నాకే ఎందుకిలా

తాను నా దగ్గరుంటే "నేను మా పుట్టింటికి వెళ్ళి వస్తా" నంటది.
నా సమ్మతమున్నా లేకున్నా తాను వెళ్ళే తీరుతుంది. మరల తనని తన పుట్టినింటి నుండి మెట్టినింటికి తీసుకు రావటం కోసం అడిగితే.. "నేను చెప్పినపుడు టికెట్ బుక్ చేయ"మంటది.

తాను తన పుట్టింటిలో ఉంటే అక్కడ దుమ్ము ధూళిలో తనెలా ఉందో ననే దిగులే నాకు ఎక్కువా.. వారం రోజులైతే నేను కూడా ఉండి తనని వెంటబెట్టుకు రావచ్చు.. కాని తాను ఉండేది కనీసం మూడు నెలలు.

మా పెళ్ళైన నాటి నుండి నేటి వరకు గత రెండేళ్ళలో తన పుట్టింటిలోనే దాదాపుగా పదునాలుగు నెలలు గడిపింది. దసర కి పంపితే దీపావళి ముగిసాక నేనే వెళ్ళి తీసుకురావాలి.
సంక్రాంతికి పంపితే ఉగాది చేసుకున్నాక నేనే దగ్గరుండి జత చేసుకురావాలి. కొసమెఱుపు ఏమంటే అంత ఆత్రంగా వెళ్ళొచ్చే తనకు తనవారు ఏ రోజు కూడా కొత్త బట్టలు గాని ఏది కొనివ్వరు. ఏదైన నీ భర్తయే కొనాలి అని సర్ది పంపుతారు. కొనేటప్పుడు భర్త అవసరం కాని గడచిన ఇరవై ఏడు నెలల మా కాపురంలో పదే పది నెలలు నాతో గడిపింది. ఇందులో సైతం ఆరు నెలలు పురుడుకని మరల తన పుట్టింటికే పయనమయ్యింది.

తానిక్కడ ఉంటే "మా వాళ్ళు గుర్తుకు వస్తున్నారు, నేను వెళ్ళోస్తా" అంటుంది. ఇహ వైపరిత్యం ఏమంటే ఈ కరోన వేళ సైతం నేను పంపనని చెబితే వినకుండ తన అన్నను ట్యాక్సి లో పిలిపించి మరీ కదలి వెళ్ళింది. ఎపుడెలా ఉంటుందో తెలియని ఈ సందిగ్ధ కాలంలో కూడా.

మా అత్త మామలు సైతం తన బిడ్డకు వివాహమయ్యాక మెట్టినిల్లే సర్వస్వమని అక్కడుంటేనే పదిమందిలో గౌరవమని తెలిసి తెలియనట్టుగానే ప్రవర్తిస్తారు. వాళ్ళ దాంపత్య జీవితం లో మాత్రం మొత్తం కలిపి ముప్పై నెలలే మా అత్త తన పుట్టినింటిలో పురుడుకోసమని ఉన్నారని వారి అమ్మమ్మ తాలుకు వారి వాదన. మరి నాకే ఎందుకో ఈ వేదన.. ఎవరికి చేసేది నివేదన.

మా మధ్య ఇతరత్ర గొడవలంటు ఏమి లేవు. తనకి ఎపుడు కష్టమనేదే కలగించలేదు.

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల