Skip to main content

దేవదాసు కంటే కాళిదాసు మిన్న

కొందరు ప్రేమించానంటారు, ప్రేమించింది అతివనో లేక జీవితన్నో అర్ధం చేసుకోలేరు
అతివ ప్రేమ వలదంటే మైకం లో మునిగి జీవితాన్ని ప్రేమించడమూ మరిచిపోతారు
జీవచ్చవం లా బతకాలని ఎక్కడ లేదు కదా, తనతో ఇప్పుడు తానూ లేకపోయినా తనకన్నా విలువైన జీవితాన్ని కోల్పోకూడదు. 
ప్రేమ త్యాగాని కోరింది ప్రాణాన్ని కాదు ప్రేమ మమతను కోరింది మైకాన్ని కాదు ప్రేమ మనసును తొలిచింది మనిషిని కాదు ప్రేమ అందుకే గుడ్డిదంటారు. 
చెవిటోడి ముందు శంఖం ఊదిన ప్రయోజనం లేనట్టే, గుడ్డిదైనా ప్రేమ ముందు (ప్రేయసి వెళ్ళిపోయాక )  నువ్వు నిన్ను ఎందుకు శిక్షించుకుంటావు ? మనది కాని దాని కోసం ఎందుకు తపిస్తావు ??


జీవితం విలువ తెలుసుకునే లోపే జరగరాని నష్టం జరిగిపోతుంది. అమర ప్రేమ కు బదులు పిరికి ప్రేమ ఉపిరి తీస్కుంటుంది. 
ద్వేషంతో చేసే ఏ పనైనా చేటు మిగిలిస్తుంది. పచ్చని చెట్టు పై ఆశనిపాతం బుగ్గి పాలు చేసినట్టు పచ్చగా వేలగాల్సిన ప్రాణం అనే బుడ్డి దీపం ఎడారి అంచులలో కొండెక్కుతుంది. 
అందుకే వదిలిపోయిన ప్రేమను (అది తుచ్చమైన , విలువలేనిది ఐతే) వదిలి పెట్టు, నీ జీవితం వెయ్యి బుడ్డి దీపాల్లా వెలుగుతుంది. 
నిజమైన నిజాయతి గల ప్రేమ ఐతే తనతో ఉన్న జ్ఞాపకాల దొంతరల ముందు దేవదాసు కాదు నిజమైన కాళిదాసు జనిస్తాడు, కీర్తిని గడిస్తాడు. 

తనని మీరు నిజ్జంగా ప్రేమించి ఉంటె మీ జీవితాన్ని కూడా అంతే ఇదిగా ప్రేమిస్తారు , ద్వేషించరు: మీ ప్రేమను మూటగట్టి మీ భవిస్యత్తు లో వచ్చే భార్యకు పంచి పెడితే ఇంతకన్నా సంతోషించాల్సిన విషయం వేరేది లేదు. తను మిమ్మల్ని నమ్మి తన జీవితం సర్వస్వం మీలో అర్ధాంగి అయ్యి ఉన్నప్పుడు ప్రేమను తనపై కురిపించి మైమరపిస్తే అదే జీవితానికి జీవించి ఉండాడానికి ఉండే ఆశ బాధ్యతా , ప్రేమానురాగాల ప్రతిఫలం  

(ప్రేమను కోల్పోయి జీవితాన్నే కోల్పోయామన్న కొందరిని భావాన్ని మైకంతో  కాదు ధైర్యంతో బ్రతకాలని చెప్పి, ప్రతి ఒక్కరు జీవితాన్ని ప్రేమించాలని చెప్పాలని చేసిన చిరుప్రయత్నం ఇది
మనకు దక్కనిది మనం ఎంత కోరుకున్న దక్కదు, మనకు దక్కాల్సింది మనం కాదన్న దక్కుతుంది, ఇందుకోసం మైకం చుట్టూ తిరిగి మన ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఎంత  సమంజసమో చెప్పాలన్న ఉద్దేశ్యం తో రాసిన కవిత ఇది. ) 

[ఇందులో ఎవరిని దూషించలేదని మనవి చేసుకుంటున్నాను ]

Popular posts from this blog

Telugu Year Names

(1867,1927,1987) Prabhava ప్రభవ (1868,1928,1988) Vibhava విభవ (1869,1929,1989) Sukla శుక్ల (1870,1930,1990) Pramodyuta ప్రమోద్యూత (1871,1931,1991) Prajothpatti ప్రజోత్పత్తి (1872,1932,1992) Aangeerasa ఆంగీరస (1873,1933,1993) Sreemukha శ్రీముఖ (1874,1934,1994) Bhāva భావ (1875,1935,1995) Yuva యువ (1876,1936,1996) Dhāta ధాత (1877,1937,1997) Īswara ఈశ్వర (1878,1938,1998) Bahudhānya బహుధాన్య (1879,1939,1999) Pramādhi ప్రమాధి (1880,1940,2000) Vikrama విక్రమ (1881,1941,2001) Vrisha వృష (1882,1942,2002) Chitrabhānu చిత్రభాను (1883,1943,2003) Svabhānu స్వభాను (1884,1944,2004) Tārana తారణ (1885,1945,2005) Pārthiva పార్థివ (1886,1946,2006) Vyaya వ్యయ (1887,1947,2007) Sarvajita సర్వజిత (1888,1948,2008) Sarvadhāri సర్వధారి (1889,1949,2009) Virodhi విరోధి (1890,1950,2010) Vikruti వికృతి (1891,1951,2011) Khara ఖర (1892,1952,2012) Nandana నందన (1893,1953,2013) Vijaya విజయ (1894,1954,2014) Jaya జయ (1895,1955,2015) Manmadha మన్మధ (1896,1956,2016) Durmukhi దుర్ముఖి (1897,19...

లోలోపల

 బయిటి వారితో కాదు. మనవారి తో మన సమక్షాన మంథనాలు. మంచిని పంచుకోగలం.. కాని.. కాలం చేసే గాయాలను అర్ధం చేసుకునే ఔనత్యం ఎవరికుంది ఈ రోజుల్లో.. లోలోపలే కుమిలిపోవటం తప్ప.. అది కనికట్టని తెలిసీ కూడా.. మనవారు ఎలా స్పందిస్తారో తెలియని నిర్వేదపు సూచన.