Posts

Showing posts from May, 2015

జీవితానికి ఇదే నిండైన నిర్వచన

కదిలే కన్నుల్లో కలలే లోకమై ఇమిడినట్టు  ప్రతి గుండెలయలో ప్రాణమే ఊయలూగినట్టు   రెప్పల అలికిడిలో అశ్రువు బిందువు బాధకి ఆనందానికి నిఖార్సైన నెలవు  ఆనందరాగమే రవళించే వాసంతం  కోయిల రాగాలే ఆలపించెను కాలం  ఊపిరే ఆయువుకు ఆలంబన  జీవితానికి ఇదే నిండైన నిర్వచన   

భావాలు

కావ్యం కాదు కవనం కాదు అక్షరాలతో అల్లిన భావగీతం ఇది పదాల మాటున దాగిన భావాలకు ప్రతిరూపం ఇది కరిగే మేఘానికి నీటి  బిందువులే పరమావధి నీలాకాశాన వెలిసే రంగుల హరివిల్లె సన్నిధి చిరు చిరు పలుకుల మనసులోని భావం పలుకులై మాటగా వేలిసేను కదా మౌనమే అలంకారమై 

జీవకోటి లో ఒదిగి వుండే మానవత్వం ఒక్కటే

కన్నుల్లో దాగిన భావాలు కలలుగా మెదిలేను నాసికలో ఊపిరులూదే గాలి గమనం ఆయువై నిలుచును నాలుక వల్లించే పలుకులే మనసు అంతరంగం తెలిపేను కంటి భాషకు కన్నీళ్ళు ఆనందభాస్పాలు నాసికానికి ఘ్రాణ శక్తి మరో వరం రుచినేరిగిన జిహ్వకు పలుకులు తేనెలొలుకు ఆకాశం ఒక్కటే భూమి ఒక్కటే మనిషికి ఉనికినిచ్చె ప్రాణం ఒక్కటే జీవకోటి లో ఒదిగి వుండే మానవత్వం ఒక్కటే