~

జీవితం చూట్టు ఆశలు అడియాశలు
భావోద్వేగాల నడుమ రాగద్వేశాలు
సిర ధమనుల ను దాచే కండర యముకలు
శిథిలమైన అవయవాలకు పెళుసుబారే అస్తిపంజరాలు
ఒకరికొకరై కడదాక మెదిలితే నవరసాలు
కోపోద్రిక్తత కనుమరుగున పడితే అన్యోన్యతలు
అపుడుపుడు నమ్మినా నష్టమే అడపదడప కావలసినా కష్టమే
పేగు బంధానికి విలువ కాటిలో కట్టే కాలే ఘడియ దాక

వేగు చుక్క తళుకు విలువ నిశీధిన మెఱిసే దాక
ఆర్థోపెడిషియన్ మొదలు జెనెరల్ సర్జన్ దాక
చమురు కొండెక్కక మునుపే దీపాన్ని కాపాడే కరములు
తెలిసి తెలియక నడిచే దారిలో అపుడపుడు రాళ్ళు రప్పలు
కాని పాదం ధూళి తాకితే రాయైనా ముక్కలగును ముళ్ళు సైతం పూలగును
కాలమే సాక్షి కాలానికే కష్టాన్ని పరిచయం చేయటం తెలుసు
మరల ఆ కాలక్రమంలో నష్టాన్ని నివారించటం తెలుసు
ఏదేమైన ఈ ఊపిరి లయగతుల లోలకడోలక మనసు మందిరాన
భావాలకు కొదవ లేదు.

Popular Posts