అందరం

 నవ మాసాలు నన్ను నీలో దాచుకుని లోకానికి నన్ను పరిచయం చేశావు అమ్మ  

నవ మాసాల తరువాయి మీ క్షమరిక్రణతో అంచెలంచెలుగా మంచి చెడు తెలుపుతు లోకాన్ని నాకు పరిచయం చేశారు నాన్న 

 ఆదరాభిమానాన్ని మెండుగా అందిస్తూనే పసి ప్రాయం నుండి వారిరువురి అండలో మంచి చెడ్డ నేర్చుకున్నాము. ఇపుడు నీ కుటుంబం వేరైనా నా కుటుంబం వేరైనా మనమంత ఒకే గూటి గువ్వలం అన్నా చెల్లెళ్ళం

  వారింట జన్మ పొంది, సతి ధర్మానికి కట్టుబడి, నా ఇంట దీపం పెట్టె గృహిణివై, కష్ట సుఖాలలో సమపాళ్ళు పంచుకుంటు నా తోడు నీవుగా నీ నీడ నేనుగా కలసికట్టుగా నా సహధర్మచారిణివై వర్ధిల్లు

  అకస్మాత్తుగా భగవంతుని వరమై మా ఇరు కన్నుల కాంతి దీపాలై కంటి వెలుగులై భాసిల్లే అక్క తమ్ముళ్ళు మీరు ఇపుడు కాని మా అందరి కంటికి మీరు పసి శిశువులే మా జన్మ ధన్యమే.  


మొదటి స్టాంజా మా అమ్మ రాధ గారికి అంకితం రెండవ స్టాంజా మా నాన్న గారు తేజ్య గారికి అంకితం మూడవ స్టాంజా నా తోబుట్టువు సంధ్య నందిని కి అంకితం నాల్గవ స్టాంజా నా అర్ధాంగి అనిత కు అంకితం ఐదవ స్టాంజా మా పిల్లలు శరణ్య మరియు హర్ష కు అంకితం  ఇహ అంత కూడా మా ఇలవేల్పు వేంకటేశ్వరుని చల్లని కృపకటాక్షమే.  ~శ్రీధర్ భూక్యా

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల