగింతలు కలిగినట్టు అనిపించసాగాయి 

మనసు వాకిలి

మనసు  విచిత్రమైనది కలత  చెంది  విసుగెత్తితె  తన మాట తానె ఆలకించదు నేను నేనుగానే ఉన్నానన్న ఊరుకోదు కనురెప్పల  మాటున  దాగిన  ఆల్చిప్ప లాంటి    కన్నుల నుండి ముత్యాల్లాంటి  కన్నీరు  అలా  అలా  ధారలుగా  కంటిని  వీడి ఏ వైపునకో  పయనమయ్యయి  మనసులో నీ జ్ఞాపకాలు  చెరిగిపోయాయి అనుకున్నాను  మనసు ఇక తేలిక పడుతుంది అనుకున్నాను కాని నీ జ్ఞాపకాలు ఎల్లవేళలా నన్ను తరుముకునే వస్తున్నాయి మనసు మళ్ళి నిన్ను తలచి బరువ్వేక్కింది 

వర్షపు లోగిలి

వెన్నెల  వాకిట్లో  వెల్లివిరిసేను  వాసంతం  కన్నుల  కనుమలలో  కానరాని  కల్మషం  చినుకుల్లో  చిందేస్తుంది  చూడు  చిన్నారి  ఆప్యాయంగా  అలుముకుంది  ఆనందాల  అలివేణి  అపురూపంగా  ఆహ్వానిస్తూ  

Nijam Laanti Kalaa

Anantanga Unna manasuni nedu aalochanalilaa aavahinchaayi Reppapaatu kaalam lo ekkadikekkadiko nannu tanato viharimpajesaayi Bhaavaala naduma Satamatamautunte Bhaavodvegaalu anusarinchaayi Kaakavikalamai manasu kekalu pettindi  Nidra bhangamai okka udutuna lechi kurchunna Nijamlaanti Kalaa Kala laanti nijamaa polchukolekapoyaa

ప్రకృతి ఒడిలో ...

Image
ఛాయ చిత్రం : మా చెల్లి ప్రియ గారి సౌజన్యం తో  ప్రకృతి అందాలను వీక్షిస్తున్న నన్ను ఏదో జీవ రాగం పలకరించింది అలా మేఘాల్లో తెలియాదేంత ముచ్చాతగోల్పుతూ ఉంది ఈ ప్రకృతి శోభ చల్లని మలయమారుతం నన్ను తనతో పాటుగా ఆ కొండ కోనల్లో విహారించింది పచ్చని చెట్టు నీడలో సేద తీరుతు ఈ అందాలు విస్తు పరుస్తున్నాయి నా కన్నుల స్పటికా లో చల్లని ఆ ఏటి నీరు పరవళ్ళు తొక్కుతూ ఉంది మనసుని ఒలలాడిస్తూ నన్ను తాకింది ఆ రాళ్ల రాప్పలపై నా చిరు సంతకం పెట్టాలనుంది ప్రకృతి ఒడిలో హాయిగా ఆదమరిచి నిదురొవాలని ఉంది  

అనురాగం హంగులు ఓనమాల కవ్యాలహరి

Image
గులాబి బాల ఛాయ చిత్రం : మా చెల్లి  సౌజన్యం తో అ : అందంగా ఉన్నవని ఆ : ఆరాధించాను నేను ఇ : ఇనుము లాంటి హృదయంలో ప్రేమపు ఈ : ఈటలు నాజుకుగా తాకించావు ఉ : ఉలిక్కి పడ్డాను నేను ఊ : ఊపిరి ఆడక సతమతమయ్యాను ఎ : ఎడారిలో ఎండమావి లా ఏ : ఏకాంతం లో అలికిడిలా ఐ : 'ఐ లవ్ యు' అన్నావు ఒ: ఒలలాడిస్తూ ఊరడిస్తూ  ఊరిస్తూ ఓ :ఓరకంట నన్ను చూస్తూ ఔ : ఔననె దాక ఆగలేదు అం : అంతలోనే ప్రేమను కలిగించి క : కనుచూపులతో నేరుగా గ : గుండెల్లో కొలువుదీరావు చ : చెంతకు చేర రావే నిచ్చెలి జ : జాలువారే వెన్నెల ధారల ట: టక్కరి తుంటరి బాలా డ : డేగ లాంటి నీ చూపులకు త: తోడుంటా ఎల్లవేళలా ద: దాగెన మరి నాలోని ప్రేమ న: నిగారింపుతో మెరిసిపోతున్న ప: పాల బుగ్గల వయ్యారిని చూసి బ:బంగారు మేని ఛాయా లో మ: మైమరచి తరించాలని య: యోచిస్తూ వస్తున్నా ఇదిగో ర: రారమ్మని నీ పిలుపు అంది ల: లాలించడానికి ఓ లలన వ: వడివడిగా వస్తున్నా శ: శరవేగం తో సాగుతూ హ: హాయిరాగం లో తేలుతూ గమనిక: ఇది ఓనమాలతో ప్రయోగాత్మక కవిత మాత్రమే. ఎవరు అన్యథ భావించొద్దు. ఈ కావ్యాంజలి కేవలం నా భావాల దర్పణం మాత్రమే. 

హృదయ స్పందన

చివురాకుల తొణికిసలాడే నవ్వు ఒకటి నన్ను తాకింది ఎడబాటుతో సతమతమౌతున్న నాకు ఓ తాయిలం లా వెంటాడుతున్న కల ఒకటి నన్ను నిన్నటిదాకా వదలనె లేదు ఏమైందో ఏమో నాడు ఆకస్మికంగా భావుకతతో నిండిన హృదయం  నేడు లయ తప్పింది చీకటి మాటున దాగిన వెలుగులా దీని అంతరార్ధం ఏమిటో కానరాక ఉంది వేల సార్లు ప్రయత్నించా ఎక్కడ దాగుందో మరి ఆ వెన్నెల కొమ్మ నన్ను నిలువునా తడిపిన వాననే తానూ ఆస్వాదిస్తూ ఉన్న ఏమైందో ఏమో నాడు ఆకస్మికంగా భావుకతతో నిండిన హృదయం నేడు లయ తప్పింది గాలి పటానికి వేగం అందితే అంతులేని ఆకాశానికి ఎగిరిపోతుంది నిన్ను చూడాలనే ఆలోచనా నా మనసు ద్వారాలు దాటి ఎటువైపుకు పరుగులు తీసాయో నెల రాలిన మంచు బిందువుల్ల చక్కిలిగింతలు పెట్టె రాగం ఏదో ఒకటి నన్ను తాకి ఎటో వెళ్ళింది ఏమైందో ఏమో నాడు ఆకస్మికంగా భావుకతతో నిండిన హృదయం నేడు లయ తప్పింది