ప్రయాణం

This Fictional short story is based on the theme of Parental Affection, which revolves around a mother and her daughter who arrive at the former's native place after a long gap and enjoy a pleasant time at the place with her parents for a week recollecting past memories and happy moments, if this short write-up fascinates then, go through the whole story below..

Disclaimer: The Following Short story is totally a work of fiction, the characters mentioned in it are not related to any person living or dead and any resemblance whatsoever may be regarded as purely coincidental.

Theme: Parental Affection
Type: Short Story
Language: Telugu
Genre: Travellogue Fiction
Title: Prayaanam

శీతాకాలం వలన సాయంత్రం ఆరింటికే నలువైపులా చిక్కగా చీకటి అల్లుకుంది. నెల్లూరు  రంగనాయకులపేటలో నివాసముంటున్న అనూహ్య హడావిడిగా ఉంది. తన ఏడేళ్ళ పాప షణ్ముఖికు పది రోజుల వింటర్ బ్రేక్ కావున ఊరెళ్తోంది అంచేత లగ్గేజ్ సర్దుకుంటోంది. సెండాఫ్ ఇవ్వటానికి అనుదీప్ కు రావటానికి ఆలస్యమౌతుందంటు మెసేజ్ పెట్టాడు అలానే రేడియో క్యాబ్ ను ఏడింటికల్లా రమ్మని బుక్ చేసి అడ్రస్ ఇచ్చాడు. అనుదీప్ అనూహ్యల పెళ్ళై పదేళ్ళు అవుతున్నా ఒక్కసారి కూడా తాను తన ఊరు వెళ్ళలేదు.. కారణం: చిన్న పాపను వెంటబెట్టుకుని ప్రయాణం చేయ్యటం అంత మంచిది కాదంటు ప్రతిసారి సెలవులకి వాళ్ళ అమ్మ నాన్నలే ఊరి నుండి తనని చూడటానికని వచ్చేవాళ్ళు.

ఈ సారి ఎలాగైనా ఊరెళ్ళాలని తీర్మానించుకుంది అనూహ్య. నెల్లూరు-కాకినాడ-నెల్లూరు టికెట్లు తన చేతికి ఇచ్చి వారం రోజులు హాయిగా గడిపి రమ్మని.. ఐతే తనకు వీలు కుదరక రాలేనని అన్నాడు అనుదీప్. అందుకే కాస్త డీలాగా ఉంది తను. రేడియో క్యాబ్ వాళ్ళుంటున్న ఇంటినుండి స్టేషన్ కు చేరుకుంది. దారి మధ్యలో కునుకు తీసిన షణ్ముఖిను తట్టిలేపి లగ్గేజ్ తో ఎంక్వైరి విండో వైపు అడుగులు వేసింది అనూహ్య.

"శేషాద్రి ఎక్స్ ప్రెస్ ఎన్నింటికి వస్తుందండి?"
"ఎనిమిదిన్నరకు రెండవ ప్లాట్ ఫాం మీదకు వస్తుందండి!"

వింటర్ హాలిడేస్ మూలాన స్టేషనంత జనంతో కిటకిటలాడుతోంది. ఫుట్ ఒవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నపుడు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ లో శేషాద్రి గంట ఆలస్యమని అనౌన్స్ చేశారు. రెండవ ప్లాట్ ఫాం చేరుకుని షణ్ముఖి అనూహ్య ఇద్దరు తాము ఇంటినుండి తెచ్చుకున్న డిన్నర్ తిని కాసేపు ఇద్దరు కునుకు తీసారు. రైలు కూత విని అనూహ్య మేల్కుంది.

"ఫర్ ది కైండ్ అటెంషన్ ఆఫ్ దీ ప్యాసెంజర్స్ బోర్డింగ్ ట్రైన్ నంబర్ వన్ సెవెన్ టూ జీరో నైన్ సౌత్ బెంగళురు సిటి  టు కాకినాడా టౌన్ డౌన్ శేషాద్రి ఎక్స్ ప్రెస్ విల్ అర్రైవ్ టూ ప్లాట్ ఫాం నెంబర్ టూ విథిన్ ఏ షాట్ వైల్.."

"యాత్రిగణ్ కృపయా ధ్యాన్ దీజీయే గాడి సంఖ్య ఎక్ సాత్ దో శూన్య నౌ సౌత్ బెంగళురు సిటి సే కాకినాడ టౌన్ తక్ జానే వాలి శేషాద్రి ఎక్స్ ప్రెస్ థోడి హి దేర్ మెఁ దో నెంబర్ ప్లాట్ ఫాం పర్ ఆయేగి.."

"యాత్రికులు దయచేసి ఆలకించండి బండి నెంబరు ఒకటి ఏడు రెండు సున్న తొమ్మిది సౌత్ బెంగళురు సిటి నుండి కాకినాడ టౌన్ వెళ్ళవలసిన శేషాద్రి ఎక్స్ ప్రెస్ మరి కొద్ది నిమిషాలలో రెండవ నెంబరు ప్లాట్ ఫాం మీదకు వచ్చును.."

నెల్లూరు స్టేషన్ లో అప్పటిదాకా స్తబ్దుగా ఉన్నా జన ప్రవాహం లో కదలిక. ఎలాగు జనరల్ బోగిలో సీట్లు దొరకవని తెలిసి స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ బోగిల్లో కూడా ఎక్కేసి కూర్చుంటున్నారు జనాలు. ఈ రద్ది దృష్ట్య  రిజర్వ్ చేసుకున్న తన బెర్త్ ఎక్కడ చేజారిపోతుందోనని హడావిడిగా లగ్గేజ్ ను షణ్ముఖిని వెంటబెట్టుకుని గబగబ నడవసాగింది అనూహ్య.

ఇలా తన బెర్త్ చేరుకుని కుర్చుంటుండగానే ట్రైన్ కదిలింది. బోగి నిండ జనాలతో కిక్కిరిసి ఉంది. కాకినాడలో వాళ్ళింటికి మరియు అనుదీప్ కు తను క్షేమంగా ట్రైన్ ఎక్కేశానని మెసేజ్ పెట్టింది.. చాలా సేపటి నిరీక్షణతో అలసట కారణంగా పడుకున్న వెంటనే నిద్రలో జారుకుంది. మరుసటి ఉదయం పావు తక్కువ ఏడింటికి కాకినాడ టౌన్ స్టేషన్ లో ట్రైన్ దిగుతుండగా పరంధామయ్య జానకి దంపతులు అనూహ్యను షణ్ముఖిను రిసీవ్ చేసుకున్నారు.

అనూహ్య కన్నులు ఆశ్చర్యానందాలకు లోనయ్యాయి.. ఈ పదేళ్ళలో ఎంత మార్పు.. చిన్న చిన్న ఇల్లులున్న గల్లిలు ఈ రోజున పెద్ద పెద్ద ఇళ్ళు తారు రోడ్లతో స్వాగతమంటున్నాయి.. అంతలోనే వాళ్ళు ఇంటికి చేరుకున్నారు.. మధ్యాహ్నం భోజనాలనంతరం తనని షణ్ముఖిని వెంటబెట్టుకుని పరంధామయ్య జానకమ్మ ఇరువురు వాళ్ళింటికి ఆమడ దూరం లో ఉన్న వాళ్ళ కొబ్బరితోటకు తిసుకుని వెళ్ళారు. అక్కడ కొబ్బరితోటలో తాను కలియదిరిగింది.. చిన్ననాటి స్మృతులను నెమరేసుకుని పచ్చని పొలాల మధ్య షణ్ముఖితో ఆడుకుంది. చాలా రోజులకి ఊరోచ్చిందని జానకమ్మ తనకిష్టమైనవన్ని చేసి పెట్టింది. తానొచ్చిన మూడవరోజునా వర్షం కురిసింది.. ఆ వర్షానికి తాను చంటిపిల్లలా గంతులేస్తు కాగితపు పడవలను తయారు చేసి పారించింది..

అలా గంతులేస్తున్న తన కూతురిని చూస్తు పరంధామయ్య జానకమ్మ ఇరువురు మురిసిపోయారు.. పిల్లలెంత ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు ఎప్పుడు పసివారిలా కనిపిస్తారు.. పచ్చని పొలాల పై వీచే పైరగాలిని పలకరిస్తు ఆకాశానా అరుణిమ అద్దుతు ఉదయించే సూర్యుణ్ణి ఆస్వాదిస్తూనే కాలం గిర్రున తిరిగి అపుడే వారం రోజులు పూర్తయ్యాయి. తాను నెల్లూరు బయలుదేరే సమయం రానే వచ్చింది. జానకమ్మ అల్లుడికోసమని కాకినాడ కాజాలు, పూతరేకులు, కొబ్బరుండలు కట్టి పంపింది. మధ్యాహ్నం మూడింటికి కాకినాడ టౌన్ స్టేషన్ కు బయలుదేరుదామంటుండగా వర్షం పలకరించింది. ఆ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని తన ఫోన్లో బంధించుకుంటుండగా స్టేషన్ చేరుకున్నారు.

స్టేషనంతా కల్లాపి చల్లినట్టు తడితడిగా ఉంది.. తన్మయత్వం నిండిన అనూహ్య కన్నులు కూడా చెమర్చాయి..శేషాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కుతు పరంధామయ్య జానకమ్మలకు తను వీడుకోలు పలికింది.. తాను గడిపిన వారం రోజుల్లో గడిచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటు తన బెర్త్ వైపు అడుగులు కదిపింది అనూహ్య..!

I occasionally travel to my Native Place, which is Warangal, So, I thought, Why not shall I draft a travellogue short story and I have e-penned this story.
The Train Information is Courtesy of indiarailinfo.com
The Location Mentioned is Coutesy of Google Maps, I chose a locality that could be nearer to the Railway Station mentioned in the Story.

Popular Posts