ఋణానుబంధం

ఎగసిపడే కెరటాన్ని
మనసులోని భావాన్ని
పొంగుతూ ఉరకలేసే వాగుని
ఆపాలన్న ఎవ్వరు ఆపలేరు

గులాబికి ముళ్ళే అందం
మగువకు అలంకరణే అందం
వేకువకు తొలిపొద్దు కిరణం అందం
రెప్పలు వాలిన కన్నులకు కమ్మని కలలే అందం

వెన్నెల రాత్రుల్లో చల్లగా వీచే తిమిర సమీరం
ఎటి గట్టు మాటున ఉరుకులు పరుగులు పెట్టి
అమాయకంగా నవ్వు విరబూసి తేనియల నవ్వులే మహదానందం
అలరారుతున్న మబ్బుల వాకిలిలో వెండి రేఖ ప్రకృతికి మనిషికి ఉన్న ఋణానుబంధం 

Popular Posts