నేను నీ కావ్యాన్ని
ఉదయించే సూర్యుడినై వెలుగు పంచగా వేకువై వస్తాను
కదలాడే నిజాల మధ్య కలల మిథ్య నాయి నేను వస్తాను
రగిలే గుండె ఘోషలో నా గొంతుక వినిపించగా వస్తాను
నల్లని రేయి కి రంగులద్దే కుంచేనై మిరుమిట్లు గోలుపుతాను
నీ ప్రతి ఆశ నీకు తోడుగా ఉంటాను
కరిగే ఆలోచనలు కన్నిరై ఆవిరవ్వుతుంటే
గాలిలో తెమనై గులాబి పరిమళాన్ని నేనై
ఉద్విగ్న గుండె మాటు గాయాన్ని మాన్పగ చైతన్య కిరణాన్నై
ఊపిరి దారుల్లో గాలి మాటు జీవం నేనై నీలో భావుకత నెనౌతాను
నీ బాధను పంచగా అక్షర మాలికనై
నీ ప్రతి కర్మలో కర్తనై నీ ప్రతి క్రియ లో ఆత్మనై
నీ బాధలో సంతోషాన్ని పంచి నిన్ను ఉల్లసపరచడానికి
నీ మేధో శక్తిని మేలుకోల్పడానికి తారక మంత్రాన్నై నిన్ను ఊరడింపగ వస్తాను
నేనే నీ మనసు అద్దాన్ని నేనే నీ ఆలోచన పుటాకార కటకాన్ని
నేనే నీ మాటకు అర్ధాన్ని నేను నీ అక్షర అల్లికలో పుట్టిన కావ్యాన్ని