అమ్మ


నవరసాల సమ్మేళనం అమ్మ
ఆప్యాయత అనురాగాల మారు పేరు అమ్మ 
మంచిని పంచిపెట్టే కరుణామూర్తి అమ్మ 
విరిసే వెన్నెల కిరణం అమ్మ 
ఎగిసే సూర్య రశ్మి అమ్మ 
తన ఆప్యాయత అనురాగాలు మన పాలిట ఆశిర్వాదాల జల్లులు 
తేనే పలుకులు నేర్పి బుడిబుడి అడుగులు నడిపించే అమృతమయి అమ్మ 

మనం ఇంతింతగా ఉన్నప్పుడు పరితపించి లాలించి పాలించే తలిదండ్రుల ప్రేమను
రెట్టింపు చేసి ఇవ్వగలగడంలోఓ ఆనందం ఆత్మా సంతృప్తి ఉంది 
మనపై మెండుగా ప్రేమను కురిపించి ప్రతిఫలం ఏమి కోరని మానవత మూర్తి అమ్మ.
మన బాగుకోరి ఎలాంటి కష్టమైన భరించే పుదిమితల్లికి ప్రతిరూపం అమ్మ 

వాళ్ళ హృదయాల్లో సుస్థిర స్థానం పొందగలగాలి
అంటే వాళ్ళని చక్కగా చూసుకోవాలి
అదే మన ఉనికిని మనం చాటుకునే స్థాయికి తెచ్చిపెట్టిన
అమ్మ నాన్నలకు మనం ఇచ్చే అరుదైన అపురూపమైన బహుమానం. 

మన బాధని తన బాధగా మలచి,
మనమే తన లోకం అనుకుని ఎల్లవేళలా
కంటికి రెప్పలా వానకి గొడుగులా నిత్యం తోడుండే
తల్లి ప్రేమ మరే ప్రేమకు సాటి రాదు. 

కొందరు కన్నతల్లి ప్రేమకన్నా వాళ్ళ స్వార్థం కొఱకు
కనిపెంచి పెద్దచేసిన అమ్మ నాన్నలనే వదిలెఌపొతారు
తమవారికి తాము అంటూ, అసలు లోకం లో అమ్మ లేనిదే
తాము లేమనే నగ్న సత్యాన్ని పెడచెవిన పెట్టి కన్నతల్లి హృదయాన్ని మభ్య పెడతారు.. 

అలాటి సమయం లోనైనా ఆ అమ్మ తన బిడ్డడు
బాగుండాలనే కోరుకుంటుందే తప్ప మరేది కోరుకోదు.
అదీ అమ్మకున్న అసలు సిసలైన విలువా.

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం