ఆలోచిస్తే..

మానసిక పరిపక్వత కూడుకున్న క్షణం
తప్పొప్పులు నిజానిజాలు తెలుసుకునే క్షణం
నిన్నటికి నేటికి గల వ్యత్యస గోచరించే క్షణం
మన్ననలు అవమానాలు మెలిపెడుతు కవ్వించే క్షణం

కనురెప్పల కదలికల్లో లోకం ఒక్కటే కదలాడదు
లోపలి ఆవేదన సాగరపు అలల తాకిడి ఒక్కోసారి
భావాల ఆలోచనలు ఒక్కటే మనసుకి తరాస పడదు
నిట్టూర్పు వదిలెళ్ళిన క్షణిక గాయాలు ఒక్కోసారి

ఓపిక నశించనంత వరకు ప్రతి కెరటం అత్యద్భుతం
చలనం ఆగనంతవరకు ప్రతి పయనం సంచలనం
నిన్నటి రేపు కి రేపటి నిన్న కి లేదేమి తేడ

స్త్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఔతుంది. అమ్మ గా అవతరించి మాతృమూర్తి గా నిలుస్తుంది. చెల్లిగా అవతరించి అనురాగాన్ని పంచి పెడుతుంది. భార్యగా అవతరించి కష్ట సుఖాల్లో సమపాళ్ళు పంచుకుంటుంది. స్నేహితురాలిగా అవతరించి మంచికై ప్రాకులాడుతుంది.
ఏ స్థానం తాను తీసుకున్నా ఆ స్థానం స్థాయి అణగారనీయదు. స్త్రీ, పురుషుల నడుమ గల బాంధవ్యం నవసమాజ, సమసమాజ నిర్మాణానికి నాంది పలకాలి. కట్టుబాట్లలో ఆచార వ్యవహారాలలో ధైర్యాన్ని ఓర్పుని సడలనీయక సాగాలి.

~శ్రీధర్ భూక్య

Popular Posts