సంసారి.. ప్రతిసారి

గంపెడాశతో అర్దం చేసుకునే సతి వచ్చిందనుకున్నాడు సంసారి
గయ్యాళి భార్యతో జీవితమంత ఎలా గడపాలనుకున్నాడు ప్రతిసారి

నవ్వు ముఖముతో ఎదురోచ్చే భామిని రాకకై వేచి చూశాడు సంసారి
బాధనేదే మరవనీకుండా అరిచి గీ పెడితే కిమ్మనక గమ్మునుండిపోయాడు ప్రతిసారి

ఏడడుగులు ఏడేడు జన్మల బంధాన్ని బలపరుచుతుందని సంసారి
అమాంతం లావెక్కిన పాదాల వైపు అయోమయంగా చూసేను ప్రతిసారి

తుదకు

భార్యభర్తల అన్యోన్యతకే ప్రాధాన్యమిచ్చాడు సంసారి
నవరసాల భావోద్వేగాల కలగాపులగమే దాంపత్యం ప్రతిసారి

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల