నవ్వు నువ్వు నవ్వు

నవ్వే మనిషికి బలం
నవ్వే మనిషి ఆలంబన

నిన్ను బాధ పెట్టిన క్షణాన్ని తలుచుకుని నవ్వు
నిన్ను కృంగదీసిన క్షణాని తలుచుకుని నవ్వు

ఇప్పటి దాక జరిగిన దానికి ఏడ్చి ఏడ్చి కళ్ళు పోడిబారాయి ఆ పొడిబారిన కన్నులు చేమర్చేలాగా మనసార నవ్వు
నిన్నటి ఆ తిమిర నిశి లో నిన్ను మభ్య పెట్టి విసిగి వేసారిపోయిన ఆ పీడకలను చూసి విరగబడి నవ్వు

నీకున్న బాధలు నీ నవ్వును చూసి ఈర్శ్య పడి వెనుదిరిగే లా నవ్వు
కష్టాలు ఎన్ని ఎదురైనా వెన్ను చూపని వీరుడిలా పోరాడి నిలబడి హాయిగా నవ్వు

చీకటిని చీల్చుకు వచ్చే సూర్యుడి ప్రతాపంలా నీలోని శక్తినంతటిని ఒక తాటిపై నిలబెట్టి దిక్కులు పిక్కటిల్లేలా నవ్వు

అప్పుడు చూడు నిన్ను కమ్మిన ఆ విరహాగ్ని కిలలు నిహారికలై గుండెమంటను చల్లర్చుతాయి
నీ లోకం నీకే కొత్తగ నీ బంధాలన్నీ వీడిపోని ప్రేమదారం తో ఆధారమై కలకాలం నిలుస్తాయి


వార్నింగ్ : నవ్వు నాలుగు విధాల చేటు

Popular Posts