ఆటోబయొగ్రఫి

మూడు దశల జీవిత సారం కాయితం పై సిరతో కంటే మదిలో జ్ఞాపకమే గొప్పదని చెప్పే నా ఈ కవితాక్షరి

ఏదో నాలుగు ముక్కలు జీవితం గురించి వ్రాయాలని తపన..
చిన్నప్పుడు.. వ్రాతలు రాకా.. మాటలన్ని లోలోపలే దాగి అమ్మ వొడిలో సేదతీరి ఆ వ్రాయటాన్ని బాల్యానికీ అందుకోమని చెప్పాను..!

అప్పుడప్పుడే పసితనపు ఛాయలను వీడి బాల్యపు దశలో తొలి అడుగులు.. మాటలు వ్రాతలు ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నావు.. ఇప్పుడే జీవితం గూర్చి ఏమి తెలుసుకోగలవంటే.. యవ్వనానికీ అందించి బాల్యాన్ని ఆస్వాదించాను..!!

యవ్వనం రానే వచ్చింది.. పూలతోటలో వికసించే విరుల పరిమళభరితంగా.. (ఇప్పుడు నాది ఈ దశ)
వ్రాయాలని ఉన్నా.. ఇప్పుడిప్పుడే ఘడియలని నెమురు వేసుకుంటున్నా.. ఇవన్ని జ్ఞాపికలుగా తీర్చిదిద్ది ఒక్కోక్కటిగా తరువాత వ్రాద్దామని అనుకుని రోజువారి పనిలో నిమగ్నమై ఆ ఆలోచనని పక్కన పెట్టాను..!!!

జీవితాన్ని మించిన మహాకావ్యం మరొకటిలేదని అగుపించి.. జ్ఞాపకాలన్ని జ్ఞాపికలుగా మరేలోగా మరో ముప్పై-నలభై ఏళ్ళ పైచిలుకు వృద్ధాప్యం వచ్చేస్తుందని.. అటువంటప్పుడు వ్రాసే బదులు వాటన్నిటిని ఏర్చి కూర్చి నలుగురి మదిలో చిరకాలం కాకున్న చిరుకాలమైనా ఓ తీపి జ్ఞాపకమై మిగిలుండాలని ఆశ!



Popular Posts