కాలం
నే పుట్టి మూడున్నర దశాబ్దాల నాటి నుండి ఏనాడైనా అనుకున్నానా ప్రాచిన సాంప్రదాయమైన మన నమస్కారం ఇలా షేక్ హ్యాండ్ దాక వచ్చిన టెక్నాలజిని దాటి మరల నమస్కారం యావత్ ప్రపంచానికే సోకిన కరోనా ను కాస్తో కూస్తో కట్టడి చేసే సాధనమై నిలుస్తుందని..
ఈ మూడు పదుల ఐదు ఒకట్ల వయసులో సైతం ఒకరితో ఒకరికి ఉత్తరం నుండి వృద్ధి చెంది ల్యాండ్ లైన్ దాటుకుని సెల్ల్యూలర్ మొబైల్ ను మించి డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ తో విడియో కాన్ఫరెన్స్ ఐతేనే ఈ కోవిడ్ కాలమున సరైన ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు ఉంటుందని.
ఈ ముప్పది ఐదు ఎండ్ల నాటి సంధి ఏ మారు మూలాన సైతం కిక్కిరిసిన జనం గగ్గోలు వింటు.. ట్యాక్సి, బస్ ట్రేయిన్, ఏయిరోప్లేన్ లలో నిత్యం సందడి కాస్త అటు ఇటుగా ఇరవై ముప్పై మించ కూడని ప్రయాణాలకు దారి తీస్తుందని
గడచిన ముప్పై ఐదేళ్ళలో దగ్గు కి బెనాడ్రిల్ సిరప్ లేదా అజిత్రాల్ ౨౫౦ ట్యాబ్లెట్లు, జలుబు కు సెట్రిజైన్ హైడ్రోక్లోరైడ్, జ్వరానికి వోవెరిన్, పెరసెటమాల్ మాతరలు వేసుకుంటే ఇట్టే నయమయ్యే షరామామూలు కాస్త పెచ్చుమీరి అలాటి లక్షణాలనే పోలి ఇలా ఇలాఖాలలో వణుకు పుట్టించేదిగా పరిణితి చెంది మ్యాస్క్ లను సైతం బట్టలలో భాగం చేసేటంతగా భయభ్రాంతులకు గురిచేస్తుందని ఊహలోనైన అనుకున్నానా
నా చిట్టితల్లికి గతేడాది నెలల వయసు నుండి క్రమం తప్పక టీకాలు వేయిస్తు వ్యాధి నిరోధక శక్తిని పెంపోందించాలనే తపన అందరిలాగానే.. ఐతే ఈ సార్స్ ౨ ఎన్ కోవ్ వలన ముప్పై ఐదేళ్ళ వాడిని నేనే ఏంటి పండు ముసలి వారు సైతం ఏ రెమెడెసివిర్, ఆస్ట్రాజెన్కా, కోవ్యాక్సిన్ లాటి కరోన కట్టడి టీకాలకై ఎదురు చూస్తున్నాము అందరం..
కొసమెరుపు
ఏది ఏమైనా.. కాలానుగుణంగానైనా మనిషి మనుగడకు హద్దులు వాటికవే వస్తాయి.. అపుడు ఎంత తపించిన ఆగని ఎంతగా తప్పించినా ఆ ఘడియ రాక మానదు.. ఐనా సగటు మనిషికి చచ్చే దాక బ్రతకాలని ఆశ పడుతునైన ఈ కోవిడ్ ౧౯ కరోనా కాష్టమందు మూడు నుండి ఆరు మీటర్ల (సామాజిక వ్యాప్తి దశ మొదలైతే) సామాజిక భౌతిక దూరం, మ్యాస్క్ ధారణ, ఐసోప్రోపైలల్కాహాల్ హ్యాండ్ రబ్/శ్యానిటైజర్ తో కోవిడ్ ను పారద్రోలటానికి మన వంతు యత్నం.. మన ఆరోగ్యం దృష్ట్యా.. కోవిడ్ తాలుకు హెర్డ్ ఇమ్యూనిటి పెరిగినా ఒకింత అందరికీ మంచిదే..
జై భవాని
~శ్రీత ధరణీ