వెతుకులాట

కదిలే లోకం సమస్తం కన్నులలో ఇమిడినా
ఆ కదిలే లోకంలో నిను నే వెతుకుతూనే ఉంటా

అడియాశల చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నా
ఆశల దీపం వెలుగులో నిను నే వెతుకుతూనే ఉంటా

చెమర్చిన కన్నులతో కనురెప్పలు భారమౌతున్నా
ఆ కంటితడిలో నిను నే వెతుకుతూనే ఉంటా

కాలమనే తిరగలిలో గంటలు నిమిషాలౌతున్నా
ఆ చివరి ఘడియనైనా నిను నే వెతుకుతూనే ఉంటా

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల