అనురాగం హంగులు ఓనమాల కవ్యాలహరి

గులాబి బాల
ఛాయ చిత్రం : మా చెల్లి  సౌజన్యం తో
అ : అందంగా ఉన్నవని
ఆ : ఆరాధించాను నేను
ఇ : ఇనుము లాంటి హృదయంలో ప్రేమపు
ఈ : ఈటలు నాజుకుగా తాకించావు
ఉ : ఉలిక్కి పడ్డాను నేను
ఊ : ఊపిరి ఆడక సతమతమయ్యాను
ఎ : ఎడారిలో ఎండమావి లా
ఏ : ఏకాంతం లో అలికిడిలా
ఐ : 'ఐ లవ్ యు' అన్నావు
ఒ: ఒలలాడిస్తూ ఊరడిస్తూ  ఊరిస్తూ
ఓ :ఓరకంట నన్ను చూస్తూ
ఔ : ఔననె దాక ఆగలేదు
అం : అంతలోనే ప్రేమను కలిగించి

క : కనుచూపులతో నేరుగా
గ : గుండెల్లో కొలువుదీరావు
చ : చెంతకు చేర రావే నిచ్చెలి
జ : జాలువారే వెన్నెల ధారల
ట: టక్కరి తుంటరి బాలా
డ : డేగ లాంటి నీ చూపులకు
త: తోడుంటా ఎల్లవేళలా
ద: దాగెన మరి నాలోని ప్రేమ
న: నిగారింపుతో మెరిసిపోతున్న
ప: పాల బుగ్గల వయ్యారిని చూసి
బ:బంగారు మేని ఛాయా లో
మ: మైమరచి తరించాలని
య: యోచిస్తూ వస్తున్నా ఇదిగో
ర: రారమ్మని నీ పిలుపు అంది
ల: లాలించడానికి ఓ లలన
వ: వడివడిగా వస్తున్నా
శ: శరవేగం తో సాగుతూ
హ: హాయిరాగం లో తేలుతూ


గమనిక: ఇది ఓనమాలతో ప్రయోగాత్మక కవిత మాత్రమే. ఎవరు అన్యథ భావించొద్దు. ఈ కావ్యాంజలి కేవలం నా భావాల దర్పణం మాత్రమే. 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల