జీవితానికి ఇదే నిండైన నిర్వచన
కదిలే కన్నుల్లో కలలే లోకమై ఇమిడినట్టు
ప్రతి గుండెలయలో ప్రాణమే ఊయలూగినట్టు
రెప్పల అలికిడిలో అశ్రువు బిందువు
బాధకి ఆనందానికి నిఖార్సైన నెలవు
ఆనందరాగమే రవళించే వాసంతం
కోయిల రాగాలే ఆలపించెను కాలం
ఊపిరే ఆయువుకు ఆలంబన
జీవితానికి ఇదే నిండైన నిర్వచన