Posts

Showing posts from March, 2020

కోవిడ్ కరోనాకాష్టం

అమ్మా.. భారతావని.. ఎపుడు సస్య శ్యామలమై విరాజిల్లే నీకు.. ఈ కరోనాకాష్టం పచ్చదనంలో అరుణవర్ణం కలిపింది తల్లి.. తల్లడిల్లే రెమ్మలం.. దిక్కుతోచక హాహాకారాలు సైతం చేయటానికి విలు పడక మ్యాస్క్ తో నోటిని.. బరువెక్కిన కంటిలో చెమ్మను సైతం.. బయట అడుగుపడనీక.. లోలోపలే గాలిలో ఆరబెట్టుకుంటున్నామమ్మ.. నిప్పు ఒకసారే రాజుకుని కారడవినంతటిని బుగ్గిపాలు చేస్తుంది.. ఈ కోవిడ్ కలకలం కలహాలకు అతీతమై.. క్వారెన్‌టైన్ తో ఛిన్నాభిన్నమై.. ఐసోలేషన్ మూలాన డిప్రెస్డ్ అయ్యి మరి కొందరు.. ఇహ.. ఈ కార్చిచ్చు ఎవరిని దహిస్తుందో.. ఎవరిని సహిస్తుందో.. కాలమే నిర్ణయించాలి.

March 22, 2020~March 24, 2020 CoViD 2019

ఇసుక రేణువంత కూడా లేని కోవిడ్-౧౯ వైరస్ జన సంద్రాన్ని అతలాకుతలం చేసేంతగా ఇంటిలోనే ఉండాలని ప్రతి ఒక్కరిపై ఫోకస్ హుబేయి వుహాన్ నుండి ఇంపోర్ట్ అయ్యిందిగా ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అవుతోంది డిస్కస్ మాస్కులతో ఓవర్ కోట్ లతో ఐసోలేషన్ పకడ్బందిగా నాలుగు ఖాండాలలో వ్యాపించి మార్చేను ప్రపంచ స్టేటస్ వ్యవహరించాలి లాక్ డౌన్ లో మనమంత దురుసుగా అపుడే కొంత లో కొంత మేరకు చల్లబడుతుందేమో రక్కస్

కరోనా

నిఖార్సైన నిండు జీవితాన చాపకింద నీరులా ప్రవేశించావు పుట్టినెక్కి నదిలో విహరిస్తున్న వేళ అకస్మాత్తుగా పెను తూఫానై తీరం కానరాని సంద్రపు నడిబొడ్డులో నిలబెట్టినావు అరకొరగా అడుగులేద్దామన్న ఏవైపున ఎంత లోతుందో ఎవరికెరుక మనిషి ఆగడాలను భరించినట్టే కానవస్తోంది ఇన్నేళ్ళు భూమి కలివిడిగా ఉంటే అనవసరంగా గొడవకు దిగేవారు వైద్య సిబ్బందికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించే కొద్దిమంది ఒకపుడు జన సంద్రాన్ని చూసి భయభ్రాంతులతో పగవాడే పరారయ్యే వాడు కాని రాను రాను పరిస్థితి దారుణమాయే.. మండె ఎండలకు మంచుకొండలు కరిగి ఉపరితల ఆవరణ కనుమరుగయ్యే క్షణం.. నిన్నటి దాక మనిషి దాస్టికాన్ని ఓర్చుకున్న పుడమి నేడు బహుశ అదే గుణాన్ని మానవ జాతికి పరిచయం చేస్తుందో ఏమో

010820091401

కొందరి మనసులో అనుమానం నాటుకుందంటే ఎన్నెన్ని మంచి చేసినా గాని చెడునే ఆపాదించి చులకన చేస్తుంటారు, హేళన వారి ఇంటిపేరౌతుంది, కోపం తన మదిలో ఎల్లకాలం నిలిచి ఉంటుంది.. పరిస్థితులు పర్యావసనాలు స్థితిగతులు ఏదేమైనప్పటికి..! 011409200801