నది పుత్రుడు
Havelock Bridge Image Courtesy: Wikipedia |
గోదావరి గట్టు, రాతిరి వర్షం పడినందువల్ల మంచు కమ్మేసి మసక మసకగ ఉంది వాతావరణం అంత. తెలవారుతూ ఆ మంచువులను ఆకులపై నీటి బొట్లుగా మార్చి ఉషోదయానికి నాంది పలుకుతున్నట్లు ఉదయించాడు అరుణ భాస్కరుడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా డేంజర్ మార్క్ దాటి పొంగి పొర్లుతుంది గోదారమ్మ తల్లి. ఆ ఉద్దృతి వల్ల వాతావరణ శాఖ రేడియో లో ప్రమాద హెచ్చరికలు జారి చేసి జాలర్లు చేపల వేటకు పోరాదని అనౌన్స్మెంట్ చేసేరు. ఎటి గట్టు రావి చెట్టు దగ్గర బసవయ్య ఎప్పుడెప్పుడు తెలవారుతుందా, ఎప్పుడు వేట మొదలెడదామా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ తన నులక మంచం దిగాడు.
"ఇయాల కూడా జేరం తగ్గనెదు, ఈ పాలి వొండనికి నిన్న అట్టుకోచ్చిన సేపల పులుసు కాచి ఎట్టిన, రేపటి దాంక తగ్గితే గప్పుడు ఎటకు పోగాని మావా"
"అట్ట జేరం ఒత్తే ఇట్ట కుకుంతే డబ్బులు యాడ్నించి వోత్తయే మంగి, ఏదేమైనా ఇయ్యాల ఎటకు పోవాల్నే" "అద్దు మావా, గోదారమ్మ ఆటుపోట్లాడ్తాంది, ఇయ్యాల అద్దు, తగ్గినంకా ఎల్తే మంచిగుంటాదే. ఇయ్యలైన నా మాట ఇను, ఇలా ఇనకుండా ఇంతదాంక తెచ్చుకున్నావ్, అద్దు అద్దు అన్న ఇనిపించుకొలెదాయె, వల తెగిందని లోనికి ఈతకు పోయి పెనాల మీదకు తెచ్చుకున్నావ్"
ఇంతలోనే మెరుపులు మెరుస్తూ దట్టమైన మబ్బులు అల్లుకున్నాయి. గోదారమ్మ ఉరకలు వేస్తూ ఆ నల్లటి నీడలో పొంగి పొర్లుతుంది.
"ఓ అయ్యో అట్లా జూసినావ ! ఎట్లా పోట్టేట్టుతాందో గోదారమ్మ ఈయల్టికి చక్క నా మాట ఇని ఉరకున్నందుకు చాన సంతోషం. ఇదిగో పట్టు అయ్యా కూడెడతా"
"పాపయ్య పోద్దాకల్నిన్చి కాన వస్తా లేడు యాడికి పోయినాడే మంగి "
"వల తెగిందని బాగు సేస్తాండు మావా "
"ఓ బసవయ్య .. ఇయ్యాల ఏటకు వస్త లేవా ఎమ్ ?"
"రాడు చిన్నయ్య ! జరా ఒంట్లో నీరసంగా ఉండాది .. పైగా వాన వచ్చే నాగున్నది!"
"అట్ట అన్నవెం మంగి..?"
"నీకు ఒంట్లో బావుంటే ఆపేదాన్నా? ఇయ్యాల ఉరకుండు రేపు జేరం తగ్గినాక బొదువులె.. "
Rail-cum-Road Bridge Image Courtesy: Wikipedia |
అలా కొంచెం అన్నం పులుసు తో తిని కాస్త సేద తీరాడు బసవయ్య. వర్షం తుప్పెరాల పడుతూ ఉంది. కొద్ది సమయానికి మబ్బులు చెల్లచేడురవ్వుతూ సూర్యుడు దర్శనమిచ్చాడు. చాల నీరసంగా ఉన్న బసవయ్యకు ఆ రోజు చటుక్కున నిద్ర ఎలా పట్టిందో బాగానే పట్టింది. ఇంతలో పాపయ్య కూడా ఆ వలను బాగుచేసాడు.
మిట్టమధ్యానం సూర్యుడు. అలా ఆ గోదారమ్మ మీద రైల్ రోడ్ బ్రిడ్జి మీంచి రైలు కూతకు బసవయ్య కు మేలకువ్వోచ్చింది.
"ఒంట్లో శక్తి పుంజుకుంది.. పొద్దుగాల పోయే బదులు నేను పాపయ్య ఏటకు పోయ్యోత్తమే మంగి ఇల్లు జాగర్త "
"అట్టాగే అయ్యా ఒళ్ళు సూడని .. జెర్ర తగ్గింది ... ఎం లేకపోతె ఎంటనే ఎనక్కొచెయ్యయ్య "
"అట్టనే .. పాపయ్య పుట్టి తీర.. ఇప్పటికే శాన పొద్దుపోయింది "
"ఇదిగో అయ్యా .. జరా ఈ వల అందుకో "
అలా పాపయ్యను వెంటబెట్టుకొని బసవయ్య తన చిన్ని పుట్టి లో గోదావరిలో వేటకు బయలుదేరాడు. ఆ రావిచెట్టు దగ్గర తిష్టవేసి మంగి వాళ్ళ రాక కోసం వేచి చూడసాగింది. ఓ ముప్పావు గంట తరవాత పుట్టి తిరిగి వస్తునట్టు గమనించి మంగి కేకేసింది
"ఓ మావో ... మావా ... ఎమైనాదె.. ఒంట్లో గాని మల్లి జేరం ఒచినాద ఎమ్ ?"
"ఊ మంగి .. వత్తున జర్ర ఆగు"
Arch Bridge Image Courtesy: Wikipedia |
ఆ రోజు ఎం విచిత్రమో, ఎప్పుడు వేటకెఌనా చిన్న చేపలు తప్ప పెద్దవి చిక్కనిది ఆ రోజు వలలో అన్ని పెద్ద చేపలు పడ్డాయి. అందుకే వెళ్ళిన అరగంటకే వెనుతిరిగారు వాళ్ళు. ఇంటికి వచ్చి వేట మూట దించారు ఆ పుట్టి నుండి.
"ఏందీ మావో .. కొరమీనులు , వలగాలు, బొచ్చెలు , అవి కూడా వల నిండా "
"అవునే మంగి.. ఇక మన కస్టాలు కొంచెం గట్టేక్కినాయి .. జరా చేపల సంతకిబోయి ఈటిని బేరం పెడతా "
"అట్టాగే అయ్యా.. నీళ్ళు తాగిపోదువుగాని .. ""
ఆ వేటను మూటగట్టి తన భుజానికి ఆనించి, పక్కన పాపయ్య తో సంతకని బయలుదేరాడు బసవయ్య. తన కళ్ళలో ఏదో కొత్త మెరుపు మెరుస్తూ, మనసు హాయిగా ఉల్లాసంగా ఉంది అతనికి--