ఊహల ఒరవడి

కనుల కలలు కనువిందు కాగా
మనసే మురిసే ముదావహంగా
నీలాల నింగిన నవోదయపు నాంది
యవనిక యందు యుగమే యిమిడే
కలమున కవితాక్షరి కనువిందు కాగా
రంగులరాట్నమై రేయింబవళ్ళు రంగరించే
:
మనోనిశ్చలాలోచనలన్వయక్రమమే కమనీయకరం
:
లోకమే చిన్నబోయిందా ఏమో..
అల్లకల్లోలమై అతలాకుతలమై..
అక్షరాలన్ని ఇబ్బడిముబ్బడిగా..
భావాలన్ని స్థానభ్రంశమైయుండగా..
మనసనే ఇంకుడుగుంతలో ముంచి..
ఒక్కొక్కటిగా దెచ్చి కవితగా పేర్చి..!
:
ఊహలన్ని మనసనే అంబరానా ఊరేగే మేఘాలు..!
ఆ మేఘాల మాటు చినుకు ధారలే కాబోలు అక్షరాలు..!!
ఆలోచనలన్ని మది దోసిట నిలిచే అక్షరాల సవ్వడి..!
ఆలోచనల సరళితో ప్రవహించే కవితల ఒరవడి..!!

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల