పక్షిలోక పక్షపాతం

నీ 'అలక'లు 'చిలుక'లు ఎగురేసుకు పోతే 
నా నీ 'బంధం' రా'బందు'ల పాలు కానివ్వను 

నీ 'వంక' ఓరగా నేను చూస్తూ ఉంటే
'గోరువంక' ఇక చూసింది చాలంది 

నీ మనసును నాకు 'ఇచ్చుకొ'మని మనవి సేయగా 
'పిచ్చుక' కువకువలతో ఆకాశం మారుమ్రోగింది 

'బిజీ'గా ఉన్నాను నీ ప్రేమ రాయబారమంపలేనని 
'గిజిగాడు' కొబ్బరాకుమీద అల్లుతున్న తన పొదరింటి  నుండి చిఱ్ఱుబుఱ్ఱు మన్నాడు 

ప్రేమలేక 'ఏకాకి'గా మిగలకు కాకమ్మ కథలు విని హాయిగా నవ్వుకోమని
ఆహ్లాదంగా మనసుని ఉంచుకోమని  'కాకి' రెక్కలు  రెపరెపలాడించింది

ఏనాడైనా బాధకలిగి 'కేకే'స్తే 'కేకి' నాట్యమాడి 
మనసుని హాయిగోలుపుతానని హోయలుపోయింది 

ఇంత "చిన్నదాని" కే 'గుడ్లు' తేలేస్తే 
ఒరవలేకుండా ఉంటే మంచిది కాదని 'గూడ్లగూబ' హితబోధ చేసింది 

ప్రేమనేది పంచిపేట్టాలే కాని 'దొంగ'లించకూడదని 
'కొంగ' కోనేరు లో ఒంటికాలి జపం చెయ్యసాగింది   

Popular Posts