ఎందుకే ఇలా

 అనిత.. ఓయి.. నిన్ను పిల్లల్ని చాలా మిస్ ఔతున్నా.. "మ జారి" అని అన్నావ్.. అటే హ్యాపిగా ఉంటున్నావ్.. ఇక హన్మకొండకు రానే రావా..? నేనేమైపోయినా దిగులు లేదు కదా నీకు. అసలు నేనీకు గుర్తుకు వస్తే కదా.. ఏదో మాటవరసకే తప్పితే మన బంధానికి ఏ రోజు విలువిచ్చావు గనుక. నీ పుట్టింటికి వెళ్ళి నేటితో పదెనిమిది రోజులు. ఎన్ని రోజులు నేనిలా పడికాపులు కాయాలే.. నీకు నువ్వుగానే వెళ్ళిన దానివి, నీ అసలు ఇల్లునే మరిచిపోతే ఎలాగే..! ఒక భార్య విలువ తన భర్త నీడలోనే ఉంటుంది. నీపై ఇంత ప్రేమ చూపిస్తు ఉంటే నీకే ఎక్కడలేని చులకన భావమా.. ఛీ..! ఐనా నీ రాకకై ఎదురు చూస్తూనే ఉంటా. మీ తల్లిదండ్రులకి మానం మర్యాద ఏమి లేదు అందుకనే నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. మన పెళ్ళి అయ్యి రెండున్నర సంవత్సరాలు పైనే, ఇద్దరు పిల్లలికి తల్లివై ఉండి కూడా ఇపుడు కూడా వారం రోజుల పైనే మీ పుట్టినింట ఉంటున్నావ్, ఇదేమైన గౌరలంగా ఉందా నీకు?   వారికే లేనపుడు నీకు నాపై వినయ విధేయతలు ఎలా వస్తాయే.. ఐనా పెళ్ళి కాక మునుపే తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండాలి ఆడపిల్ల, ఒక్కసారి పెళ్ళి అయ్యాక ఏ పండగకో సందర్భోచితంగా వెళ్ళి తిరిగి తన ఇంటికే రావాలి తప్పితే అటే కుర్చుండి పోకూడదు. అసలే కోవిడ్ కాలమిదంటే కూడా వినకుండ ఏమిటో.  నువు నా చెంతనుంటే చులకన, హేళన చేస్తు మాటలాడి మనసు విరిచేస్తావు, లేదా ఇలా నీ పుట్టింటిలో నెలల తరబడి ఉండిపోతావ్. పిల్లవాడు పుట్టినాక ఒక నెలరోజులైనా కుదురుగా లేవు. ఏప్రిల్ ౧౨ అంటే ఉగాది వరకు వేచి చూస్తా.. ఇహ తరువాత నీ ఇష్టం.

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం