Skip to main content

మనసు వాకిలి

మనసు  విచిత్రమైనది కలత  చెంది  విసుగెత్తితె  తన మాట తానె ఆలకించదు
నేను నేనుగానే ఉన్నానన్న ఊరుకోదు
కనురెప్పల  మాటున  దాగిన  ఆల్చిప్ప లాంటి    కన్నుల నుండి
ముత్యాల్లాంటి  కన్నీరు  అలా  అలా  ధారలుగా  కంటిని  వీడి
ఏ వైపునకో  పయనమయ్యయి  మనసులో నీ జ్ఞాపకాలు  చెరిగిపోయాయి అనుకున్నాను 
మనసు ఇక తేలిక పడుతుంది అనుకున్నాను కాని నీ జ్ఞాపకాలు ఎల్లవేళలా నన్ను తరుముకునే వస్తున్నాయి
మనసు మళ్ళి నిన్ను తలచి బరువ్వేక్కింది