అక్షరాలు భావాలు జీవితం
కొన్ని భావాలు అక్షర సత్యాలై భాసిల్లుతాయి
కొన్ని భావాలు అక్షర సరాలై దూసుకుపోతాయి
కొన్ని భావాలు కరగని ప్రశ్నల సమాహారాలు
కొన్ని భావాలు తెలిపేను జీవితపు గమకాలు
చావనేది తథ్యమని తెలిసినా బ్రతుకుపై ఆశ ఉన్నట్టే
కరిగిన కాలానికి కానరాని కాలానికి నడుమ వర్తమానమున్నట్టే
స్వార్థాన్ని వీడనాడి మానవత్వాన్ని పుణికిపుచ్చుకుంటే
సమాధానాలన్ని వాటికవే మనోదర్పణానా ప్రస్ఫూటమైనట్టే