Posts

Showing posts with the label Poetry

విధీ

 విధి ఎంతో విచిత్రం తెలిసి తెలియని వింత నాటకం క్షణ కాలం ఉబలాటం మరు నిమిషం నిర్వేదం అల్లుకుపోయే బంధాలు కొన్ని చెంతకు చేరిన చేరువ కానివి కొన్ని రాగద్వేశాల భావోద్వేగాల జీవితం చూసి చూడని ఘటనల సమాహారం ఎనలేని మమకారాల తేనెపట్టు కొన్ని బంధాలు మనిషికి మనిషికి నడుమ మరికొన్ని బంధాలు మనసుకి మనసుకి నడుమ కొందరి జివితాలు తెరిచిన పుస్తకాలు మరి కొందరివి మండుతున్న ఆశల అగాధాలు కొందరు జీవితాన్ని వెక్కిరిస్తారు మరికొందరు అదే జీవితాన్ని ఔపోసన పడ్తారు కాలగమనంలో అందరి పయనం (అటే) అయినా ఏలా ఇలా దాపరికాలు.. మమతానురాగాల మాటు రేగే వింత ప్రశ్నలు కొన్ని బంధాల నిడివి కొద్ది కాలమైనా వాటి విలువ జీవితకాలం గుర్తుండిపోతాయి ప్రకృతిలో శిలాక్షరాలై మిగిలిపోతాయి మరికొన్ని ఇసుక తిన్నెలుగా మారి సంద్రపు అలల నురగలై ఉవ్వెత్తున ఎగసి మరలి వెళ్ళిపోతాయి జీవితమనే పుస్తకమే మనది, అందులో కోపతాపాలు బంధాలు బాంధవ్యాలు ప్రేమలు ఆప్యాయతనురాగాభిమానాలు కష్టసుఖాలు కలబోసిన ఓ కమ్మని కావ్యమాలిక

సంసారి.. ప్రతిసారి

గంపెడాశతో అర్దం చేసుకునే సతి వచ్చిందనుకున్నాడు సంసారి గయ్యాళి భార్యతో జీవితమంత ఎలా గడపాలనుకున్నాడు ప్రతిసారి నవ్వు ముఖముతో ఎదురోచ్చే భామిని రాకకై వేచి చూశాడు సంసారి బాధనేదే మరవనీకుండా అరిచి గీ పెడితే కిమ్మనక గమ్మునుండిపోయాడు ప్రతిసారి ఏడడుగులు ఏడేడు జన్మల బంధాన్ని బలపరుచుతుందని సంసారి అమాంతం లావెక్కిన పాదాల వైపు అయోమయంగా చూసేను ప్రతిసారి తుదకు భార్యభర్తల అన్యోన్యతకే ప్రాధాన్యమిచ్చాడు సంసారి నవరసాల భావోద్వేగాల కలగాపులగమే దాంపత్యం ప్రతిసారి

ఆలోచిస్తే..

మానసిక పరిపక్వత కూడుకున్న క్షణం తప్పొప్పులు నిజానిజాలు తెలుసుకునే క్షణం నిన్నటికి నేటికి గల వ్యత్యస గోచరించే క్షణం మన్ననలు అవమానాలు మెలిపెడుతు కవ్వించే క్షణం కనురెప్పల కదలికల్లో లోకం ఒక్కటే కదలాడదు లోపలి ఆవేదన సాగరపు అలల తాకిడి ఒక్కోసారి భావాల ఆలోచనలు ఒక్కటే మనసుకి తరాస పడదు నిట్టూర్పు వదిలెళ్ళిన క్షణిక గాయాలు ఒక్కోసారి ఓపిక నశించనంత వరకు ప్రతి కెరటం అత్యద్భుతం చలనం ఆగనంతవరకు ప్రతి పయనం సంచలనం నిన్నటి రేపు కి రేపటి నిన్న కి లేదేమి తేడ స్త్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఔతుంది. అమ్మ గా అవతరించి మాతృమూర్తి గా నిలుస్తుంది. చెల్లిగా అవతరించి అనురాగాన్ని పంచి పెడుతుంది. భార్యగా అవతరించి కష్ట సుఖాల్లో సమపాళ్ళు పంచుకుంటుంది. స్నేహితురాలిగా అవతరించి మంచికై ప్రాకులాడుతుంది. ఏ స్థానం తాను తీసుకున్నా ఆ స్థానం స్థాయి అణగారనీయదు. స్త్రీ, పురుషుల నడుమ గల బాంధవ్యం నవసమాజ, సమసమాజ నిర్మాణానికి నాంది పలకాలి. కట్టుబాట్లలో ఆచార వ్యవహారాలలో ధైర్యాన్ని ఓర్పుని సడలనీయక సాగాలి. ~శ్రీధర్ భూక్య

Happy Anniversary

Feb 12 అన్వేషించా నిన్ను తదేకంగా..! Feb 18 అభిమానం నిరాడంబరత తత్సమానమే..!! Mar 18 అనురాగం నిజాయితి తన్మయత్వమే..!!! Apr 19 అణువణువు నిండేవు తడుముతు..!!!! #అనిత

శ్రీత ధరణి

ఏమని వర్ణింతును ఈ ముదావహ ఘట్టాన్ని పలుకులన్ని పదాలయ్యి కవితగా ఇమిడే క్షణం అత్యద్భుతమే కదా ఇక ప్రతి ఘడియ నీతో ఓ రతనాల బొమ్మ నిను చేతబట్టి నా కాబోయే భార్య కు అంకితమిస్తు

ఉయ్యాల

కాలగమనం కాంతులీనే వేళా కన్నుల కొలనులో కన్నీటి మేఘాల ఊయల కటిక చీకటిలో చిరు ఆశల కాంతీ పుంజమీ ఊయల రేయిని తలపించే కల్మషాల నీడను అంటని ధవళమీ ఊయల

ಕಾಲಂ.. ಜ್ಞಾಪಕಂ

ರೆಪ್ಪ ಪಾಟೇ ಕದಿಲೇ ಕಾಲಂ ಕ್ಷಣಂ ದಾಟಿ ಕ್ಷಣಂ ಮರುಕ್ಷಣಂ ಊಪಿರಿ ಲಯ ಗತಿ ಗಮನಂ ಅನುಕ್ಷಣಂ ಅನುನಿತ್ಯಂ ಕೋಲಾಹಲಂ ಮನದಿ ಕಾನಿ ನಿನ್ನಲೋ ಮನದಿಗಾ ಮಿಗಿಲೇ ಕ್ಷಣಾಲೇ ಜ್ಞಾಪಕಾಲು ಕಾನರಾನಿ ರೇಪಟಿ ಕೌಸಂ ಅಂತು ಚಿಕ್ಕನಿ ಆರಾಟಂ ಉಬಲಾಟಂ ಕ್ಷಣಮೇ ಆನಂದಂ ಮರೋ ಕ್ಷಣಂ ನಿರ್ವೇದಂ ಕ್ಷಣಮೇ ಉಚ್ವಾಸ ಮರೋ ಕ್ಷಣಮೇ ನಿಃಶ್ವಾಸ ಇದೇ ಜೀವಿತಂ ಪ್ರಕೃತಿತೋ ಸಮಾನಮೈನ ನಂದನವನಂ ಇದೇ ಜೀವಿತಂ ನಿನ್ನಟಿ ಬಾಧನು ರೂಪೂ ಮಾಪೇ ಸಾಧನಂ

కాలమనే సంద్రం పై జ్ఞాపకాల నావలో

కాలం ఎంత విచిత్రమో ప్రతి క్షణం మనతోనే ఉంటూనే గడిచిన క్షణాన్ని జ్ఞాపకంగా మార్చేస్తుంది కాలం ఎంత విచిత్రమో ప్రతి క్షణం ఉద్వేగంగా ఉంటూనే నిన్నటి దుఃఖాన్ని సైతం మాయం చేస్తుంది

వెతుకులాట

కదిలే లోకం సమస్తం కన్నులలో ఇమిడినా ఆ కదిలే లోకంలో నిను నే వెతుకుతూనే ఉంటా అడియాశల చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నా ఆశల దీపం వెలుగులో నిను నే వెతుకుతూనే ఉంటా చెమర్చిన కన్నులతో కనురెప్పలు భారమౌతున్నా ఆ కంటితడిలో నిను నే వెతుకుతూనే ఉంటా కాలమనే తిరగలిలో గంటలు నిమిషాలౌతున్నా ఆ చివరి ఘడియనైనా నిను నే వెతుకుతూనే ఉంటా

National Girl Child Day

She takes the Centre Stage in Poetry She takes the Centre Stage in Society She Handles the Pin Wheel as a Child She Rocks the Cradle as a Mother She Breaks Down Yet Stays Strong She Corrects Each and Every Wrong She Needs Respect and Dignity Let us Join Hands and Protect the Caretaker Happy National Girl Child Day 24 Jan 2017 17:57 यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता ~శ్రీధర్ భూక్య

ఆటోబయొగ్రఫి

Image
మూడు దశల జీవిత సారం కాయితం పై సిరతో కంటే మదిలో జ్ఞాపకమే గొప్పదని చెప్పే నా ఈ కవితాక్షరి ఏదో నాలుగు ముక్కలు జీవితం గురించి వ్రాయాలని తపన.. చిన్నప్పుడు.. వ్రాతలు రాకా.. మాటలన్ని లోలోపలే దాగి అమ్మ వొడిలో సేదతీరి ఆ వ్రాయటాన్ని బాల్యానికీ అందుకోమని చెప్పాను..! అప్పుడప్పుడే పసితనపు ఛాయలను వీడి బాల్యపు దశలో తొలి అడుగులు.. మాటలు వ్రాతలు ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నావు.. ఇప్పుడే జీవితం గూర్చి ఏమి తెలుసుకోగలవంటే.. యవ్వనానికీ అందించి బాల్యాన్ని ఆస్వాదించాను..!! యవ్వనం రానే వచ్చింది.. పూలతోటలో వికసించే విరుల పరిమళభరితంగా.. (ఇప్పుడు నాది ఈ దశ) వ్రాయాలని ఉన్నా.. ఇప్పుడిప్పుడే ఘడియలని నెమురు వేసుకుంటున్నా.. ఇవన్ని జ్ఞాపికలుగా తీర్చిదిద్ది ఒక్కోక్కటిగా తరువాత వ్రాద్దామని అనుకుని రోజువారి పనిలో నిమగ్నమై ఆ ఆలోచనని పక్కన పెట్టాను..!!! జీవితాన్ని మించిన మహాకావ్యం మరొకటిలేదని అగుపించి.. జ్ఞాపకాలన్ని జ్ఞాపికలుగా మరేలోగా మరో ముప్పై-నలభై ఏళ్ళ పైచిలుకు వృద్ధాప్యం వచ్చేస్తుందని.. అటువంటప్పుడు వ్రాసే బదులు వాటన్నిటిని ఏర్చి కూర్చి నలుగురి మదిలో చిరకాలం కాకున్న చిరుకాలమైనా ఓ తీపి జ్ఞాపకమై మిగిలుండాలని ఆశ...

అక్షరాలు భావాలు జీవితం

కొన్ని భావాలు అక్షర సత్యాలై భాసిల్లుతాయి  కొన్ని భావాలు అక్షర సరాలై దూసుకుపోతాయి  కొన్ని భావాలు కరగని ప్రశ్నల సమాహారాలు  కొన్ని భావాలు తెలిపేను జీవితపు గమకాలు చావనేది తథ్యమని తెలిసినా బ్రతుకుపై ఆశ ఉన్నట్టే కరిగిన కాలానికి కానరాని కాలానికి నడుమ వర్తమానమున్నట్టే స్వార్థాన్ని వీడనాడి మానవత్వాన్ని పుణికిపుచ్చుకుంటే సమాధానాలన్ని వాటికవే మనోదర్పణానా ప్రస్ఫూటమైనట్టే

జీవితం మానవత్వం

సంద్రపు తలంపై ఎగిసే అల కెరటాలు మనసు లోతులో మెదిలే ఆలోచనలు గాలి ధూళి ఆవిరి కలగల్పితే కారు మేఘాలు మాటతీరు ప్రవర్తన సంస్కారం మేళవిస్తే పదాలు చిరుగాలి పువ్వులను తాకితే వీచే పరిమళం మంచితనం అలవర్చుకుంటే అదే మానవత్వం

ఊహల ఒరవడి

కనుల కలలు కనువిందు కాగా మనసే మురిసే ముదావహంగా నీలాల నింగిన నవోదయపు నాంది యవనిక యందు యుగమే యిమిడే కలమున కవితాక్షరి కనువిందు కాగా రంగులరాట్నమై రేయింబవళ్ళు రంగరించే : మనోనిశ్చలాలోచనలన్వయక్రమమే కమనీయకరం : లోకమే చిన్నబోయిందా ఏమో.. అల్లకల్లోలమై అతలాకుతలమై.. అక్షరాలన్ని ఇబ్బడిముబ్బడిగా.. భావాలన్ని స్థానభ్రంశమైయుండగా.. మనసనే ఇంకుడుగుంతలో ముంచి.. ఒక్కొక్కటిగా దెచ్చి కవితగా పేర్చి..! : ఊహలన్ని మనసనే అంబరానా ఊరేగే మేఘాలు..! ఆ మేఘాల మాటు చినుకు ధారలే కాబోలు అక్షరాలు..!! ఆలోచనలన్ని మది దోసిట నిలిచే అక్షరాల సవ్వడి..! ఆలోచనల సరళితో ప్రవహించే కవితల ఒరవడి..!!

గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణ

Image
భూమి చుట్టు జాబిల్లి తిరగాడినట్టు మహిమాన్వితము చుట్టు మానవత్వము తిరగాడినట్టు ఓ వరాహ లక్ష్మీ నారసింహా.. ఈ గురు పౌర్ణమి నాట నీ గిరి ప్రదక్షిణ.. అడుగడుగున దండాలు చందన లేపిత స్వామికి లోకమెల్ల యేలే చల్లని జాబిలి వెన్నెలలా ప్రసరినచేవు నీ దివ్యాశిస్సులు సింహాచల క్షేత్ర వరాహ లక్ష్మి సమేత నరసింహా పాహి మామ్ పాహి తలచిననంత ఆపదలు బాపే చూడచక్కని స్వామి

ज़िन्दगी बस रह जायेगी एक सुनी अनसुनी कहानी

उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो वक्त किस समय पर कैसी मोड ले यह किसको पता साँसे कब तक चले इसका किसे क्या अन्दाज़ा उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो कभी फ़ूलों की महक वाली प्रकृति भी न जाने तूफ़ान का ज़ोखिम उठा लेती है कभी हँसता चेहरा पर उदासी और मायूसी आँसू से दस्तख़त कर जाती है उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो मेहमान हैं धरती पर चन्द दिनों के न फ़िर लौट आयेगी ये अलबेला जिन्द़गानी सिर्फ़ होंठों पर शब्द व यादें दिमाग में रह कर दोहरायेगी अपनी अनोख़ी कहानी उन हाथों को याद रखना जो ज़िन्दगी के हर कदम पर अपनी साया बिछायी हो उन बातों का कदर करना जो पराया ही सही अपनापन का एहसास दिलायी हो

జననం మరణం వ్యత్యాసం

బ్రతికి ఉన్నపుడు నలుగురు నీ గురించి చెడు చెప్పుకుంటారని దిగులు ఆఖరి ఘడియలో గుమ్మిగూడిన జనాన్ని ఒక్కసారి లెక్క పెట్టు నిన్న నీతో మౌనముదాల్చినా నేడు కంటిచెమ్మతో పలకరింపులు అందుకే చచ్చేదాక అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు ఎవరో ఏదో అన్నారని ఆ మాటని మనసు లోతుల్లో ఉంచి ప్రతి క్షణం నీలోనే నీవు కుమిలిపోయావు నిన్నటి వరకు ఈ విషయం నీకూ తెలుసు మానవ జన్మ రాదు మరలి అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు మనసును గాయపరిచారని నిందించేవు నిన్న నీవాళ్ళని చూడు నీ చుట్టు చేరిన వారిలో పరాయివాళ్ళు ఎవరు లేరు మిగిలేవు ఏదో రోజు కాటిలో కట్టెలా కాలి బూడిదయ్యీ అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు ఆప్యాయంగా రోజు పలకరిస్తుంటే ఉండకు విని విననట్టు రేపటిరోజునా ఆ పలకరింపులు శాశ్వతంగా మూగబోవచ్చు గుండెలకు హత్తుకుని ఏడ్చినా శ్వాసను విడిచి వెళ్ళే రోజు రావచ్చు అందుకే చచ్చేదాకా అయినా చావు పట్ల ఆలోచన కట్టి పెట్టు మనసుకి గాయమయితే శాంతియుతంగా పరిష్కరించుకొవచ్చు దేహానికి గాయమయితే సపర్యలతో ఉపశమనం పొందవచ్చు జన్మించే ప్రతి జీవి జీర్ణవస్థలో మరణ శయ్య కాదు కనికట్టు అందుకే చచ్చేదాకా అయ...

సంతోషం దుఃఖం జీవిత సత్యం

మనసుకు బాధ కలిగితే కనులకు చెబుతుంది కనులు ఆ బాధను కన్నీరుగా మలుచుతుంది  మనసుకు హాయి కలిగితే కనులకు చెబుతుంది కనులు ఆ భాషను కన్నీరుగా మలుచుతుంది  వింత ఏమిటంటే దుఃఖమైన ఆనందమైనా రెండు వేరువేరైనా మనసుకే తెలుస్తాయి కనులే పలుకుతాయి  బాధలో చెమ్మగిల్లిన కనులను తుడిచి మనసులో నిండిన వేదనను అర్దం చేసుకోవాలి సంతోషంలో చెమర్చిన కనులను చిరునవ్వుతో పలకరించి మనసులో నిండిన ఆనందమనే ఊయలలో సేదతీరాలి 

అవనిపై మమకారపు మచ్చుతునక: అమ్మ

కనుపాప పిల్లలైతే కనురెప్ప అమ్మ కనుల ముందు కదలాడే దైవం అమ్మ అవనిపై నడియాడే బ్రహ్మ స్వరూపిణి అమ్మ ప్రాణాలను సైతం పణంగా పెట్టి  ప్రాణాలు పోసేది అమ్మ అణువణువును పులకింపచేసే పలకరింపు అమ్మ కొలువగ ఒక రోజైనా చాలునా.. పంచప్రాణాలకు ప్రతీక అమ్మ ప్రతి మాతృమూర్తికి అంకితం.. మే ఎనిమిదవ తేది మదర్స్ డే సందర్భముగా

तेलंगाणा में बारिश जारी

मण्डराते बादल फ़िर से नयी धुन सुनायी काले काजल की लकीर बन आकाश में घूम आयी टिप टिप की बरसात नयी उमंग ले आयी सतरंगी के वर्णों से आसमान को सजायी मौसम सुहाना सा बचपन की यादें साथ ले आयी गडगडाहट गडगडाहट गडगडाहट ग्रीष्म में ही सही सावन ले आयी पल्लवों पर पानी के मोती पिरोयी हवा की लहर में मन उछलायी श्याम के पल में मेघा उभर आयी बिजली की तलवार लेकर आसमान से धरती पर उतर आयी गडगडाहट गडगडाहट गडगडाहट