సాగర ఘోషా

నీలాల ఆకాశం వైపు ఎగిరి తాకాలని ఆరాట పడే కెరటాల్ని దాటుకుంటూ అలా సంద్రం వైపు నడుచుకుంటూ వెళ్తు ఉన్నా  వెనువెంటనే అంత ఎత్తుకు ఎగిరి ఆకాశాన్ని తాకాలనే తపన ఆ అలల మాటున కనిపిస్తూ ఉంది
అందనిది అని తెలిసిన అందుకోవాలనే తపన ఎంతో గొప్పది, ఎందుకంటే మన కంటికి ఆ కెరటాల సడి కనిపిస్తుంది ఆ కెరటాల ఆవిరి మనల్ని తాకుతూ ఉంటుంది

త్వరితగతిన సూర్యుడిని కమ్మేశాయి కారు మొబ్బులు . వాటిని కార్ మొబ్బులు ఎందుకంటారో తెలిదు కాని నిజంగా కార్ కి అలవాటు పడిన వాళ్ళు ఆ మబ్బులు చూసి కార్ ఎక్కి కూర్చున్నారు .. అప్పటిదాకా అంది అందకుండా ఎత్తు పల్లాలు ఎగుడు దిగుడు గా ఉన్న ఆ సంద్రపు ఒడ్డు ఒక్కసారిగా చల్లగాలి తో ఎవరో కుమ్మరించినట్టుగా చల్లగా మారిపొయి  అక్కడే చూస్తున్న నన్ను అలుముకుంది

ఆ సంద్రపు నీటి కణాలు ఒక్కొకటిగా ఆవిరైపోతు మబ్బులుగా మారి చల్లారి వర్షం అయ్యి నన్ను హాయి గా పలకరించాయి

సంద్రపు ఒడ్డున ఇసుక రేణువులు ఆ గాలికి ఎగిరి గిరకలు కొడుతూ ఉంటె ఇప్పటిదాకా లేని ఏదో ఉత్సాహం జోష్ నాలో పుంజుకుంది .. ఆ రేణువుల్ని ఎతుకు పోతూ ఉంటె దాని తో పాటు గా గాలిపటమై విహరించాలని కోరిక కలిగింది

ఆ ఒడ్డున చేపలు పట్టి ఇప్పుడే వచ్చిన మత్స్యకారులు తాము పట్టుకొచ్చిన వేట ను అలా  ఓ  పక్కన పెట్టి చలి ని తట్టుకునేందుకు నిప్పు పెట్టారు .. చిన్న నిప్పు రవ్వలు ఎగసి పెద్ద మంట అయ్యింది వెంటనే ఆ వర్షపు నీటి లో తడిసి చల్లారి పోయింది ఆ నిప్పు కణిక

కొసమెరుపు: నింగి నెల నిప్పు నీరు గాలి ఈ పంచభూతాలను ఒక్క సారి ఇలా చూడగలిగాను ... ఆ పంచభూతాల నుండే ఆవిర్భవించిన మనషులం మనం అయిన ఎందుకో మనకి తెలిసి చేస్తున్నామో తేలిక చేస్తున్నామో ఆ ప్రకృతి  కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము . ఆ పంచ భూతాలూ ఒక్కొకటి వేరు అయినా వాటి శక్తి అమోఘమైనది ... మనషులం మనం కూడా బంధాలను బాంధవ్యాలను ఆదరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటె మనకు సాటి ఇంకెవరు మీరే చెప్పండి.

ఏ ఒక్కరు ఇంకొకరికి తీసిపోరు అది మనకు మాత్రమె తెలిసిన వేదం. మొత్తానికి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన "రామకృష్ణ " బీచ్ , "చింతపల్లి" బీచ్, "మహాబలిపురం / మమ్మలపురం" బీచ్ కి ఈ టపా ని అంకితమిస్తూ ...  

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం