పీడ కలలా..

ఎవరో చేసిన పనికి తలవంపులెందులకు
వారిరువురికి సమ్మతమట మనకెందులకు
తర్జన భర్జన పడుతోందా మనసు అడుగెందుకు
మాయ విశ్వం ఇందలి సూక్ష్మం గ్రహించేందుకు
మధన పడరాదు దిక్కులన్ని పెక్కటిల్లెటందుకా
శిరోభారమై కంటతడిని సైతం చూసి చలించేటందుకా
దాటి పోయింది చేయి వాత్సల్యానికే కాలం చెల్లిపోయింది
కనుకనే కనికరం లేకుండ మమ్మొదిలి వాడితో జతగా పిన్న చెల్లి వెళ్ళిపోయింది

Popular Posts