జీవకోటి లో ఒదిగి వుండే మానవత్వం ఒక్కటే

కన్నుల్లో దాగిన భావాలు కలలుగా మెదిలేను
నాసికలో ఊపిరులూదే గాలి గమనం ఆయువై నిలుచును
నాలుక వల్లించే పలుకులే మనసు అంతరంగం తెలిపేను

కంటి భాషకు కన్నీళ్ళు ఆనందభాస్పాలు
నాసికానికి ఘ్రాణ శక్తి మరో వరం
రుచినేరిగిన జిహ్వకు పలుకులు తేనెలొలుకు

ఆకాశం ఒక్కటే భూమి ఒక్కటే
మనిషికి ఉనికినిచ్చె ప్రాణం ఒక్కటే
జీవకోటి లో ఒదిగి వుండే మానవత్వం ఒక్కటే

Popular Posts