కోవిడ్ కరోనాకాష్టం

అమ్మా.. భారతావని.. ఎపుడు సస్య శ్యామలమై విరాజిల్లే నీకు.. ఈ కరోనాకాష్టం పచ్చదనంలో అరుణవర్ణం కలిపింది తల్లి.. తల్లడిల్లే రెమ్మలం.. దిక్కుతోచక హాహాకారాలు సైతం చేయటానికి విలు పడక మ్యాస్క్ తో నోటిని.. బరువెక్కిన కంటిలో చెమ్మను సైతం.. బయట అడుగుపడనీక.. లోలోపలే గాలిలో ఆరబెట్టుకుంటున్నామమ్మ.. నిప్పు ఒకసారే రాజుకుని కారడవినంతటిని బుగ్గిపాలు చేస్తుంది.. ఈ కోవిడ్ కలకలం కలహాలకు అతీతమై.. క్వారెన్‌టైన్ తో ఛిన్నాభిన్నమై.. ఐసోలేషన్ మూలాన డిప్రెస్డ్ అయ్యి మరి కొందరు.. ఇహ.. ఈ కార్చిచ్చు ఎవరిని దహిస్తుందో.. ఎవరిని సహిస్తుందో.. కాలమే నిర్ణయించాలి.

Popular Posts