Posts

Showing posts from 2020

uoyevoli

 I Love You This Phrase is always Unique at Each Phase of Life. Everyone is eager to express it in one way or the other, but, only a few can mean and define the true perspective of loving one in real sense, no terms, no conditions and no rules and no regulations apply. Parental Love, Love among Couple, Affection towards Children, are to name a few.

ఏమి ఇచ్చుకోగలను కృతజ్ఞత తప్ప

 నేను పుట్టిన ఊరు నన్ను మూడేళ్ళు సాకితే.. నన్ను పెంచిన ఊరు ముప్పై ఏళ్ళు సాకింది.. ఏమిచ్చి ఋణము తీర్చుకోగలను వైజాగపటమా..! చదువు సంస్కారం నేర్చుకున్నది ఈ వైశాలినగరములోనే..!! మర్యాద గౌరవం పొందింది ఇక్కడే.. సొంతిల్లు నేను పుట్టిన ఊరిలో కట్టించుకున్నాము దాని మూలానా నా వివాహనంతరం అక్కడే బస చేయాలని తీర్మానించుకున్నా గాని, మనసొప్పకా గడచిన రెండున్నరేళ్ళు  కూడా వైజాగపట్టినములో ఉన్నాము.. నాన్న గారికి మరో ఐదేళ్ళ ఐదు మాసాల తరువాయి రిటైర్మెంట్ గనుక వారు సొంతింటికి రాలేని పరిస్థితి.. బాడుగా కి ఇస్తే కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎలా ఉంచుతారో తెలియని అనిశ్చితి.. గనుక నేను తప్పనిసరిగా సతి సమేతంగా సొంత గూటికి చేరే సమయం ఆసన్నమయ్యింది.. కాకపోతే అందరు క్షేమంగానే ఉండాలని నా మనఃసాక్షి తో మనఃపూర్వకంగా కోరుకోవటం తప్ప ఏమి ఇచ్చుకోగలను..! 

ఎటు తేల్చని సంధిగ్దత

 భార్య పిల్లలు ఒక చోట భర్త మరోచోట తనకు తానుగా ఊరేగి వెళ్ళింది భార్య వ్యత్యాసాలకు తావు యిచ్చే విధముగా నాలుగున్నర మాసాల యెడబాటు యింటి యిల్లాలిని యేలుకోవాలని తపన మొండి ఘటానికి లేదు రాదు ఆలోచన నను నా వాళ్ళకు దూరం పెట్టాలనే వారి యాతనో యిల్లు బాడుగలో భార్య మడుగులో భర్త అయోమయంలో రేపటి జీవితానికి నాకే నన్ను శత్రువు చేసే యోచన విధి రాత యే మలుపు తిరిగేనో తెలియని ఆవేదన కనిపెంచిన తల్లిదండ్రులు తల్లడిల్లే ఓ వైపు కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఆవేశం ఓ వైపు తల్లడిల్లుతున్న మనసు ఎటు తేల్చుకోలేక కోవిడ్ మహమ్మారి ఆనాటికి ఎంతగా పెరిగేనో తెలియక 14 Jun 2020~13 Jul 2020 14 Jul 2020~ 13 Aug 2020 14 Aug 2020~13 Sep 2020~ 09 May 2020~08 Jun 2020 09 Jun 2020~08 Jul 2020÷ 09 Jul 2020~08 Aug 2020 09 Aug 2020~08 Sep 2020 09 Sep 2020~ 08 Oct 2020 ~ 09 Oct 2020~08 Nov 2020 09 Nov 2020~08 Dec 2020 09 Dec 2020~08 Jan 2021* 09 Jan 2021~08 Feb 2021

విధీ

 విధి ఎంతో విచిత్రం తెలిసి తెలియని వింత నాటకం క్షణ కాలం ఉబలాటం మరు నిమిషం నిర్వేదం అల్లుకుపోయే బంధాలు కొన్ని చెంతకు చేరిన చేరువ కానివి కొన్ని రాగద్వేశాల భావోద్వేగాల జీవితం చూసి చూడని ఘటనల సమాహారం ఎనలేని మమకారాల తేనెపట్టు కొన్ని బంధాలు మనిషికి మనిషికి నడుమ మరికొన్ని బంధాలు మనసుకి మనసుకి నడుమ కొందరి జివితాలు తెరిచిన పుస్తకాలు మరి కొందరివి మండుతున్న ఆశల అగాధాలు కొందరు జీవితాన్ని వెక్కిరిస్తారు మరికొందరు అదే జీవితాన్ని ఔపోసన పడ్తారు కాలగమనంలో అందరి పయనం (అటే) అయినా ఏలా ఇలా దాపరికాలు.. మమతానురాగాల మాటు రేగే వింత ప్రశ్నలు కొన్ని బంధాల నిడివి కొద్ది కాలమైనా వాటి విలువ జీవితకాలం గుర్తుండిపోతాయి ప్రకృతిలో శిలాక్షరాలై మిగిలిపోతాయి మరికొన్ని ఇసుక తిన్నెలుగా మారి సంద్రపు అలల నురగలై ఉవ్వెత్తున ఎగసి మరలి వెళ్ళిపోతాయి జీవితమనే పుస్తకమే మనది, అందులో కోపతాపాలు బంధాలు బాంధవ్యాలు ప్రేమలు ఆప్యాయతనురాగాభిమానాలు కష్టసుఖాలు కలబోసిన ఓ కమ్మని కావ్యమాలిక

భార్య భర్తల అనురాగాత్మీయ బంధం

  భార్య గౌరవం తన భర్త అడుగు జాడల్లోనే ఉంటుంది. వైవాహిక బంధం తో ముడి వేసుకున్న ఆడ పిల్ల పుట్టినింటి పరువు ను మెట్టినింటి మర్యాద ను భర్తకు తోడుగా భర్తయే నీడగా తలచి కాపాడు కోవాలి. సీతమ్మ తల్లి రాముని వెంట అడవులకు సైతం పయనమయ్యి సాధ్వి అనిపించుకున్నారు.. కనుకనే నేటికి ఆదర్శ దంపతులు సీతరాముల వారే..! ~శ్రీత ధరణి

SpEcIaL eFfEcT

 కు..తో..వం.. ఎ..పి.. వా.. ఆ.. ఊ.. పె.. కు.. హ.. కలత చెందిన మనసు వేదన నిండిన హృదయం

అక్షువులు

 అపురూప దృష్యాలను అలవోకగా బంధిస్తు.. వాటిని జ్ఞాపకాలుగా మలచి.. నింగి నేల నడుమ నిచ్చెనలా.. నిన్న కి నేటికి నడుమ వారధిలా.. కవల కలువ కుసుమాలుగా ముఖారవిందంపై కలలకి వాస్తవాలకి చిరు చెమ్మకి భాష్ప తుషారానికి ఆనవాలు * అక్షువులు *

కాలం

నే పుట్టి మూడున్నర దశాబ్దాల నాటి నుండి ఏనాడైనా అనుకున్నానా ప్రాచిన సాంప్రదాయమైన మన నమస్కారం ఇలా షేక్ హ్యాండ్ దాక వచ్చిన టెక్నాలజిని దాటి మరల నమస్కారం యావత్ ప్రపంచానికే సోకిన కరోనా ను కాస్తో కూస్తో కట్టడి చేసే సాధనమై నిలుస్తుందని.. ఈ మూడు పదుల  ఐదు ఒకట్ల వయసులో సైతం ఒకరితో ఒకరికి ఉత్తరం నుండి వృద్ధి చెంది ల్యాండ్ లైన్ దాటుకుని సెల్ల్యూలర్ మొబైల్ ను మించి డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ తో విడియో కాన్ఫరెన్స్ ఐతేనే ఈ కోవిడ్ కాలమున సరైన ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు ఉంటుందని. ఈ ముప్పది ఐదు ఎండ్ల నాటి సంధి ఏ మారు మూలాన సైతం కిక్కిరిసిన జనం గగ్గోలు వింటు.. ట్యాక్సి, బస్ ట్రేయిన్, ఏయిరోప్లేన్ లలో నిత్యం సందడి కాస్త అటు ఇటుగా ఇరవై ముప్పై మించ కూడని ప్రయాణాలకు దారి తీస్తుందని గడచిన ముప్పై ఐదేళ్ళలో దగ్గు కి బెనాడ్రిల్ సిరప్ లేదా అజిత్రాల్ ౨౫౦ ట్యాబ్లెట్లు, జలుబు కు సెట్రిజైన్ హైడ్రోక్లోరైడ్, జ్వరానికి వోవెరిన్, పెరసెటమాల్ మాతరలు వేసుకుంటే ఇట్టే నయమయ్యే షరామామూలు కాస్త పెచ్చుమీరి అలాటి లక్షణాలనే పోలి ఇలా ఇలాఖాలలో వణుకు పుట్టించేదిగా పరిణితి చెంది మ్యాస్క్ లను సైతం బట్టలలో భాగం చేసేటంతగా భయభ్రాంతులకు గురిచేస్

నా చిట్టి తల్లి

నీ ముద్దు మాటలతో ఆనందరాగాల డోలికలే వీనుల విందవగా నీ పాదముద్ర నా యదపై తడబడుతు సాగువేళ చక్కగా నీ చిరునవ్వులోలుకు మోవిపై పసిప్రాయం భాసిల్లగా నా చిట్టి తల్లి నీకు జన్మంత వాత్సల్యతను పంచుతు ఋణపడి ఉండనా ఆము అంటు నీ మునివేళ్ళను నువ్వే నోటికి చేర్చుతు సైగ చేసే వేళ గోరు ముద్దలు కలిపి కొసరి తినిపిస్తు నీ కడుపు చల్లగాయని దీవించనా ఖా అంటు దీర్ఘంగా గంభిరంగా నీవు చెబుతుంటే జెమ్స్ తెచ్చి ఒక్కోటి చొప్పున రోజు నీకు కానుకీయనా తాతా అంటు గారాలుపోతు తాతయ్య దగ్గర మురిపించినా నానమ్మ ను మామా అంటు పలకరిస్తూనే ఓయంటు నానమ్మే పలకగా వెంటనే ఏయ్ అంటు ముసిముసి నవ్వులు చిందించటం శానిటైజర్ చేతిలో వెయ్యమంఠు నా దగ్గరకొచ్చి తలాడిస్తు నీ చిన్నారి పిడికిలిను అలవోకగా విప్పదీసినా.. ఆటలాడుతు అమ్మను సైతం నీ ఆటబొమ్మగా మలుచుకుని జుట్టంత లాగేసే అల్లరి పిల్లవంటు ఫిరియాదులను ముద్దులతో అందరం ఏకధాటిగా ఆశిస్సులను అందిస్తూ నా ఎడమ చేతి బొట్టన వేలు ఎలా ఆడుతుందో గమనిస్తూ నీ ఎడమచేతి బొట్టన వేలినలా తిప్పటం అది నీకే సాటి ఓ గారాల పట్టి మా ఇంట తిరగాడే శ్రీ కనక కవచ ధారిణి దుర్గాంబిక అంశవై నిండు నూరేళ్ళు సౌఖ్యంగా సఖ్యతగా ధనధాన్యాదులతో తూలతూగుతు ఆ

Thoughts and Quotes

One might think how am I able to put forth ample quotes, each of which are unique in nature. It is all due to the way how I perceive things in more than one perspective, and dip them in an optimistic flavour. Sometimes, pathetic circumstances overlap, but then, the outcome ought to be always in a way that is approved by everyone alike. Everything has got its own abilities, limitations and are always unique by their own ways, but then, there must be harmony amongst them. An Eagle and A Baya Weaver: Both are Birds, they can fly, but a Baya Weaver cannot glide, An Eagle cannot weave the Signature Balcony Nest.

కరోనాకాష్టం

ఏవైపునకు పయనమౌతోందో భారతావని భవిత కోవిడ్ సంక్షోభం ఒక వైపు లాక్ డౌన్ ఆంక్షల సడలింపు ఒక వైపు ఏ ఒక్కదాన్ని ఈ సమయంలో కదిపినా అతలాకుతలమే ఏవైపునకు పయనమౌతోందో భారతావని భవిత ఇతర రుగ్మతలకై లేద వేరే లక్షణాలకై ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఇపుడు భయం భయం గర్భం దాల్చినా, మలేరియ వచ్చినా, పన్ను పుచ్చినా వేరే ఇతరత్ర కారణాలున్నా ఆసుపత్రి నుండి సంక్రమిస్తున్న తీరు ఆందోళన కలిగి

чучулу

небольшая помощь всегда возвращается. (Шридхар Анита "чучулу" шаранйа) [шестнадцать июня две тысячи двадцать]

నాకే ఎందుకిలా

తాను నా దగ్గరుంటే "నేను మా పుట్టింటికి వెళ్ళి వస్తా" నంటది. నా సమ్మతమున్నా లేకున్నా తాను వెళ్ళే తీరుతుంది. మరల తనని తన పుట్టినింటి నుండి మెట్టినింటికి తీసుకు రావటం కోసం అడిగితే.. "నేను చెప్పినపుడు టికెట్ బుక్ చేయ"మంటది. తాను తన పుట్టింటిలో ఉంటే అక్కడ దుమ్ము ధూళిలో తనెలా ఉందో ననే దిగులే నాకు ఎక్కువా.. వారం రోజులైతే నేను కూడా ఉండి తనని వెంటబెట్టుకు రావచ్చు.. కాని తాను ఉండేది కనీసం మూడు నెలలు. మా పెళ్ళైన నాటి నుండి నేటి వరకు గత రెండేళ్ళలో తన పుట్టింటిలోనే దాదాపుగా పదునాలుగు నెలలు గడిపింది. దసర కి పంపితే దీపావళి ముగిసాక నేనే వెళ్ళి తీసుకురావాలి. సంక్రాంతికి పంపితే ఉగాది చేసుకున్నాక నేనే దగ్గరుండి జత చేసుకురావాలి. కొసమెఱుపు ఏమంటే అంత ఆత్రంగా వెళ్ళొచ్చే తనకు తనవారు ఏ రోజు కూడా కొత్త బట్టలు గాని ఏది కొనివ్వరు. ఏదైన నీ భర్తయే కొనాలి అని సర్ది పంపుతారు. కొనేటప్పుడు భర్త అవసరం కాని గడచిన ఇరవై ఏడు నెలల మా కాపురంలో పదే పది నెలలు నాతో గడిపింది. ఇందులో సైతం ఆరు నెలలు పురుడుకని మరల తన పుట్టింటికే పయనమయ్యింది. తానిక్కడ ఉంటే "మా వాళ్ళు గుర్తుకు వస్తున్నారు, నేను వెళ్ళోస్తా"

ಇಂದೂರ್ ವಾತೇಜ್ ವಾತೇ

 ೧. ನೌಕರಿ ಅಜ್ಜಿ ಆಯಿಕೋನಿವತೋ: ಅಜ್ಜಿ ತೋನ ನೌಕರಿ ಕನ್ನಾ ಆವ..? ನೌಕರಿ ಆವ ಜೇರ್ ಪಚ್ಚ: ಕತ್ರಾ ಪಿಸಾ ಕಮಾರೋಚಿಕೋ..! ೨. ವಾಯಾ ವೀಕೋನಿ ವತೋ: ಅಜ್ಜಿ ವಾಯಾ ಕನ್ನಾ ಕರೇಚಿ.. ತಾರ್ ಸೋಪತೇರ್ ಸೇರ್ ವಾಯಾ ವೇಗೇ ವಾಯಾ ಕರ್ಲಾವತೋ: ವಾಯಾ ವೋಜೇನ ಅತ್ರಾ ದಾಡ್ ವೇಗೇ.. ಛೂಚಾರ್ ಸಾರು ಟ್ರೈ ಕರೋ ೩. ಗ್ವಾಣ್ಣಿ ಢೀನ್ ರಾತ್ ಛೇಟಿ ಸೋವತೋ: ಮ ಆತಾಣಿ ತಾರ್ ಪಾಕ್ತಿ  ಭಳ್ನು ಕೇನ್ ಮಜ್ ಕೇಣು ಕೂ? ಗ್ವಾಣ್ಣಿರ್ ಪಾಕ್ತಿ ಸೋವತೋ: ದಾಡಿ ಎಕ್ಕಜ್ ಲೋಕಂ ಕೂ? ೪. ವಿಸ್ರಾ ಲೇವಾಸು ಮಾರ್ ಕನ ಫಿಸಾ ಛೇನಿ ಕೇನ್ ಕಕಲತೋ: ಕಮಾ ತಾಣಿ ಗ್ವಾಣ್ಣಿನ ಹಾಂಸಿ ಖುಷೇತಿ ರಕಾಡ್ನು ಕೇನ್ ಮಾಲಂ ಛೇನಿಗ? ವಿಸ್ರಾ ಸಾರು ಪಿಸಾ ಖರ್ಚ್ ಕರತೋ: ಪಿಸಾ ದಿಕಾರೇಚ ಕೇನ್ ಸೇ ಲಾಲೇರೋಜ್ ಗ? ೫. ಅಸ್ಮಾನ್ ದಾಡೇತಿ ವಾತೇ ಕರ ನತೋ: ಹಮ್ ಕಸನ್ ಹರ್ದೇ ಆಂವಾಂಚಾ.. ದಾಡಿ ದಾಡಿ ವಾತೇ ಕರತೋ: ಕಾಲಜ್ ವಾತೇ ಕಿದೋ ಕಾಯಿ..  ೬. ಹಂಗೋಳಿ ಕರಾಯೇಚಿ ಗ ಮನ: ತಾರ್ ಹಾತ್ ಛೇನಿ ಗ.. ಕರ್ಲೇನಿ ಹಂಗೋಳಿ ಕರಾದುಂಗಯ ತೋನ: ಚಾಯೇನಿ.. ಕಸನ್ ತೋನ ಮಾತಿ.. ಮ ಕರ್ಲೂಂಚು ಧೇರ್ ೭. ಲಗ್ಗಾ.. ಕಸ್ ಕಸ್ಸನ್.. ಲಾನಿ.. ಊಟ್ ಅಬ್ ಧೇರ್

ఇదేమి విచిత్రమో ఏమో

ఈ మధ్య నేను రాతిరి పదకొండు గంటలకు నిద్ర కై ఉపక్రమిస్తుంటే ఒక్కోసారి ఏవేవో ఆలోచనలతో ఆ రాత్రంత పోరాడుతు ఉషస్సుకు మునుపే తెలవారు ఝామున రెండున్నర గంటలకే మెలకువ వచ్చేస్తోంది. బహుశ లోకమంతట విచ్చలవిడిగా విజృంభిస్తున్న కోరోనవైరస్ గూర్చి ఆలోచనలో.. లేక ఎపుడు వీలు చిక్కితే చల్లగ పుట్టింటికి జారుకుందామని చూసే సతి ఏకధాటిగా మూడు నెలలు మెట్టినింట ఉండవలసి వచ్చిందనే నెపంతో విసిరే పదజాలం మూలానో (అక్కడికేదో మా అత్తారింటిలో అన్ని ఉన్నాయనుకునేరు. ఆమెకి అసలుకి మెట్టినిల్లే స్వర్గ ధామం) లేక ఈ గందరగోళ సమయంలో అతలాకుతలమౌతున్న వాణిజ్య వ్యాపారాలు వృత్తి తాలుకు ఒడిదుడుకుల వలనో. మరి ముఖ్యంగ ఇటువంటి సమయంలో కనిపెంచిన తలిదండ్రుల ఆరోగ్యం మరియు నా కన్న కూతురి ఆలన పాలన ఆరోగ్యం గురించిన దిగులో.. తెలియక సతమతమవుతున్న వేళ వారంలో మూడు రోజుల మినహ నిద్ర పట్టట్లేదేమో. చూపెడదామన్నా ఛాతి ఆస్పత్రులను మినహాయించి ఇతర ఆరోగ్య సేవల నిమిత్తం వైద్యులు ఉన్నారో లేదో అనే సందిగ్దత. ఉన్నా గాని సుస్తి చేసిన పలువురు తిరిగే ఆరోగ్యాలయం లో ఇపుడు తిరగాడితే లేనివారికి సైతం వ్యాధి అంటుకుంటుందేమోనన్న భయం. ఈ కోవిడ్ కాలం లో పరిస్థితులు ఇంత దైన్యంగా ఉంటాయ

ఒక (అ)భాగ్యుడి (క)వ్యథ

అనుమానాలు అవమానాలకి అపవాదులకి అపార్దాలకి దారి తీస్తాయి అటువంటప్పుడు నమ్మిక, విధేయత, విశ్వసనీయత, నిరాడంబరత, నిబద్ధత లన్ని బుగ్గిపాలే కనుకనే ఆచరణీయ యోగ్యత గలగిన మంచికే మొగ్గు చూపించాలి. హరిః ఓం గోవింద మాధవాయ

ಧರ್ಮಪತ್ನಿ

నీకు స్నేహితులు లేకపోతే నాకు ఉండకూడదా అంటు నిలదీస్తున్నావు కదా.. నీకు ఏదైనా అవసరం వచ్చినపుడో లేదా సుస్తి చేసినపుడో ముందుగా నిను కాపాడుకోవాలని తపించేది నీ భర్త నైన నేను, నీ అత్త మామలు. నిన్ను కన్నవారు, నీ తోబుట్టువులు నీ పెళ్ళి అయ్యాక చుట్టాలుగానే ఉంటారు.. తమ ఇంటి బిడ్డ అత్తారింట క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. స్నేహితులు ఒక స్థాయి దాటిన తర్వాత ఏ అవసరమొచ్చినా, ఎలాంటి సాయానికి అర్థించినా "ఔనా! అయ్యో!!" అంటు నిటూర్చే వారే తప్పితే వారికి అంతకు మించిన వ్యవహారాలతో ప్రయోజనాలుండవు. మహా ఐతే సలహాలు, సూచనలు ఇవ్వగలరే కాని నీ వారిలా నిన్ను ఆదుకోలేరు. స్నేహం ఉండాలి కాని మరీ మితీ మీర కూడదు. స్నేహాన్ని అదనుగా మలచి మోసాలు చేసే వారు లేకపోలేదు. స్నేహం పేరిట డబ్బులకు పూచికత్తుగా హామి పత్రాలతో వంచన చేసి పరారై ఇరకాటంలో నెట్టిన వారు లేకపోలేదు. కన్నందుకు తల్లిదండ్రులకు, వారింట పుణ్యస్త్రీ గా కాలుమోపినందుకు అత్తారింటికి, తనకు జీవిత భాగస్వామిగా మెలుగుతున్నందుకు భర్తకు విధేయత ఒక పుణ్య స్త్రీగా తన ధర్మం. ఎంతటి దుర్భర పరిస్థితులలో నైనా ఓకరికొకరు అన్యోన్యతను, ఆత్మీయతను వీడని వారే పుణ్య దంపతులు. కళ్యాణంలో ఒక

04 May 2019

బెజవాడ కనకదుర్గాదేవి రియాలిస్టిక్ క్రియేషన్స్ భూక్యా "ధరణి" ఫ్యామిలి ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ "ప్రాజెక్ట్ ౧" _ శరణ్య _ రిలీజ్: మే ౦౪ ౨౦౧౯ రన్నింగ్ సక్సెస్‌ఫుల్లి

కొరోనా సిన్స్ మార్చి ట్వెంటి ఫోర్ ౨౦౨౦ ఆన్ వర్డ్స్

కంటికి కానరాని బూచి ఏదో దోబూచూలాడుతోంది తుమ్మినా దగ్గినా ముట్టినా మొట్టినా మాట వినని మోండిది దేశాటనమంటు బయలుదేరి కుప్పతెప్పలుగా ఈ అణువంతది చివరాఖరునా మ్యాస్క్ యాప్రన్ సామాజిక దూరాల షర్తులతో ఎక్కడివారక్కడే ఎవరికివారై గప్ చుప్ ఉండమంటోంది లేని యేడల మహమ్మారియై కాటు వేయగా నిర్దయ చూపే కోరలు లేని కొరోనా రక్కసొకటి లాక్ డౌన్ తో సతమతమౌతూనే ఆరోగ్యానికై సమాయత్తమౌతు జన సంద్రం

వ్యత్యాసమిదేనా

మీ స్థాయి తెలిసి కూడా నీ గుణం గాఁచి పెళ్ళి చేసుకున్నా మీ వాళ్ళు కేవలం నా వెనుకనున్న ఆస్తి చూసి నిన్ను ఎరగా వేశారని తెలుసుకోలేక పోతున్నావ్ ఐనా జీలకర్ర మెంతులు లాటి దినుసులనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు బుడ్వీజర్ బ్లాక్ డాగ్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో బాడుగ ఇంటిలో అపుడపుడు ఎగవేతలు కోతలతో సతమతమవ్వుతూనే ఇతరులను హేళన చేసేవారు కష్టార్జితంతో సొంతిల్లు నిర్మించి వేరొకరికి బాడుగకు ఇస్తే రూపాయి కూడా అందులో పెట్టుబడి లేని మీకు మాపై కసురుకూనే హక్కు ఇచ్చిందెవరు ఐనా కందులు మినుములు లాటి నిత్యవసరాలనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు ఆఫిసర్స్ చాయిస్ సిగ్నేచర్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో పాతిక లక్షల సరిసమానంగా కట్న కానుకలు ఇచ్చి కూతూరి వివాహం చేయాలనుకూని కోరుకున్న వాడిని కట్టుకూని అరవై మూడు లక్షల నగదును ఒక్క దఫాలో ఇచ్చి సాగనంపారు కట్నం ఊసెత్తకుండా వివాహం చేసుకుందామనుకూనే తరుణంలో మేమేమి తక్కువ కాదని కలుగచేసుకుని మరీ పన్నెండు లక్షలు ఇస్తామని రెండు లక్షల ఎనభై వేలకు సరితూగే బంగారు నగలు కొని సర్దిచెప్పుకున్నా

పీడ కలలా..

ఎవరో చేసిన పనికి తలవంపులెందులకు వారిరువురికి సమ్మతమట మనకెందులకు తర్జన భర్జన పడుతోందా మనసు అడుగెందుకు మాయ విశ్వం ఇందలి సూక్ష్మం గ్రహించేందుకు మధన పడరాదు దిక్కులన్ని పెక్కటిల్లెటందుకా శిరోభారమై కంటతడిని సైతం చూసి చలించేటందుకా దాటి పోయింది చేయి వాత్సల్యానికే కాలం చెల్లిపోయింది కనుకనే కనికరం లేకుండ మమ్మొదిలి వాడితో జతగా పిన్న చెల్లి వెళ్ళిపోయింది

ఋణం~ దారుణం

లోకం తీరు చేదు నిజం "వారిరువురు రెండు నెలల వ్యవధిలో స్వలాభాపేక్ష తో నటించి ఏడు పదుల శత సహస్రాలను మూటగట్టుకున్నారు." "ఇతనొకరు స్వార్థరహితంగ రేయిఁబవళ్ళు కష్టార్జించి పైసా పైసా కూడబెట్టుకున్నారు." "వారిరువురు కైకేయి మనస్తత్వంతో వీరి ఒక్కగానొక పుత్రుణ్ణే వీరి నుండి దూరం చేసే పన్నాగం రచించారు." "ఇతనొకరే కుటుంబమంత కలిసిమెలసి ఉండాలనే భావనను ఇన్నేళ్ళుగా నిలబెడుతు వస్తున్నారు." "మంథర వాదమో కైకేయి పంథమో రాముడిని అయోద్య నుండి పదునాలుగేళ్ళు దూరం చేశారు." "మాయలేడి ఇంద్రజాలమో శూపనఖ కనికట్టో ఆనాడు రాముడిని సీతను వేరు చేశారు." "ఇన్నాళుగా తనపై ఉన్న వాత్సల్యతను వీరిరువురి స్వార్థంతో జీవితాంతం దోషిలా నిలబెట్టాలనే పన్నాగం పన్నీనారు." "వారికి రావలసిన మొత్తాన్ని వీలైనంత తక్కువ సమయంలో చేజిక్కించుకున్నారు." "అన్ని ఉండి కూడా కన్నవారి ఆదరణను నోచుకోనీకుండ అయోమయంలో నెట్టేశారు."

అజాత శత్రువు

మైఁ అజాత్శత్రు థా.. పతా హి నహి థా కి ఏక్ ఐసా భీ దిన్ ఆయేగా జబ్ అపనే హి పరాయే హుఆ కరేఁగే ఔర్ పరాయా కోయి అప్నా శత్రు బన్కర్ ముసీబత్ ఖడా కర్దేగా..! అప్నే పరాయే కా ఖేల్ మేఁ కుద్రత్ కి క్యా ఖాసియత్ హై సిర్ఫ్ ఇస్కా అందాజా ఆఖిర్ వక్త్ కే దౌరాన్ హి లగా సక్తే హైఁ

కోవిడ్ కరోనాకాష్టం

అమ్మా.. భారతావని.. ఎపుడు సస్య శ్యామలమై విరాజిల్లే నీకు.. ఈ కరోనాకాష్టం పచ్చదనంలో అరుణవర్ణం కలిపింది తల్లి.. తల్లడిల్లే రెమ్మలం.. దిక్కుతోచక హాహాకారాలు సైతం చేయటానికి విలు పడక మ్యాస్క్ తో నోటిని.. బరువెక్కిన కంటిలో చెమ్మను సైతం.. బయట అడుగుపడనీక.. లోలోపలే గాలిలో ఆరబెట్టుకుంటున్నామమ్మ.. నిప్పు ఒకసారే రాజుకుని కారడవినంతటిని బుగ్గిపాలు చేస్తుంది.. ఈ కోవిడ్ కలకలం కలహాలకు అతీతమై.. క్వారెన్‌టైన్ తో ఛిన్నాభిన్నమై.. ఐసోలేషన్ మూలాన డిప్రెస్డ్ అయ్యి మరి కొందరు.. ఇహ.. ఈ కార్చిచ్చు ఎవరిని దహిస్తుందో.. ఎవరిని సహిస్తుందో.. కాలమే నిర్ణయించాలి.

March 22, 2020~March 24, 2020 CoViD 2019

ఇసుక రేణువంత కూడా లేని కోవిడ్-౧౯ వైరస్ జన సంద్రాన్ని అతలాకుతలం చేసేంతగా ఇంటిలోనే ఉండాలని ప్రతి ఒక్కరిపై ఫోకస్ హుబేయి వుహాన్ నుండి ఇంపోర్ట్ అయ్యిందిగా ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అవుతోంది డిస్కస్ మాస్కులతో ఓవర్ కోట్ లతో ఐసోలేషన్ పకడ్బందిగా నాలుగు ఖాండాలలో వ్యాపించి మార్చేను ప్రపంచ స్టేటస్ వ్యవహరించాలి లాక్ డౌన్ లో మనమంత దురుసుగా అపుడే కొంత లో కొంత మేరకు చల్లబడుతుందేమో రక్కస్

కరోనా

నిఖార్సైన నిండు జీవితాన చాపకింద నీరులా ప్రవేశించావు పుట్టినెక్కి నదిలో విహరిస్తున్న వేళ అకస్మాత్తుగా పెను తూఫానై తీరం కానరాని సంద్రపు నడిబొడ్డులో నిలబెట్టినావు అరకొరగా అడుగులేద్దామన్న ఏవైపున ఎంత లోతుందో ఎవరికెరుక మనిషి ఆగడాలను భరించినట్టే కానవస్తోంది ఇన్నేళ్ళు భూమి కలివిడిగా ఉంటే అనవసరంగా గొడవకు దిగేవారు వైద్య సిబ్బందికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించే కొద్దిమంది ఒకపుడు జన సంద్రాన్ని చూసి భయభ్రాంతులతో పగవాడే పరారయ్యే వాడు కాని రాను రాను పరిస్థితి దారుణమాయే.. మండె ఎండలకు మంచుకొండలు కరిగి ఉపరితల ఆవరణ కనుమరుగయ్యే క్షణం.. నిన్నటి దాక మనిషి దాస్టికాన్ని ఓర్చుకున్న పుడమి నేడు బహుశ అదే గుణాన్ని మానవ జాతికి పరిచయం చేస్తుందో ఏమో

010820091401

కొందరి మనసులో అనుమానం నాటుకుందంటే ఎన్నెన్ని మంచి చేసినా గాని చెడునే ఆపాదించి చులకన చేస్తుంటారు, హేళన వారి ఇంటిపేరౌతుంది, కోపం తన మదిలో ఎల్లకాలం నిలిచి ఉంటుంది.. పరిస్థితులు పర్యావసనాలు స్థితిగతులు ఏదేమైనప్పటికి..! 011409200801

~

జీవితం చూట్టు ఆశలు అడియాశలు భావోద్వేగాల నడుమ రాగద్వేశాలు సిర ధమనుల ను దాచే కండర యముకలు శిథిలమైన అవయవాలకు పెళుసుబారే అస్తిపంజరాలు ఒకరికొకరై కడదాక మెదిలితే నవరసాలు కోపోద్రిక్తత కనుమరుగున పడితే అన్యోన్యతలు అపుడుపుడు నమ్మినా నష్టమే అడపదడప కావలసినా కష్టమే పేగు బంధానికి విలువ కాటిలో కట్టే కాలే ఘడియ దాక వేగు చుక్క తళుకు విలువ నిశీధిన మెఱిసే దాక ఆర్థోపెడిషియన్ మొదలు జెనెరల్ సర్జన్ దాక చమురు కొండెక్కక మునుపే దీపాన్ని కాపాడే కరములు తెలిసి తెలియక నడిచే దారిలో అపుడపుడు రాళ్ళు రప్పలు కాని పాదం ధూళి తాకితే రాయైనా ముక్కలగును ముళ్ళు సైతం పూలగును కాలమే సాక్షి కాలానికే కష్టాన్ని పరిచయం చేయటం తెలుసు మరల ఆ కాలక్రమంలో నష్టాన్ని నివారించటం తెలుసు ఏదేమైన ఈ ఊపిరి లయగతుల లోలకడోలక మనసు మందిరాన భావాలకు కొదవ లేదు.

ಕೆರಟಂ

కడలి పాతదే కెరటం కొత్త ఒరవడి ఆకాశం పాతదే మేఘాలు కొత్త ఒరవడి ఊహలు పాతవే ఆలోచనలు కొత్త ఒరవడి పాత కొత్తలో వ్యత్యాసం కేవలం కాలగమన మార్పు నిన్నటి పాతలో రేపటి కొత్తదనానికై నేటి సంఘర్షణ

Travel Woes

Sometimes, A Joyful Journey becomes a Grisly Grumpy Trip, all that makes it so, is dependent on who you are travelling with and who else is travelling with you, which can affect your mood and reflect your emotion outburst. 《20806》 09.02.2020

ఉనికి

కలలనేవి కనుల కొలనులో మానసిక ప్రతిబింబాలు ఆలోచనలనేవి మేధోమధన ప్రక్రియ ఈ రెంటికి మిన్ను మన్ను కు ఉన్నంత తేడ ఉంటుంది.. ఆ రెంటి నడుమ భావోద్వేగాల రాగద్వేషాల ప్రేమానురాగలను కలగలసిన ఉచ్వాస నిఃశ్వాసలో వెతుక్కోవాలి మనిషి యొక్క ఉనికి.

పాలు పెరుగు నేయి ఈ బంధం అమోఘం

భార్య భర్తల బంధం పాలు నీళ్ళలా కలిసి మెలసి ఉండాలి అలా ఐతే ఇద్దరి ఆంతర్యాలకు వ్యత్యాసాలు దొరకవు.. పాలు తోడుగా ఉంటే ఉనికి కాస్త పులిసి పెరుగులా మొత్తం పాలనే మార్చేస్తుంది.. ఐతే కాసిన్ని నీళ్ళతో మజ్జిగ చిలికి వెన్నలా ఆ బంధానికే వన్నె చేకురుతుంది.. కాచిన నేయిలా కలకాలం ఆ బంధం గుభాళిస్తుంది..! #ధరణి

Point of View

It is how you perceive from your point of view that matters, for some, the tracks converge, for some they diverge, and for some others, they are fixed to the fish plate. It is not the branching or rooting, it is the perseverance that matters most.

అయోమయ నివృత్తి

రెప్పల నడుమ లోకాన్నే ఇమడ్చగల కన్నుల్లో అపుడపుడు చెమరింతల చిరుజల్లు.. కోప తాపాల అశనిపాత ఘాతాన్ని అణిగిమణిగి అణచాలి.. మనసు వ్యాకులత.. మనిషిలో సందిగ్ధత.. అపురూప భావాలన్ని అయోమయ ఆలోచనలతో గందరగోళాన్ని సృష్టిస్తున్నా గాని మంచితనపు మార్గమెపుడు స్వాగతం పలుకుతూనే ఉంటుంది..

Impact

We may be stationary, but are flowing with the Time. What surrounds us is an envelope of Time defined events that make an impact. How we react to the impact is what we define as emotion. How we tackle with the emotional outburst depicts our strength.

मुशाफ़िर

हम ज़मी पर चंद दिनों के मुशाफ़िर हैं, ना गलती तेरी ना ही मेरी, यह सब कुछ तो भगवान का खेल है, कुदरत की चाल है, नसीब की लकीरें भी रास्ते की तरह मोड़ लिया करती है, हर किसी को नाकामयाब समझना वाकई भूल है, किस शक्स में क्या ख़ूबी है, बस यह वक्त की तालमेल है।

సంక్రాంతి ౨౦౨౦

ఆయణ వర్తనం మకర సంక్రమణం ఆయురారోగ్య ధన ధాన్యాది అభివృద్ధి అభీష్టం సంక్రాంతి పర్వ దివస శుభాశయః ౧౫.౦౧.౨౦౨౦

దూరం

దూరాలు దూరాలు కాలేవు.. అవి తాత్కాలిక సందర్భాలే ఎప్పటికి.. ఆ కాస్త దూరం ఉండటం చేతనే ప్రేమ హృదయంలో ఆప్యాయత మనసులో పల్లవిస్తుంది.. హృదయానికి మష్తిస్కానికి గల దూరమే వాటి ప్రాముఖ్యతకు తార్కాణం..

12739 08.01.2020

ఘల్లు ఘల్లు గజ్జల ఘల్లు చిటపట చినుకుల చిరుజల్లు గరిమ అరుణిమ పులకింతల పరవళ్ళు గరీబ్ రథ్ లో దువ్వాడ నుండి వరంగల్ దాక ఊయల సవ్వళ్ళు