విధీ

 విధి ఎంతో విచిత్రం

తెలిసి తెలియని వింత నాటకం

క్షణ కాలం ఉబలాటం మరు నిమిషం నిర్వేదం

అల్లుకుపోయే బంధాలు కొన్ని చెంతకు చేరిన చేరువ కానివి కొన్ని

రాగద్వేశాల భావోద్వేగాల జీవితం

చూసి చూడని ఘటనల సమాహారం

ఎనలేని మమకారాల తేనెపట్టు


కొన్ని బంధాలు మనిషికి మనిషికి నడుమ

మరికొన్ని బంధాలు మనసుకి మనసుకి నడుమ

కొందరి జివితాలు తెరిచిన పుస్తకాలు

మరి కొందరివి మండుతున్న ఆశల అగాధాలు

కొందరు జీవితాన్ని వెక్కిరిస్తారు మరికొందరు అదే జీవితాన్ని ఔపోసన పడ్తారు


కాలగమనంలో అందరి పయనం (అటే) అయినా

ఏలా ఇలా దాపరికాలు.. మమతానురాగాల మాటు రేగే వింత ప్రశ్నలు

కొన్ని బంధాల నిడివి కొద్ది కాలమైనా వాటి విలువ జీవితకాలం గుర్తుండిపోతాయి ప్రకృతిలో శిలాక్షరాలై మిగిలిపోతాయి

మరికొన్ని ఇసుక తిన్నెలుగా మారి సంద్రపు అలల నురగలై ఉవ్వెత్తున ఎగసి మరలి వెళ్ళిపోతాయి


జీవితమనే పుస్తకమే మనది, అందులో కోపతాపాలు బంధాలు బాంధవ్యాలు ప్రేమలు ఆప్యాయతనురాగాభిమానాలు కష్టసుఖాలు కలబోసిన ఓ కమ్మని కావ్యమాలిక

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల