వ్యత్యాసమిదేనా


మీ స్థాయి తెలిసి కూడా నీ గుణం గాఁచి పెళ్ళి చేసుకున్నా
మీ వాళ్ళు కేవలం నా వెనుకనున్న ఆస్తి చూసి నిన్ను ఎరగా వేశారని తెలుసుకోలేక పోతున్నావ్
ఐనా జీలకర్ర మెంతులు లాటి దినుసులనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు
బుడ్వీజర్ బ్లాక్ డాగ్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో

బాడుగ ఇంటిలో అపుడపుడు ఎగవేతలు కోతలతో సతమతమవ్వుతూనే ఇతరులను హేళన చేసేవారు
కష్టార్జితంతో సొంతిల్లు నిర్మించి వేరొకరికి బాడుగకు ఇస్తే
రూపాయి కూడా అందులో పెట్టుబడి లేని మీకు మాపై కసురుకూనే హక్కు ఇచ్చిందెవరు
ఐనా కందులు మినుములు లాటి నిత్యవసరాలనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు
ఆఫిసర్స్ చాయిస్ సిగ్నేచర్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో

పాతిక లక్షల సరిసమానంగా కట్న కానుకలు ఇచ్చి కూతూరి వివాహం చేయాలనుకూని కోరుకున్న వాడిని కట్టుకూని అరవై మూడు లక్షల నగదును ఒక్క దఫాలో ఇచ్చి సాగనంపారు
కట్నం ఊసెత్తకుండా వివాహం చేసుకుందామనుకూనే తరుణంలో
మేమేమి తక్కువ కాదని కలుగచేసుకుని మరీ పన్నెండు లక్షలు ఇస్తామని రెండు లక్షల ఎనభై వేలకు సరితూగే బంగారు నగలు కొని సర్దిచెప్పుకున్నారు
ఐనా ఉప్పు కారం లాటి నిత్యవసరాలనే కొనుగోలు చేయగలిగే కుటుంబంలో పుట్టిన నాకు
ఇంపిరీయల్ బ్లూ మెక్ డవెల్ కొని తాగి తూగే కుటుంబంలో పుట్టిన నీకు బహుశ ఇదే వ్యత్యాసమేమో

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల