చేదు అనుభవం

నేటికి మా పెళ్ళై రెండేళ్ళు దాటి పది నెలల ఇరవై ఏడు రోజులు. 
విషయం ఏమంటే: ఈ రోజు తన పుట్టిన రోజు..

నిశ్చితార్థం అయిన నెల రోజులకే తన పుట్టిన రోజు: తన కోసం నేను నేవి బ్లూ మెష్ చీరను హనుమకొండ దరి మాంగళ్య షాపింగ్ మాల్ నుండి తనకోసం బహుమానం గా తీసుకెళ్ళా.. తనతో సరదాగా గడుపుదామని వారింటికి వెళ్ళినాను.. తాను అపటికే ఆరెంజ్ చూడిదార్ వేసుకుని ఉంది.. చీర తీసుకెళ్ళి బీరువాలో దాచేసింది, ఎందుకని అడిగితే వారి అమ్మమ్మ వారింటికి బయలుదేరే సమయానికే నేను అక్కడికి వెళ్ళటం జరిగిందట.. 

మరుసటి సంవత్సరం తన పుట్టిన రోజు నాటికే తాను ఏడు నెలల గర్భవతి, వారి పుట్టింట్లో ఉంది, ఐనా గాని నాతో బీజ్ కలర్ లాంగ్ ఫ్రాక్ కావాలని చెప్పింది., కొని పట్టుకెళ్ళా విశాఖపట్నం లో గాజువాక సౌత్ ఇండియ షాపింగ్ మాల్ నుండి, తను ఆ ఫ్రాక్ ను ఓ అరగంట వేసుకుంది అంతే.. [గర్భవతి కదా అని నేనే ఎక్కువ సేపు ఫ్రాక్ వద్దంటే వేంటనే నైటీ వేసుకుంది..

ఆ తరువాయి సంవత్సరం సీ యమ్ ఆర్ షాపింగ్ మాల్ లో ఓ లైట్ వీట్ కలర్ టాప్, నేవి బ్లూ కలర్ చూడిదార్ మరియు మల్టికలర్ శారి కొన్నది. తీరా తన పుట్టిన రోజు నాడు ఓ అరగంట వేసుకుని, పది నెలల మా పాపకు  పాలు పట్టాలని మరల నైటిలో మారిపోయింది.

ఈ యేడు తన పుట్టిన రోజు అంటే ఈ రోజు తనకు మరల లాంగ్ ఫ్రాక్ లాటి డ్రెస్ కావాలంటే మరల బ్లాక్ పై వైట్ పోల్కా డాట్స్ గల టాప్ కొనిచ్చా.. కొనుక్కున్నాక రెండు నెలల బాలింత అంటు తన అమ్మ తనని తన పుట్టింటికి తీసుకెళ్ళింది, ఈ రోజుకి పదిహేను రోజులౌతోంది తాను వెళ్ళి. ఫోటో ఐనా పంపించవే అంటే ఇపటి దాక పంపనే లేదు మరి.

స్వతహగా ఎవరిదైన పుట్టిన రోజు ఉంటే ఉదయాన్నే లేచి, కొత్త బట్టలు వేసుకుని, ఆ రోజు విష్ పంపిన వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపి, ఫోటో తీసి పంపించటం చేస్తుంటారు. కాని అదే మా యావిడైతే బర్త్ డే డ్రెస్ కావాలని అడిగి మరీ కొంటుంది, పుట్టిన రోజు నాడు నే తనని సర్‌ప్రైజ్ చేయాలని ముందుగానే విషెస్ పెట్టినా, వాటిని చూస్తుందే తప్పితే కొత్త బట్టలతో ఫోటో పంపదు, ఎందుకని అంటే ఏవో సాకులు చెప్పి తప్పించుకోవటం తనకి పరిపాటి అయ్యింది..

మా పెళ్ళైన సంవత్సరం నుండి నేటి వరకు ఇది తన నాల్గవ పుట్టిన రోజు.. కాని ఈ నాలుగు పుట్టిన రోజులకై ఖర్చు బాగానే చేయించింది తప్పితే పుట్టిన రోజున ఉండాల్సిన ఆ హ్యాపి మొమెంట్స్ మాత్రం తాను ఆస్వాదించదు, వేరెవ్వరిని ఆస్వాదించనీయదు.

మనిషి మాత్రం మాటల పుట్ట, పొగరు తట్ట

Popular Posts