ఋణం~ దారుణం
లోకం తీరు చేదు నిజం "వారిరువురు రెండు నెలల వ్యవధిలో స్వలాభాపేక్ష తో నటించి ఏడు పదుల శత సహస్రాలను మూటగట్టుకున్నారు." "ఇతనొకరు స్వార్థరహితంగ రేయిఁబవళ్ళు కష్టార్జించి పైసా పైసా కూడబెట్టుకున్నారు." "వారిరువురు కైకేయి మనస్తత్వంతో వీరి ఒక్కగానొక పుత్రుణ్ణే వీరి నుండి దూరం చేసే పన్నాగం రచించారు." "ఇతనొకరే కుటుంబమంత కలిసిమెలసి ఉండాలనే భావనను ఇన్నేళ్ళుగా నిలబెడుతు వస్తున్నారు." "మంథర వాదమో కైకేయి పంథమో రాముడిని అయోద్య నుండి పదునాలుగేళ్ళు దూరం చేశారు." "మాయలేడి ఇంద్రజాలమో శూపనఖ కనికట్టో ఆనాడు రాముడిని సీతను వేరు చేశారు." "ఇన్నాళుగా తనపై ఉన్న వాత్సల్యతను వీరిరువురి స్వార్థంతో జీవితాంతం దోషిలా నిలబెట్టాలనే పన్నాగం పన్నీనారు." "వారికి రావలసిన మొత్తాన్ని వీలైనంత తక్కువ సమయంలో చేజిక్కించుకున్నారు." "అన్ని ఉండి కూడా కన్నవారి ఆదరణను నోచుకోనీకుండ అయోమయంలో నెట్టేశారు."