ఏమి ఇచ్చుకోగలను కృతజ్ఞత తప్ప

 నేను పుట్టిన ఊరు నన్ను మూడేళ్ళు సాకితే.. నన్ను పెంచిన ఊరు ముప్పై ఏళ్ళు సాకింది.. ఏమిచ్చి ఋణము తీర్చుకోగలను వైజాగపటమా..! చదువు సంస్కారం నేర్చుకున్నది ఈ వైశాలినగరములోనే..!! మర్యాద గౌరవం పొందింది ఇక్కడే.. సొంతిల్లు నేను పుట్టిన ఊరిలో కట్టించుకున్నాము దాని మూలానా నా వివాహనంతరం అక్కడే బస చేయాలని తీర్మానించుకున్నా గాని, మనసొప్పకా గడచిన రెండున్నరేళ్ళు  కూడా వైజాగపట్టినములో ఉన్నాము.. నాన్న గారికి మరో ఐదేళ్ళ ఐదు మాసాల తరువాయి రిటైర్మెంట్ గనుక వారు సొంతింటికి రాలేని పరిస్థితి.. బాడుగా కి ఇస్తే కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎలా ఉంచుతారో తెలియని అనిశ్చితి.. గనుక నేను తప్పనిసరిగా సతి సమేతంగా సొంత గూటికి చేరే సమయం ఆసన్నమయ్యింది.. కాకపోతే అందరు క్షేమంగానే ఉండాలని నా మనఃసాక్షి తో మనఃపూర్వకంగా కోరుకోవటం తప్ప ఏమి ఇచ్చుకోగలను..! 

Popular Posts