నా చిట్టి తల్లి
నీ ముద్దు మాటలతో ఆనందరాగాల డోలికలే వీనుల విందవగా
నీ పాదముద్ర నా యదపై తడబడుతు సాగువేళ చక్కగా
నీ చిరునవ్వులోలుకు మోవిపై పసిప్రాయం భాసిల్లగా
నా చిట్టి తల్లి నీకు జన్మంత వాత్సల్యతను పంచుతు ఋణపడి ఉండనా
ఆము అంటు నీ మునివేళ్ళను నువ్వే నోటికి చేర్చుతు సైగ చేసే వేళ
గోరు ముద్దలు కలిపి కొసరి తినిపిస్తు నీ కడుపు చల్లగాయని దీవించనా
ఖా అంటు దీర్ఘంగా గంభిరంగా నీవు చెబుతుంటే జెమ్స్ తెచ్చి ఒక్కోటి చొప్పున రోజు నీకు కానుకీయనా
తాతా అంటు గారాలుపోతు తాతయ్య దగ్గర మురిపించినా
నానమ్మ ను మామా అంటు పలకరిస్తూనే ఓయంటు నానమ్మే పలకగా వెంటనే ఏయ్ అంటు ముసిముసి నవ్వులు చిందించటం
శానిటైజర్ చేతిలో వెయ్యమంఠు నా దగ్గరకొచ్చి తలాడిస్తు నీ చిన్నారి పిడికిలిను అలవోకగా విప్పదీసినా..
ఆటలాడుతు అమ్మను సైతం నీ ఆటబొమ్మగా మలుచుకుని
జుట్టంత లాగేసే అల్లరి పిల్లవంటు ఫిరియాదులను ముద్దులతో అందరం ఏకధాటిగా ఆశిస్సులను అందిస్తూ
నా ఎడమ చేతి బొట్టన వేలు ఎలా ఆడుతుందో గమనిస్తూ నీ ఎడమచేతి బొట్టన వేలినలా తిప్పటం అది నీకే సాటి ఓ గారాల పట్టి
మా ఇంట తిరగాడే శ్రీ కనక కవచ ధారిణి దుర్గాంబిక అంశవై
నిండు నూరేళ్ళు సౌఖ్యంగా సఖ్యతగా ధనధాన్యాదులతో తూలతూగుతు ఆయురారోగ్యాలతో చల్లగా వర్ధిల్లు నా చిట్టితల్లంటు మనసారా మనఃపూర్తిగా ఆశిర్వదిస్తు..
అమ్మ అనిత.. నాన్న శ్రీధర్