Posts

Showing posts with the label Fiction

ఓ వింత కథ

ఐతే ఇప్పుడొక చిన్న కథ..  మరి కథ అనగానే అనగనగ అనగనగ అంటూ మొదలు పెడతాను అనుకున్నారు కదా .. కాని అలా కాదు  ఇది కథ కాదుగా మరి..  మరి కథ కాని కథకు కథ అని ఎందుకన్నట్టు ఏమోలే నాకేం తెలుసు  మనసు బాగోలేకుంటే కథ,  మనసు ఉల్లాసంగా ఉండాలంటే కథ,  అంటూ వింటూ ఉంటాం కదా అని ఈ కథ..!   'బాబు..  కథ కథ  అంటున్నావు తప్పితే కథ ఏమిటసలు..'  అనే కదా  సందేహం.. వస్తున్నా అక్కడికే వస్తున్నా ..  జరా కాస్త చోటిస్తే మీ అందరి మధ్య లో కుర్చుని చెబుతా .. అలా అని నన్ను మధ్య లో పెట్టి కుమ్మెయొద్దు సుమీ.. కథ అడ్డం తిరుగుద్ది. 'అబబ్బబా మళ్ళి  కథ అంటున్నాడు కాని కథ ఏమిటో చెప్పకుండా వున్నాడేంటి  చెప్మా అనే కదా.. ఆగండాగండి ఇదుగో కథను విని నిలబెట్టాల్సిన బాధ్యతా మీదే  నా  పూచి ఏమి లేదు వింటున్నారా (ఐన ఎలా వింటారు, తిలకిస్తున్నారు కదా  .. హ్మ్మ్..  ఔను తిలకించండి!)  'అది సరేలేవయ్య .. అసలేమిటి సంగతి ఈ కథ లోని భావం అంటే '.. అడిగారు .. కథ లో కథాకమామిషు వుంది కదండీ అందులో కమామిషు తీసివేస్తే మిగిలేది .. మళ్ళి  కథ అంటూ కథ అంటున్నాడు అనుకుంటున్నారా ఏమోలే క్రితం లో ఎవరో అన్నట్టు విన్న పదాన్నే తిప్పి తిప్పి వా

నది పుత్రుడు

Image
Havelock Bridge Image Courtesy: Wikipedia గోదావరి గట్టు, రాతిరి వర్షం పడినందువల్ల మంచు కమ్మేసి మసక మసకగ ఉంది వాతావరణం అంత. తెలవారుతూ ఆ మంచువులను ఆకులపై నీటి బొట్లుగా మార్చి ఉషోదయానికి నాంది పలుకుతున్నట్లు ఉదయించాడు అరుణ భాస్కరుడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా డేంజర్ మార్క్ దాటి పొంగి పొర్లుతుంది గోదారమ్మ తల్లి. ఆ ఉద్దృతి వల్ల  వాతావరణ శాఖ రేడియో లో ప్రమాద హెచ్చరికలు జారి చేసి జాలర్లు చేపల వేటకు పోరాదని అనౌన్స్మెంట్ చేసేరు. ఎటి గట్టు రావి చెట్టు దగ్గర బసవయ్య ఎప్పుడెప్పుడు తెలవారుతుందా, ఎప్పుడు వేట మొదలెడదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ తన నులక మంచం దిగాడు.  " ఇయాల కూడా జేరం తగ్గనెదు, ఈ పాలి వొండనికి నిన్న అట్టుకోచ్చిన సేపల పులుసు కాచి ఎట్టిన, రేపటి దాంక తగ్గితే గప్పుడు ఎటకు పోగాని మావా " "అట్ట జేరం ఒత్తే ఇట్ట కుకుంతే డబ్బులు యాడ్నించి వోత్తయే మంగి, ఏదేమైనా ఇయ్యాల ఎటకు పోవాల్నే" " అద్దు మావా, గోదారమ్మ ఆటుపోట్లాడ్తాంది, ఇయ్యాల అద్దు, తగ్గినంకా ఎల్తే మంచిగుంటాదే. ఇయ్యలైన నా మాట ఇను, ఇలా ఇనకుండా ఇంతదాంక తెచ్చుకున్నావ్, అద్దు అద్దు అన్న ఇనిపించుకొ