Skip to main content

కరోనా

నిఖార్సైన నిండు జీవితాన
చాపకింద నీరులా ప్రవేశించావు
పుట్టినెక్కి నదిలో విహరిస్తున్న వేళ
అకస్మాత్తుగా పెను తూఫానై
తీరం కానరాని సంద్రపు నడిబొడ్డులో నిలబెట్టినావు
అరకొరగా అడుగులేద్దామన్న ఏవైపున ఎంత లోతుందో ఎవరికెరుక

మనిషి ఆగడాలను భరించినట్టే కానవస్తోంది ఇన్నేళ్ళు భూమి
కలివిడిగా ఉంటే అనవసరంగా గొడవకు దిగేవారు
వైద్య సిబ్బందికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించే కొద్దిమంది
ఒకపుడు జన సంద్రాన్ని చూసి భయభ్రాంతులతో పగవాడే పరారయ్యే వాడు
కాని రాను రాను పరిస్థితి దారుణమాయే..
మండె ఎండలకు మంచుకొండలు కరిగి ఉపరితల ఆవరణ కనుమరుగయ్యే క్షణం..
నిన్నటి దాక మనిషి దాస్టికాన్ని ఓర్చుకున్న పుడమి నేడు బహుశ అదే గుణాన్ని మానవ జాతికి పరిచయం చేస్తుందో ఏమో