Skip to main content

నికార్సయిన నిజాలు

 మాట అనటం చాలా తేలిక.. 
కాని మాట విని ఓర్చోగలగటం అంత సులువు కాదు
ఎవరి స్థితిగతులను ఎవరూ నియంత్రించలేరు
కాలమే సరైనా సమాధానమౌ గాక..
:
మనం మంచికి యత్నించి ముళ్ళును
దారి నుండి తొలగిస్తే
అదే ముళ్ళు మన కాలికే గుచ్చుకునట్టు
నేను మంచి చేయాలని చూసినా
అది చెడుగా మారి నన్నే చుట్టుకునట్టు
:
ఎంతో లేదు నీ జీవితం
నువ్వు ఊపిరి బిగపట్టి విడిచే నిడివే
ఆ ఊపిరే తట్టుకుంటే
అదే నీ చివరి మజిలి
:
అందరి మంచి కోరే వారికి చివరిన కొరివే మిగిలినట్టు
విశ్వాసం లేని చోట కుక్క కూడా నక్కలా మారినట్టు
:
ఆశలు పేక మేడలే 
ఆశయాలు మూల స్తంభాలు
జీవితం క్షణకాలమే
కీర్తి ప్రతిష్టలు మాత్రమే తాయిలాలు
:
నీ గాయానికి లేపనం లేనపుడు
కాలానికే వదిలేయి గాటుగా మిగిలి ఉంటుంది
కాదని గెలికితే
గాయమే పెను ప్రమాదమై అసలుకే ఏసరై నీరుగారిపోతుంది
:
కాలానికి మించి మిక్కిలిదంటు ఏమి లేదు
రాజు లేడు రాణి లేదు బంటు లేడు
:
కన్నులు లోకాన్ని అవలీలగా చూస్తాయి
కాని
సంద్రాన్ని లోలోపలే అలవోకగా దాచుకుంటాయి
:
బంధం కాని నేను నీకు
అవసరమై మిగిలిపోయాను
అద్దం లాంటి మనసులో
నీ ప్రతిబింబాన్ని దాచుకున్నాను
ముక్కలై పోయింది దర్పణం
కాని ప్రతి ముక్కలో నీ రూపమై వెలుగుతున్నాను

Popular posts from this blog

Telugu Year Names

(1867,1927,1987) Prabhava ప్రభవ (1868,1928,1988) Vibhava విభవ (1869,1929,1989) Sukla శుక్ల (1870,1930,1990) Pramodyuta ప్రమోద్యూత (1871,1931,1991) Prajothpatti ప్రజోత్పత్తి (1872,1932,1992) Aangeerasa ఆంగీరస (1873,1933,1993) Sreemukha శ్రీముఖ (1874,1934,1994) Bhāva భావ (1875,1935,1995) Yuva యువ (1876,1936,1996) Dhāta ధాత (1877,1937,1997) Īswara ఈశ్వర (1878,1938,1998) Bahudhānya బహుధాన్య (1879,1939,1999) Pramādhi ప్రమాధి (1880,1940,2000) Vikrama విక్రమ (1881,1941,2001) Vrisha వృష (1882,1942,2002) Chitrabhānu చిత్రభాను (1883,1943,2003) Svabhānu స్వభాను (1884,1944,2004) Tārana తారణ (1885,1945,2005) Pārthiva పార్థివ (1886,1946,2006) Vyaya వ్యయ (1887,1947,2007) Sarvajita సర్వజిత (1888,1948,2008) Sarvadhāri సర్వధారి (1889,1949,2009) Virodhi విరోధి (1890,1950,2010) Vikruti వికృతి (1891,1951,2011) Khara ఖర (1892,1952,2012) Nandana నందన (1893,1953,2013) Vijaya విజయ (1894,1954,2014) Jaya జయ (1895,1955,2015) Manmadha మన్మధ (1896,1956,2016) Durmukhi దుర్ముఖి (1897,19...

కాలం

 కాలం కంటే గొప్పది లేదు. భయం కూడా కొట్టుకు పోతుంది, బాధ కూడా మటుమాయం అవుతుంది. కాని వాటి గురించి తెలిసి కూడా లేనిపోని జంఝాటాలకు తావు ఇస్తుంటాము. భయాన్ని ఉసిగొల్పి ఊరకనే భీతి చెందుతూ మానసికంగా సంతులనం కోల్పోయిన వారమౌతాము.

అంతే ఏమో

 డబ్బుంటేనే నన్ను గౌరవిస్తావా, వ్యాపకముంటేనే నా మాట వింటావా అంటే నన్ను మనిషిగా ఏరోజు భావించలేదా, అంటే నా ఆస్తి తప్ప నా ఉనికితో సంబంధం లేదా.. అనగా అవసరాలకు తప్ప బంధానికి నువ్విచ్చే విలువ శూన్యం.. అలా ఐతే నేను ఉంటున్నది కుటుంబం కాదు అరణ్యం