Posts

Showing posts from March, 2021

ఎందుకే ఇలా

 అనిత.. ఓయి.. నిన్ను పిల్లల్ని చాలా మిస్ ఔతున్నా.. "మ జారి" అని అన్నావ్.. అటే హ్యాపిగా ఉంటున్నావ్.. ఇక హన్మకొండకు రానే రావా..? నేనేమైపోయినా దిగులు లేదు కదా నీకు. అసలు నేనీకు గుర్తుకు వస్తే కదా.. ఏదో మాటవరసకే తప్పితే మన బంధానికి ఏ రోజు విలువిచ్చావు గనుక. నీ పుట్టింటికి వెళ్ళి నేటితో పదెనిమిది రోజులు. ఎన్ని రోజులు నేనిలా పడికాపులు కాయాలే.. నీకు నువ్వుగానే వెళ్ళిన దానివి, నీ అసలు ఇల్లునే మరిచిపోతే ఎలాగే..! ఒక భార్య విలువ తన భర్త నీడలోనే ఉంటుంది. నీపై ఇంత ప్రేమ చూపిస్తు ఉంటే నీకే ఎక్కడలేని చులకన భావమా.. ఛీ..! ఐనా నీ రాకకై ఎదురు చూస్తూనే ఉంటా. మీ తల్లిదండ్రులకి మానం మర్యాద ఏమి లేదు అందుకనే నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. మన పెళ్ళి అయ్యి రెండున్నర సంవత్సరాలు పైనే, ఇద్దరు పిల్లలికి తల్లివై ఉండి కూడా ఇపుడు కూడా వారం రోజుల పైనే మీ పుట్టినింట ఉంటున్నావ్, ఇదేమైన గౌరలంగా ఉందా నీకు?   వారికే లేనపుడు నీకు నాపై వినయ విధేయతలు ఎలా వస్తాయే.. ఐనా పెళ్ళి కాక మునుపే తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండాలి ఆడపిల్ల, ఒక్కసారి పెళ్ళి అయ్యాక ఏ పండగకో సందర్భోచితంగా వెళ్ళి తిరిగి తన ఇంటికే రావాలి తప

చేదు అనుభవం

నేటికి మా పెళ్ళై రెండేళ్ళు దాటి పది నెలల ఇరవై ఏడు రోజులు.  విషయం ఏమంటే: ఈ రోజు తన పుట్టిన రోజు.. నిశ్చితార్థం అయిన నెల రోజులకే తన పుట్టిన రోజు: తన కోసం నేను నేవి బ్లూ మెష్ చీరను హనుమకొండ దరి మాంగళ్య షాపింగ్ మాల్ నుండి తనకోసం బహుమానం గా తీసుకెళ్ళా.. తనతో సరదాగా గడుపుదామని వారింటికి వెళ్ళినాను.. తాను అపటికే ఆరెంజ్ చూడిదార్ వేసుకుని ఉంది.. చీర తీసుకెళ్ళి బీరువాలో దాచేసింది, ఎందుకని అడిగితే వారి అమ్మమ్మ వారింటికి బయలుదేరే సమయానికే నేను అక్కడికి వెళ్ళటం జరిగిందట..  మరుసటి సంవత్సరం తన పుట్టిన రోజు నాటికే తాను ఏడు నెలల గర్భవతి, వారి పుట్టింట్లో ఉంది, ఐనా గాని నాతో బీజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ కావాలని చెప్పింది., కొని పట్టుకెళ్ళా విశాఖపట్నం లో గాజువాక సౌత్ ఇండియ షాపింగ్ మాల్ నుండి, తను ఆ ఫ్రాక్ ను ఓ అరగంట వేసుకుంది అంతే.. [గర్భవతి కదా అని నేనే ఎక్కువ సేపు ఫ్రాక్ వద్దంటే వేంటనే నైటీ వేసుకుంది.. ఆ తరువాయి సంవత్సరం సీ యమ్ ఆర్ షాపింగ్ మాల్ లో ఓ లైట్ వీట్ కలర్ టాప్, నేవి బ్లూ కలర్ చూడిదార్ మరియు మల్టికలర్ శారి కొన్నది. తీరా తన పుట్టిన రోజు నాడు ఓ అరగంట వేసుకుని, పది నెలల మా పాపకు  పాలు పట్టాలని మరల నైటిల

ప్చ్

 నువు నాతో ఉంటే నా జీవితానికే అందం నువు నాతో ఉంటే నా మనసుకే ఆహ్లాదం నువు నాతో ఉంటే నీ ఉనికికే పరమార్థం నువలా దూరం పెడితే కాదా నీది స్వార్థం నా నువు అలిగితే మనసుకే కదా గాయం నా నువు కోపగిస్తే చెంప నిమరటం ఖాయం నువు ఊరెళ్ళి సరాసరి రెండు వారాలు గుర్తుకే రావటం లేదా నేనింతైనా నీకు అసలు

అందరం

 నవ మాసాలు నన్ను నీలో దాచుకుని లోకానికి నన్ను పరిచయం చేశావు అమ్మ   నవ మాసాల తరువాయి మీ క్షమరిక్రణతో అంచెలంచెలుగా మంచి చెడు తెలుపుతు లోకాన్ని నాకు పరిచయం చేశారు నాన్న   ఆదరాభిమానాన్ని మెండుగా అందిస్తూనే పసి ప్రాయం నుండి వారిరువురి అండలో మంచి చెడ్డ నేర్చుకున్నాము. ఇపుడు నీ కుటుంబం వేరైనా నా కుటుంబం వేరైనా మనమంత ఒకే గూటి గువ్వలం అన్నా చెల్లెళ్ళం   వారింట జన్మ పొంది, సతి ధర్మానికి కట్టుబడి, నా ఇంట దీపం పెట్టె గృహిణివై, కష్ట సుఖాలలో సమపాళ్ళు పంచుకుంటు నా తోడు నీవుగా నీ నీడ నేనుగా కలసికట్టుగా నా సహధర్మచారిణివై వర్ధిల్లు   అకస్మాత్తుగా భగవంతుని వరమై మా ఇరు కన్నుల కాంతి దీపాలై కంటి వెలుగులై భాసిల్లే అక్క తమ్ముళ్ళు మీరు ఇపుడు కాని మా అందరి కంటికి మీరు పసి శిశువులే మా జన్మ ధన్యమే.   మొదటి స్టాంజా మా అమ్మ రాధ గారికి అంకితం రెండవ స్టాంజా మా నాన్న గారు తేజ్య గారికి అంకితం మూడవ స్టాంజా నా తోబుట్టువు సంధ్య నందిని కి అంకితం నాల్గవ స్టాంజా నా అర్ధాంగి అనిత కు అంకితం ఐదవ స్టాంజా మా పిల్లలు శరణ్య మరియు హర్ష కు అంకితం  ఇహ అంత కూడా మా ఇలవేల్పు వేంకటేశ్వరుని చల్లని కృపకటాక్షమే.  ~శ్రీధర్ భూక్యా

One Small Happy Family

 {srid[har}<sha]rany(a>nitha) sridhar: self (35y 10m 24d) harsha: son (4w 4d) sharanya: daughter (21m 3w 6d) anitha: wife (23y 11m 13d) as on 03 march 2021