ಧರ್ಮಪತ್ನಿ

నీకు స్నేహితులు లేకపోతే నాకు ఉండకూడదా అంటు నిలదీస్తున్నావు కదా.. నీకు ఏదైనా అవసరం వచ్చినపుడో లేదా సుస్తి చేసినపుడో ముందుగా నిను కాపాడుకోవాలని తపించేది నీ భర్త నైన నేను, నీ అత్త మామలు. నిన్ను కన్నవారు, నీ తోబుట్టువులు నీ పెళ్ళి అయ్యాక చుట్టాలుగానే ఉంటారు.. తమ ఇంటి బిడ్డ అత్తారింట క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. స్నేహితులు ఒక స్థాయి దాటిన తర్వాత ఏ అవసరమొచ్చినా, ఎలాంటి సాయానికి అర్థించినా "ఔనా! అయ్యో!!" అంటు నిటూర్చే వారే తప్పితే వారికి అంతకు మించిన వ్యవహారాలతో ప్రయోజనాలుండవు. మహా ఐతే సలహాలు, సూచనలు ఇవ్వగలరే కాని నీ వారిలా నిన్ను ఆదుకోలేరు. స్నేహం ఉండాలి కాని మరీ మితీ మీర కూడదు. స్నేహాన్ని అదనుగా మలచి మోసాలు చేసే వారు లేకపోలేదు. స్నేహం పేరిట డబ్బులకు పూచికత్తుగా హామి పత్రాలతో వంచన చేసి పరారై ఇరకాటంలో నెట్టిన వారు లేకపోలేదు.
కన్నందుకు తల్లిదండ్రులకు, వారింట పుణ్యస్త్రీ గా కాలుమోపినందుకు అత్తారింటికి, తనకు జీవిత భాగస్వామిగా మెలుగుతున్నందుకు భర్తకు విధేయత ఒక పుణ్య స్త్రీగా తన ధర్మం.
ఎంతటి దుర్భర పరిస్థితులలో నైనా ఓకరికొకరు అన్యోన్యతను, ఆత్మీయతను వీడని వారే పుణ్య దంపతులు. కళ్యాణంలో ఒక్కటైన చేతులు నిర్యాణంలో వీడాలే తప్ప తక్కిన కాలంలో జతగా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కలసిమెలసి బ్రతకాలి. ఇదే జీవిత పరమార్ధం.

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల