ఏమైయ్య దివాకరం నే విన్నది నిజమేనటోయి.. వంకర్లు బోతు అడిగాడు పరమేషం
నువ్ విన్నది ఏమిటో నాకు తెలియదు కదా.. తెలియకుండానే నిజమా కాదా నేనెలా చెప్పేది.. నీరుగార్చాడు దివాకరం
అదే.. నువ్ విన్నదే.. ఏమో నాకేమాత్రం వినబడలేదు..
ఇలా ఎవరికి వారే సముదాయించగా..
అటుగా వెళ్తున్న సోడ సాంబడు భార్య జాజుల చిన్ని మూతిని తొమిది తీర్ల తిప్పి చల్ల ముంత దెచ్చి అరుగుపై పెట్టి కవ్వం ను కడుగుతోంది..
నువ్ ఎన్ని ముంతల చల్ల చిలికినా లాభం లేదు.. ఈ పొద్దు గోలి సోడాలే అమ్ముడు పోతాయి అంటు కనుబోమ్మలు ఎగిరేసి సోడ బుడ్డిను నొక్కాడు.
అదెం విడ్డురమో ఆ శబ్దం విని పక్కనే విందు భోజనాలంటు బయిట బోర్డ్ పెట్టి లోపల మాత్రం మాగాయ తొక్కు, ఆవ పిండి నూరి వరంగల్ కారం దట్టించి ఊరబెట్టిన ఆవకాయ చిట్టి ముత్యాల బీయం తో కలిపి తింటు హాహా అంటు అరుస్తు గోలి సోడాలందుకున్నారు..
ఇక గుటకేశారో లేదో మంట తంట జంటగా వంటను పంటకు తెచ్చింది కాకపోతే ఘాటు పోలేదు.. వరంగల్ మిర్చి కారమా మజాకా..
ఇలా కాదని ఇటో పాలి వచ్చి ముంత మజ్జిక పుచ్చుకోండంటు డీజేల దాక పోలేక రికార్డ్ మైక్ తోనే సరిపెట్టుకుంటు జాజుల చిన్ని నాజుకుగా నవ్వింది.
ఇహ మొదలు ఐదు రూపాయల ముంత మజ్జిగ ముందు పది రూపాల నిమ్మ గోలి సోడ గ్యాస్ ఆవిరై పోయి.. ఘాటు అంత సమసిపోయింది.