ప్చ్
నువు నాతో ఉంటే నా జీవితానికే అందం
నువు నాతో ఉంటే నా మనసుకే ఆహ్లాదం
నువు నాతో ఉంటే నీ ఉనికికే పరమార్థం
నువలా దూరం పెడితే కాదా నీది స్వార్థం
నా నువు అలిగితే మనసుకే కదా గాయం
నా నువు కోపగిస్తే చెంప నిమరటం ఖాయం
నువు ఊరెళ్ళి సరాసరి రెండు వారాలు
గుర్తుకే రావటం లేదా నేనింతైనా నీకు అసలు