సంతోషం దుఃఖం జీవిత సత్యం
మనసుకు బాధ కలిగితే కనులకు చెబుతుంది
కనులు ఆ బాధను కన్నీరుగా మలుచుతుంది
మనసుకు హాయి కలిగితే కనులకు చెబుతుంది
కనులు ఆ భాషను కన్నీరుగా మలుచుతుంది
వింత ఏమిటంటే
దుఃఖమైన ఆనందమైనా రెండు వేరువేరైనా
మనసుకే తెలుస్తాయి కనులే పలుకుతాయి
బాధలో చెమ్మగిల్లిన కనులను తుడిచి
మనసులో నిండిన వేదనను అర్దం చేసుకోవాలి
సంతోషంలో చెమర్చిన కనులను చిరునవ్వుతో పలకరించి మనసులో నిండిన ఆనందమనే ఊయలలో సేదతీరాలి